#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
*🌸ఓం వ్యాసదేవాయ నమః🌸*
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి*🌹
*20. ఓం సాధు గమ్యాయై నమః*
సద్భావమే సాధుభావం. సాధువు అనగా సజ్జనుడు. సాత్త్విక జీవనం, ఉదార ప్రవర్తన గలవాడు సాధువు. (సాధువు అంటే సన్న్యాసి అని కాదు.)
ఏ సాధు సత్పురుషులు ఏయే సాధనలు ఎలా చేసుకున్నా గీతామాతను చేరి, గీతాజ్ఞానం పొంది, తమ గమ్యాలకు చేరాల్సిందే. సాధు సత్పురుషులకు పరమగమ్యం శ్రీమద్భగవద్గీతే. గీతామృతమే వారిని అలా తీర్చి దిద్దుతుంది.
అపి చేత్ సుదురాచారో
భజతే మామనన్యభాక్ ।
సాధురేవ స మంతవ్యః
సమ్యగ్ వ్యవసితో హి సః ॥ 9.30
మిక్కిలి దుష్కర్ముడు అయినప్పటికి అనన్యభక్తి గలవాడై నన్ను భజించినచో, అతడు స్థిరమైన మనోనిశ్చయం చేత సత్పురుషుడే అవుతాడు. అసాధువులను, దుష్టులను కూడా సత్పురుషులుగా మార్చగల మహా మహిమాన్విత గీతామాత. సత్పురుషులను మహాత్ములుగా, మహర్షులుగా తీర్చిదిద్దగల శక్తిసమేత భగవద్గీత.
సాధు సత్పురుషులకు గమ్యస్థానమైన భగవద్గీతకు వినమ్రతతో వందనం చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
