ఆ చెట్ల ఆకుల్లో బంగారం గుర్తించిన శాస్త్రవేత్తలు (వీడియో #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
INDvSAUS: ఆసీస్ ఘనవిజయం
భారత్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరుసగా రెండో ఓటమి చవిచూసిన భారత్.. సిరీస్ను చేజార్చుకుంది. షార్ట్ (74), కూపర్ (61*) అర్ధశతకాలతో చెలరేగారు. #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
కురుమూర్తి గుట్టపై అఖండ జ్యోతి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి పర్వతంపై కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా వెలిగించే అఖండ జ్యోతి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వందలాది గ్రామాలకు కనిపించే ఈ దీపం ప్రాశస్త్యాన్ని తెలిపేలా జానపద గీతాలు ఉన్నాయి. ఈ అఖండ జ్యోతిని వెలిగించే సేవను తిక్కన్న వంశీయులు తరతరాలుగా నిర్వర్తిస్తున్నారు. ఆ వంశానికి చెందిన శ్రీకాంత్ బుధవారం రాత్రి అఖండ జ్యోతిని వెలిగించారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬
చిరంజీవి అనుమతి లేకుండా "మెగాస్టార్" ట్యాగ్ వాడొద్దు
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హీరో చిరంజీవికి అనుకూలంగా గురువారం తీర్పునిచ్చింది. ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, బిరుదులు, చిత్రాలు, ఫోటోలను ఉపయోగించకుండా ఆన్లైన్ గార్మెంట్స్ సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర సంస్థలను నిరోధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. "మెగాస్టార్" పేరును కొంతమంది చెడుగా, తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారని దీంతో తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని పిటిషన్ వేయడంతో తీర్పు వెల్లడైంది. #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
ప్రముఖ నటి మనోరమ కుమారుడు భూపతి మృతి
ప్రముఖ దివంగత నటి మనోరమ కుమారుడు భూపతి (70) గురువారం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. భూపతి మరణ వార్త సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నటి మనోరమ అక్టోబర్ 10, 2015లోనే చనిపోయిన విషయం తెలిసిందే. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సబేష్ (68) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు సొంత సోదరుడు. సబేష్ 25 చిత్రాలకు పైన సంగీతం అందించారు. ఆయన మరణం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. సబేష్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬
#👉బంగారం ధర కుప్పకూలింది..రేట్లు ఇంకా తగ్గనుందా? #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢