ఉరేసుకుని మహిళా లెక్చరర్ ఆత్మహత్య
AP: మానసికంగా కుంగిపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కడప జిల్లా పొద్దుటూరు సిటీ ఈశ్వర్రెడ్డి నగర్లో జరిగింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తాత వద్ద పెరిగారు. ఇటీవల అక్క కవిత పెళ్లి కాగా మహేశ్వరి(26) తతయ్య వద్దే ఉంటూ అతడి బాగోగులు చూసుకుంటూ చాపాడు మండలంలోని ఓ కాలేజ్లో లెక్చరర్గా పని చేస్తోంది. పేరెంట్స్ చనిపోవడం, అక్కకు పెళ్లవడంతో ఒంటరిగా ఫీలైన మహేశ్వరి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అక్క కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు #🗞️అక్టోబర్ 26th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢

