#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*23. ఓం వ్యాస సంగ్రథితాయై నమః*
కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో యుద్ధ సన్నద్ధుడైన అర్జునుడు కౌరవసేనలో బంధు, గురు, మిత్రులను చూసి, వారినందరినీ వధించి పాపం మూటగట్టుకోలేనని అస్త్ర సన్న్యాసం చేశాడు. అప్పుడు పార్థ సారధియైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి విషాదం పోగొట్టి, కర్తవ్యం వైపు మళ్లించాడు.
అర్జునుడి సందేహం - ప్రశ్న - శ్రీకృష్ణుని ప్రత్యుత్తరం. ఈ విధంగా గీతోపదేశం సాగింది. ప్రశ్నోత్తర రూపమైన సంవాదాన్ని ‘గీత’ అంటారు. ‘భగవంతం ప్రతి భగవతా గీతా’ అని నిర్వచనం. అనగా భగవత్ తత్త్వం గూర్చి భగవంతుడే గానం చేసినది గీత.
ఆ మహా సందర్భంలో గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా విన్నవారు నలుగురు. 1. ఆర్జునుడు, 2. అర్జునుడి రథం టెక్కెంపై ఉన్న హనుమంతుడు, 3. వ్యాసమహర్షి, 4. వ్యాసమహర్షి అనుగ్రహంతో సంజయుడు.
గీతోపదేశాన్ని గ్రహించి కర్తవ్యపరాయణుడైన వాడు అర్జునుడే అయినా ఆ ఉపదేశం సమస్త మానవాళికీ అవసరమైనదే. అక్కడ అర్జునుడికి చేసిన గీతోపదేశాన్ని గ్రహించి, గ్రంథబద్ధం చేసి లోకానికి అందించిన వారు శ్రీ వ్యాసమహర్షి. వారి అమేయప్రజ్ఞ వల్లనే ఆ 701 శ్లోకాలు శ్రీమద్భగవద్గీతగా కూర్చబడిరది. సమస్త మానవాళికి మేలు కలిగింది.
వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్
ఏతత్ గుహ్యతమం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్
సాక్షాత్ కథయతః స్వయమ్ ॥ 18.75
శ్రీ వ్యాసమహర్షి అనుగ్రహం చేత, నేను ఈ రహస్యమైన, శ్రేష్ఠమైన, యోగమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి తెలుసుకొన్నాను అని సంజయుడు చెపుతున్నాడు.
ఈ విధంగా వేదవ్యాస మహర్షిచే కూర్చబడిన శ్రీమద్భగవద్గీతకు కృతజ్ఞతతో కైమోడ్పు చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
