5️⃣
*_ఆది పర్వము_*
*_ప్రథమాశ్వాసము -1_*
*_5 వ రోజు_*
*_భృగువు_*
*పూర్వం భృగువు అనే మహాముని భార్య పులోమ. అతడి భార్య పేరు పులోమ. ఆమె నిండు గర్భవతిగా ఉన్న సమయంలో భృగువు స్నానానికి వెళుతూ భార్యని హోమాగ్నిని సిద్ధం చేయమన్నాడు. అప్పుడు పులోముడు అనే రాక్షసుడు పులోమను చూసాడు. అతడికి పులోమ మీద మోహం కలిగింది. అతడు అగ్ని దేవునితో ఆమె ఎవరని అడిగారు. అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు. ఈ పులోముడు ఒకప్పుడు పులోమను చేసుకోవాలని అనుకున్నాడు. అయితే పులోమ తండ్రి ఆమెను భృగువుకు ఇచ్చి వివాహం చేసాడు. ఇప్పడు నిజం చెపితే పులోముడు పులోమను ఏమి చేస్తాడో అని భయపడ్డాడు. అదీ కాక భృగువుకు కూడా తన మీద కోపం రావడంమేగాక తనను శపించవచ్చు. కాని నిజం చెప్పకుంటే తనకు అసత్య దోషం అంట వచ్చు. అగ్ని సందిగ్ధంలో పడినా ముని శాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు*. *అనుకొని అసత్య దోషానికి భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడు. అది వినగానే పులోముడు పులోమను గుర్తు పట్టాడు. వివాహం కాక మునుపు ఆమెను పులోముడు చేసుకోవాలని అనుకున్నాడు.* *కానీ ఆమెను భృగువు వివాహం చేసుకున్నాడు.* *ఈ నిజం తెలిసిన రాక్షసుడు పంది రూపంలో పులోమను ఎత్తుకుని వెళ్ళాడు. ఆ కుదుపులకు పులోమ గర్భంలోని శిశువు కింద పడ్డాడు. కింద పడిన కారణంగా అతడికి చ్యవనుడు అన్న పేరు వచ్చింది. చ్యవనుడు కళ్ళు తెరచి చూడగానే ఆ తేజో శక్తికి రాక్షసుడు దగ్ధం అయ్యాడు.*
*అగ్నిహోత్రుడి మీద భృగువు ఆగ్రహించుట*
*తరువాత పులోమ కుమారునితో భర్త దగ్గరకు చేరింది. ఆ తరుణంలో పులోమ కంటి నుండి జాలువారిన కన్నీరు నదిగా మారి ప్రవహించ సాగింది. ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసర అని నామకరణం చేసాడు. నదీ స్నానానికి వెళ్ళిన భృగువు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజోవంతుడైన కుమారుడిని చూసాడు. అప్పుడు పులోమ జరిగినది భర్తకు చెప్పింది*.
*భృగువు భార్యతో “నీవు పులోమ అని నా భార్యవు అని అతడికి ఎలా తెలిసింది" అని అడిగాడు*.
*పులోమ “నాధా! ఈ అగ్నిదేవుడు నేను పులోమ అని, నీ భార్యను అని చెప్పాడు*. *వరాహరూపంలో అతడు నన్ను తీసుకు పోతున్న తరుణంలో కిందకు జారిన చ్యవనుడు తీక్షణతకు రాక్షసుడు భస్మం అయ్యాడు" అని చెప్పింది.*
*అది విని భృగువు కోపించి అగ్నితో*
*“ఆ రాక్షసుడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా నీవు నా భార్య గురించి చెప్పావు కనుక నీవు క్రూరుడవు. అందు వలన నీవు సర్వ భక్షకుడివి అయిపో” అగ్నిదేవుని శపించాడు* #మన సంప్రదాయాలు సమాచారం