ShareChat
click to see wallet page
*నగ్నంగా ఉన్న వాటిని చూడటానికి పరుగులు పెట్టేవారు లేరా?* *నగ్నంగా ఉన్న బొమ్మలను, నగ్నంగా ఉన్న స్త్రీలను, నగ్నంగా ఉన్న పురుషులను, అమ్మాయిలను అబ్బాయిలను, అందమైన వారిని చూడాలని తాపత్రయం పడేవారు లేరా? ఈ అలవాటు నీలో ఉన్నట్లయితే.. దేవుని చేత నలదిక్కుల నుంచి నలిపివేయబడతావు జాగ్రత్త!! దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేస్తానంటే.. నలు దిక్కులు నుంచి దేవుడు నిన్ను ఏ విధంగా నలిపి వేస్తాడో నీవే కళ్ళారా చూస్తావు.* *దావీదు లాంటి వాడికే తప్ప లేదండి! దావీదు లాంటివాడే ధీమాగా జీవిస్తూ.. ధైర్యంగా తప్పుచేసి ఆ తర్వాత నలుదిక్కుల నుంచి నలిపివేయబడ్డాడనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి!! యెహోవా హృదయానుసారుడైన దావీదు నలుదిక్కుల నుంచి నలిపివేయబడితే.. నిన్ను, నన్ను దేవుడు నలిపివేయకుండా ఎలా మౌనంగా ఉండగలడు? అందుకే జాగ్రత్త పడదాం!!* *ఆనాడు దావీదు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి, నేను ఏమి చేసినా, ఏ తప్పు చేసినా.. ప్రశ్నించేవారు ఎవరూ లేరు అనే ధీమాను బట్టి, తనకున్న ధైర్యాన్ని బట్టి తన దేహాన్ని పాపంతో నింపుకోవడానికి.. ఒక సైనికుడు యొక్క భార్యను ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెతో పాపం చేశాడు. అలా పాపం చేయడమే కాకుండా.. ఆ పాపాన్ని దాసి పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ పాపాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేకుండా.. ప్రశ్నించే వ్యక్తిని బయట ఎవరికీ తెలియకుండా దారుణంగా హత్య చేయించాడు. చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి బదులుగా, కప్పుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఏమీ ఎరగనట్టుగా 9 నెలల పాటు గడిపేశాడు. పాపం చేసి కూడా, హత్య చేసి కూడా.. ఏమీ ఎరగనట్లుగా తాను ఎవరితో పాపం చేశాడో ఆ స్త్రీని ఇంటికి పిలిపించుకొని పెండ్లి కూడా చేసుకున్నాడు. అలాగే ఎవరికి తెలియకుండా తన పరిపాలన కంటిన్యూ చేశాడు. బహుశా దావీదు అనుకోని ఉంటాడు.. పాపాన్ని బహు తెలివిగా భలే కప్పేటేసానో, ఇక నాకు డోకా లేదని అనుకోని ఉంటాడు. దారుణం ఏంటో తెలుసా? దావీదు లాంటివాడే పాపం చేసి 9 నెలల పాటు దేవుని సన్నిధిలో కనిపించలేదు, దేవుని సన్నిధిలో మొరపెట్టలేదు. దేవుని సన్నిధిలో పశ్చాతాపపడలేదు. రోజురోజుకు దావీదు దేవునికి దూరమవుతున్న సమయంలో, రోజురోజుకు దావీదు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్న సమయంలో.. ఇక లాభం లేదని నాతాను అనే ప్రవక్తను దావీదు వద్దకు పంపించి.. దావీదు పాపాన్ని దేవుడు బయటపెట్టించాడు. పాపం ఏదో ఒక రోజు బయటపడక తప్పదు.* *జాగ్రత్తగా వినండి!! ఒక వ్యక్తి ఎవరికీ తెలియకుండా పాపం చేయొచ్చు, గుట్టుచప్పుడు కాకుండా పాపం చేయొచ్చు, అలాగే ఏ ఒక్కరూ కనిపెట్టలేనంతగా పాపం చేయొచ్చు. గుర్తుపెట్టుకో!! పాపాన్ని నీవు విడిచి పెట్టొచ్చు కానీ ఆ పాపం నిన్ను మాత్రము విడిచిపెట్టదని సత్యాన్ని మర్చిపోవద్దు. ఆ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపం నీ తలంపుల్లో ఎప్పుడూ ప్రత్యక్షమై ఉంటుంది. నీవు చేసిన పాపం నీ కళ్ళేదుట కనిపించేటప్పుడు.. నీవు ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాదు. నీవు చేసిన అన్యాయం కావచ్చు, నీవు చేసిన అక్రమం కావచ్చు, నీవు చేసిన అపవిత్రమైన పని కావచ్చు.. అవి ఎప్పుడూ నీ చుట్టూ ప్రదర్శనలు చేస్తూనే ఉంటాయి. బైబిల్ చదివిస్తుంది.. " అది నిన్ను వెంటాడుతుంది, నిన్ను పట్టుకుంటుంది"* *"భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును. దుష్టులకు నెమ్మదియుండదని దేవుడు సెలవిచ్చు చున్నాడు." (యెషయా 57:20,21). దుష్టులకు నెమ్మది ఉండదు. పాపం చేసేవారు నెమ్మదిని పోగొట్టుకుంటారు. సమాధానం పోగొట్టుకుంటారు. దావీదు తాను చేసిన పాపమును బట్టి సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. పాపం చేసే వ్యక్తి మొదటగా దేవునితో సంబంధం పోగొట్టుకుంటాడు. తన చుట్టూ ఉన్న వారందరితో సమాధానం పోగొట్టుకుంటాడు. భక్తిహీనులు, పాపిష్టిలు నెమ్మదిగా ఉండడం సాధ్యం కాదు.* *సాధారణంగా ఒక వ్యక్తి శక్తి కలిగి ఉన్నట్లయితే.. ఆ వ్యక్తి తనను తాను కంట్రోల్లో ఉంచుకోగలుగుతాడు. గుర్రాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి తనుకుంటే గుర్రం కంట్రోల్ లో ఉంటుంది. భక్తిహీనులు కదులుతున్న సముద్రం లాంటి వారు అంటే.. వారు కంట్రోల్ లేనివారు. వారి తలంపులు కంట్రోల్ ఉండదు, వారి పాపిష్టి చూపుల్లో కంట్రోల్ ఉండదు, వారి పాపిష్టి పనుల్లో కంట్రోల్ ఉండదు. వారి నోరు కంట్రోల్ ఉండదు, వారి కాలు కంట్రోల్లో ఉండదు, వారి కళ్ళు కంట్రోల్లో ఉండదు, వారి ఒళ్ళు కంట్రోల్లో ఉండదు. ఈరోజు చాలామంది కంట్రోల్ లేని జీవితం జీవిస్తున్నారు. దుష్టత్వము, పాపము నిన్ను కంట్రోల్లో ఉంచదు.* ****************************************** *ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** *- మీ సహోదరుడు మోషే* *- (Calvary Kiranalu )* *-(📲 9550576444)* #JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు #i love jesu #jesu words
JESU I LOVE YOU JESUS - ShareChat

More like this