మద్యం తాగించి... లైంగిక దాడిచేసి... చివరికి
HYD: అమీర్పేట్ గ్రీన్ ల్యాండ్స్ వద్ద అస్సాంకు చెందిన లీసా(30) అనే మహిళపై లైంగిక దాడిచేసి హత్య చేసిన నిందితుడిని పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడు అనంతపురం జిల్లాకు చెందిన వై.రెడప్ప(38)గా గుర్తించారు. నిందితుడు ఆమెకు మద్యం తాగించి ఈఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬

