Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువు* *294 మద్యం దుకాణాలకు కేవలం 8 దరఖాస్తులే రావడంతో అవాక్కయిన అబ్కారీ శాఖ అధికారులు* *తెలంగాణ రాష్ట్రంలో గత నెల 26వ తేదీ నుండి మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించడం ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ* *ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 మద్యం దుకాణాలు ఉండగా, కేవలం 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి* *వరంగల్ జిల్లాలో 57 షాపులకు 3* *దరఖాస్తులు* *హన్మకొండ జిల్లాలో 67 షాపులకు ఒకటి* *జనగామ జిల్లాలో 50 షాపులకు 2* *మహబూబాబాద్ జిల్లాలో 61 షాపులకు 2 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యాపారులు* *ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 59 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం* #😁Hello🙋‍♂️
*మీరు కూడా అరట్టై యాప్‌కు మారాలనుకుంటున్నారా?* *అయితే ఈ కథనం మీకు చాలా సహాయపడుతుంది ?* *వాట్సాప్ నుండి అరట్టై యాప్‌కు మారడం* *ఇటీవలి కాలంలో మెటా (Meta)కు చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. దాన్ని వదిలి కొత్త యాప్‌కు మారడం అంత సులభం కాదు. కానీ, ఎవరూ ఊహించని విధంగా చాలా మంది వేగంగా అరట్టై యాప్‌కు మారుతున్నారు*. *భారతదేశంలో రూపొందించబడిన జోహో (Zoho) సంస్థకు చెందిన అరట్టై యాప్, ఈ మార్పును కొంచెం సులభతరం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ యాప్ ఇప్పుడు మీ వాట్సాప్ సంభాషణలను (Chats) నేరుగా దిగుమతి చేసుకోవడాన్ని (Import) అనుమతిస్తోంది. అంటే, మీరు మీ చాట్‌లను కొత్తగా మొదలుపెట్టాల్సిన అవసరం లేదు*. *చాలా మంది వినియోగదారులకు, పాత సంభాషణలను కోల్పోతామనే ఆందోళన ఉంటుంది. ఈ భయమే కొత్త మెసేజింగ్ యాప్‌ను ప్రయత్నించడానికి అతిపెద్ద అడ్డంకిగా ఉంది. అరట్టై యాప్ అందించే ఇంపోర్ట్ ఆప్షన్ ఈ లోపాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ఇది వ్యక్తిగత మరియు గ్రూప్ చాట్‌లను తన ప్లాట్‌ఫామ్‌కు తరలించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. దీని ద్వారా వినియోగదారుల సంభాషణలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి*. *వాట్సాప్ చాట్‌లను అరట్టై యాప్‌కు ఎలా మార్చాలి?* *చాట్‌లను మార్చే ముందు, మీరు ఎవరితో సంభాషణలను మార్చాలనుకుంటున్నారో ఆ వ్యక్తి లేదా గ్రూప్ సభ్యులు ఇప్పటికే వారి ఫోన్‌లో అరట్టై యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారని నిర్ధారించుకోండి. కాంటాక్టులను సింక్ చేయడానికి యాప్‌కు అనుమతి అవసరం. ఒకవేళ మీ స్నేహితుడి నంబర్ అరట్టైలో కనిపించకపోతే, వారికి ఒక సాధారణ "hi" మెసేజ్ పంపి థ్రెడ్‌ను యాక్టివేట్ చేయండి. ఆ తర్వాత, బదిలీ ప్రక్రియ (Transfer Process) నేరుగా వాట్సాప్ నుండి ప్రారంభమవుతుంది*. *దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ ఇక్కడ ఉంది:* *వాట్సాప్‌ను తెరిచి, మీరు* *తరలించాలనుకుంటున్న చాట్ యొక్క సెట్టింగ్‌లకు వెళ్లండి.* *దీని కోసం, కుడి ఎగువన ఉన్న మూడు చుక్కలపై (Three dots) నొక్కండి.* *మెనూ నుండి "More" (మరిన్ని) ఎంపికను ఎంచుకోండి*. *"Export Chats" (చాట్‌లను ఎగుమతి చేయండి)ను ఎంచుకోండి*. *ఈ దశలో, ఫోటోలు మరియు వీడియోల వంటి 'మీడియా'ను కూడా చేర్చాలా లేదా చాట్‌లను మాత్రమే తరలించాలా అని మిమ్మల్ని అడుగుతుంది. దానికి సమాధానం ఇవ్వండి*. *ఎంచుకున్న తర్వాత, చాట్‌లను ఎగుమతి చేయగల యాప్‌ల జాబితాను వాట్సాప్ మీకు చూపుతుంది*. *ఆ జాబితా నుండి అరట్టై యాప్‌ను ఎంచుకోండి*. *అరట్టై చిహ్నంపై నొక్కిన తర్వాత, ఇప్పటికే అరట్టైని ఉపయోగిస్తున్న కాంటాక్టులు కనిపిస్తాయి.* *కాంటాక్ట్ లేదా గ్రూప్‌ను ఎంచుకుని, Import (దిగుమతి) బటన్‌ను నొక్కండి*. *చాట్‌లను అరట్టై యాప్‌కు బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది*. *ఈ ప్రక్రియ చాలా సూటిగా ఉంటుంది. అయితే, దీనికి ఒక నిబంధన ఉంది: మీరు చాట్‌లను మార్చాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ సభ్యులు అరట్టై యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటేనే ఈ ఫీచర్ పనిచేస్తుంది. వారు అరట్టై యాప్‌లో లేకపోతే, మీరు వారి చాట్‌ను దిగుమతి చేసుకోలేరు*. *_అరట్టై యాప్ ఎందుకు ముఖ్యం?_* *చాలా* *సంవత్సరాలుగా, మెసేజింగ్, వ్యాపార గ్రూప్‌లు, కుటుంబ అప్‌డేట్‌లు మరియు పెళ్లి ప్లానింగ్‌ల వంటి అనేక పనులకు వాట్సాప్ అందరికీ ఇష్టమైన యాప్‌గా ఉంది. దీని నుండి మరొక యాప్‌కు మారడం దాదాపు ఇళ్లు మారిన అనుభూతిని ఇస్తుంది*. *చాట్ ఇంపోర్ట్ సపోర్ట్ ద్వారా, అరట్టై యాప్ ఆ అడ్డంకిని తగ్గించి, వినియోగదారులకు ఒక కొనసాగింపును అందించడానికి ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా, భారతదేశంలో ఒక భారతీయుడు తయారుచేసిన యాప్ కావడం దీనికి మరింత ప్రాధాన్యత ఇస్తుంది*. *పాత మెసేజ్‌లు ముఖ్యమైన సంభాషణలలో కూడా ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు ఒక చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లయితే మరియు వాట్సాప్‌లో కస్టమర్ ఆర్డర్‌ల రికార్డులను కలిగి ఉన్నట్లయితే, ఆ చాట్‌లను కోల్పోకుండా అరట్టైకి మారడం ఒక పెద్ద ఉపశమనం కావచ్చు*. *వినియోగదారులు గుర్తుంచుకోవాల్సినవి* *వాయిస్ మరియు వీడియో కాల్స్ ఎన్‌క్రిప్ట్ చేయబడినప్పటికీ, అరట్టై యాప్‌లో చాట్‌లకు పూర్తి స్థాయి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఇంకా పూర్తిగా అందించబడలేదు. అరట్టై యాప్ వాట్సాప్ యొక్క భద్రతా ప్రమాణాలను అనుసరించాలనుకుంటే, జోహో దీన్ని బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు*. *అయినప్పటికీ, వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్‌ల మధ్య, చాట్‌లను ఎగుమతి చేయగల సామర్థ్యం అరట్టై యాప్‌లో ఉన్న ఒక అరుదైన ఫీచర్. ఇది మరింత ఎక్కువ మంది వినియోగదారులను అరట్టై యాప్‌ను ప్రయత్నించడానికి ప్రేరేపించవచ్చు. ప్రస్తుతానికి, మారాలనుకునే వినియోగదారులు, తమ డిజిటల్ జీవితాన్ని రీసెట్ చేయకుండానే కొత్త యాప్‌లో చాట్‌లను ఉపయోగించడం ప్రారంభించవచ్చు.* #మన సంప్రదాయాలు సమాచారం
*_మన ఆరోగ్యం…!_* *_ఖ‌ర్జూరపండు_* *_Dates : చ‌లికాలంలో ఖ‌ర్జూరాల‌ను రోజూ తినాలి.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4 ఖ‌ర్జూరాల‌ను తింటే చాలు..!_* *కాలం మారుతున్న కొద్దీ మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కాలానికి అనుగుణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి, కనుక ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి*. *ముఖ్యంగా చలి కాలంలో మన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవటం వల్ల వీలైనంతవరకు మన శరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే చలికాలంలో ఖర్జూరాలు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి*. *ఖర్జూరాలను తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...* *1. ఖర్జూరాలను పోషక విలువల రారాజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఖర్జూరాలు ఒక వరం. ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే రక్తం బాగా తయారవుతుంది* *2. ముందు రోజు రాత్రి ఖర్జూరాలను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ప్రతి రోజూ రెండు ఖర్జూరాలను తినడం వల్ల గుండె సమస్యలు మీ దరిచేరవు*. *3. చాలా మంది మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలతో సతమతం అవుతుంటారు. చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కనుక అలాంటి వారు ప్రతి రోజూ రాత్రి రెండు లేదా మూడు ఖర్జూరాలను తిని పడుకోవడం ద్వారా ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. దీంతోపాటు మలబద్దకం కూడా తగ్గుతుంది. మరుసటి రోజు ఉదయం వరకు ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. సుఖ విరేచనం అవుతుంది.* *4. చలికాలంలో ప్రతి ఒక్కరినీ దగ్గు, జలుబు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారు ఒక గ్లాస్ నీటిలో రెండు ఖర్జూరాలు, 5 నల్ల మిరియాలు వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఆ నీటిని వడబోసి తాగటం ద్వారా.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు*. *5. ఆస్తమా సమస్యతో సతమతమయ్యే వారికి ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బాలింతలు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల పిల్లలకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతాయి* *_-సేకరణ_*. #మన సంప్రదాయాలు సమాచారం
4️⃣ *_ఆది పర్వము_* *_ప్రథమాశ్వాసము -1_* *_4 వ రోజు_* *తక్షకుని మీద ఉదంకుని ప్రతీకారం* *అనుకున్న కార్యం నెరవేరినా ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు. అందు కొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు*.  *ఉదంకుడు జనమేజయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు.* *“జనమేజయ మహారాజా! నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు*. *నేను గురువు గారి కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేసాడు*. *నాకే కాదు నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేసాడు*. *శృంగి శాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రైన పరీక్షిత్తు*  *మహారాజును అతి క్రూరంగా కాటు వేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలి చేసి చంపాడు*. *మహా బలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షిత్తు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకుని దారుణంగా చంపాడు కదా! నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో. మహారాజా! ఒక్కడు తప్పు చేసిన అతడి కులమంతా తప్పు చేసి నట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు. కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి" అని జనమేజయుని రెచ్చకొట్టాడు.* ``` *నాగులకు కద్రువ శాపం* *ఈ కథ వింటున్న శౌనకాది మునులు “మహాత్మా! నాగలోకం యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరు కారణం ఏదైనా ఉందా?” అని అడిగారు.* *అందుకు సూతుడు... “మహామహులారా! పూర్వం కద్రువ తన కుమారులైన నాగులకు ఇచ్చిన శాపం కూడా ఇందుకు ఒక కారణం*. *జనమేజయుడు చేయబోతున్న యాగంలో కద్రువ శాపకారణంగా సర్పకులమంతా నశిస్తున్న సమయంలో పూర్వం రూరుడు సర్పకులాన్ని అంతా నాశనం చేస్తున్న తరుణంలో సహస్రపాదుడు ఆపిన చందంగా సర్పయాగంలో పడి మరణిస్తున్న నాగులను జరత్కారుని కుమారుడైన ఆస్తీకుడు ఆపివేసాడు. ఆ వృత్తాంతం వివరిస్తాను వినండి" అని చెప్పాడు.* #మన సంప్రదాయాలు సమాచారం
*_రామానుజుల వారి జనన రహస్యం_*. *_మహీధరాయ నమః..!!!_* *ద్వాపరయుగం అంత్య దశలో భూలోకంలో దుష్టుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆ దుర్మార్గుల అరాచకాన్ని, భారాన్ని మోయలేక భూదేవి తల్లడిల్లి పోయినది.* *దేవతల సహాయం ఆశించి భూదేవి గో రూపం లో బ్రహ్మ వద్దకి వెళ్ళి ప్రార్ధించినది*. *అప్పుడు బ్రహ్మదేవుడు “భూమి భారాన్ని తగ్గించే శక్తి మహావిష్ణువుకే వుంది” అని గో రూపంలోని భూదేవిని, దేవతలని తన వెంట రమ్మని పాలకడలి వెళ్ళాడు. అక్కడ ఆదిశేషునిపైన పవళించిన మహావిష్ణువు దగ్గర భూదేవి బాధలను బ్రహ్మదేవుడు దేవతలు వినిపించి భూభారం తగ్గించి అనుగ్రహించమని ప్రార్ధించారు*. *అప్పుడు మహావిష్ణువు “భూదేవి..* *భయపడకు! గో రూపంలో వచ్చి ప్రార్ధన చేసిన నీకు గోవులను కాసే గోపాలునిగా అవతరించి నీ బాధలు తీర్చి ధర్మరక్షణ చేస్తాను!” అని వాగ్దానం చేశాడు*. *ఆవిధంగానే మహావిష్ణువు కృష్ణుని గా అవతరించి కంసుని, శిశుపాలుని, దంతవక్త్రుని, జరాసంధుడిని, కౌరవులను, నరకాసురుని మొదలైన అనేకమంది దుష్టులను సంహరించాడు. భూమి భారాన్ని తగ్గించి తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు*. *శ్రీ కృష్ణుడు తన అవతారం చాలించి వెళ్ళినంతనే భూలోకంలో ద్వాపరయుగం గతించి కలియుగం ఆరంభమైనది.* *కలి ప్రభావంతో తిరిగి దుర్మార్గాలు అధికమయ్యాయి. ద్వాపరయుగంలో కన్నా కలియుగంలో దుర్మార్గాలు మరింత ఎక్కువగా అయ్యాయి. అది చూసి మహావిష్ణువు మహాలక్ష్మితో... “దేవీ భూమి మీద దుర్మార్గుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. ఇప్పుడు మరల నేను అవతారం దాల్చి దుర్మార్గాన్ని మొత్తంగా అణచివేసే సమయం ఆసన్నమయింది!” అని అన్నాడు*. *అందుకు మహాలక్ష్మి… “స్వామీ .. మీరు అవతారం దాల్చి దుష్టులను నిర్మూలిస్తే భూలోకంలో ఎనభైశాతం ప్రజలను నిర్మూలించవలసి వుంటుంది. కొంచెం ఆలోచించండి. ఈ కార్యానికి ఈసారి మీకు బదులుగా ఆ బాధ్యతను ఆదిశేషువు కు అప్పగించండి!” అని సలహా ఇచ్చింది.* *“ఆదిశేషువు మాత్రం వెళ్ళి భూలోకంలో దుర్జన నిర్మూలన చేసి భూభారం తగ్గించగలడా?” అని అడిగాడు మహావిష్ణువు*. *అందుకు మహాలక్ష్మి.. “స్వామీ.. దుష్టులు పెరగడం భూమికి భారం కానీ సజ్జనులు భూమికి భారంకాదు. కృష్ణావతారంలో దుష్టులను మాత్రం సంహరించి భూదేవి భారం తగ్గించారు.* *కాని కలియుగం లో అది అసాధ్యం. అందువలన ఆదిశేషువుని ఒక ఆచార్యునిగా అవతరింపచేసి ఆయన ద్వారా లోకానికి మంచి ఉపదేశాలను బోధించి దుర్మార్గులనందరిని సన్మార్గంలో పెట్టడానికి తీవ్రంగా కృషిచేస్తే, ప్రజలంతా సజ్జనులై సన్మార్గ మార్గాన జీవిస్తే భూమికి భారం తగ్గినట్లే!" అన్నది మహాలక్ష్మి*. *“పాటించ తగిన ఆలోచన" అని ఆదిశేషువుని పిలిచి.. “నీవు భూలోకంలో అవతరించి సకల వేద, ధర్మ శాస్త్రాలను, ఉపనిషత్తులను పామరులకు కూడా అర్ధమయ్యేలాగ ఉపదేశించి, ప్రజలను సన్మార్గులుగా తీర్చిదిద్ది రమ్మని ఆదేశించాడు మహావిష్ణువు.* *పరమాత్మ ఆజ్ఞానుబద్దుడై ఆదిశేషువు రామానుజాచార్యులుగా అవతరించి వేదార్ధ, ఉపనిషత్తుల సారాంశాన్ని ధర్మనిరతిని పాటిస్తూ పామరులకు కూడా అర్ధమయ్యేలాగా ఉపదేశించి అనేకమందిని సజ్జనులుగాను, పండితులుగాను, ఆధ్యాత్మికా తత్పరులుగానూ మార్చగలిగాడు. అందువలన భూమికి కొంత భారం తగ్గినది.* *రామానుజుల వారి అవతారం గురించి, ఆ ఆచార్యుని బోధలు కలియుగంలో మంచి మార్పులు తెస్తుందని ‘మణవాళ మాముని’ ముందుగానే సూచించారు.* *ఈవిధంగా మహావిష్ణువు తానో లేక, ఆదిశేషువు వంటి తన భక్తదాసుల ద్వారానో, భూభారాన్ని తగ్గిస్తూ భూమిని కాపాడుతున్నందున నారాయణుడు “మహీధరః” పిలువబడుతున్నాడు*. *ఈ నామమే అనంతుని వేయినామాలలో 371వ నామము.* *“మహీధరాయ నమః” నిత్యం జపించే భక్తులను కాపాడుతూ రజో, తమోగుణ ప్రధానులైన దుర్మార్గులను మహావిష్ణువు నిర్మూలించి అనుగ్రహం ప్రసాదిస్తాడు..* #మన సంప్రదాయాలు సమాచారం
*_మాయా గంగాళం (విదేశీ జానపద కథ)_* *ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను చానా దుర్మార్గుడు.* *ఎక్కువ పని చేపించుకొని తక్కువ కూలి ఇచ్చేవాడు. ఆపదల్లో అధిక వడ్డీకి అప్పులిచ్చి తీర్చలేకపోతే వాళ్ళ పొలాలు, ఇల్లు గుంజుకునేవాడు.* *పదిమంది గుండాలు ఎప్పుడూ వెంట వేసుకొని తిరిగేవాడు*. *జనాలు పన్నెత్తి మాట్లాడినా, కన్నెత్తి చూసినా వాళ్ళు దాడి చేసేవాళ్లు. దాంతో ఆ ఊరిలోని వాళ్ళందరూ వాని పేరు చెబితే చాలు భయంతో వణికిపోయేవారు*. *ఆ ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు*. *ధనవంతుని పొలం పక్కనే అతని పొలం ఉండేది. ఒకసారి ఆ ముసలోని పెళ్ళాం జబ్బు పడింది.* *సమయానికి డబ్బు లేక ధనవంతుని దగ్గర అప్పు చేశాడు. దాన్ని తీర్చడానికి అతని పొలంలోనే కూలీగా పని చేశాడు. కానీ ఎన్ని రోజులు పని చేసినా ''నీ జీతం వడ్డీకి కూడా సరిపోలేదు''* *అంటూ బలవంతంగా పొలం గుంజుకొని తరిమేశాడు.* *పాపం ముసలాయన పెళ్ళాంతో కలసి ఊరి బయట వున్న ఒక పాడుబడిన కొట్టంలోకి చేరుకున్నాడు. రోజుకి ఒక పూట తినడం కూడా చానా కష్టంగా మారింది. వాళ్ల దగ్గర ఒక ఆవు ఉంది. అది గూడా తినడానికి పచ్చగడ్డి లేక బాగా బక్కచిక్కిపోయింది*. *ఒకరోజు ముసలామె ''ఈ అవును మనం పెంచలేం గానీ సంతకుపోయి అయినకాడికి అమ్ముకొని రాపో'' అని పంపించింది*. *ముసలోడు ఆవును తీసుకొని పోతావుంటే దారిలో ఒక మరుగుజ్జు కనపడ్డాడు. సరిగ్గా మోకాలంత ఎత్తు ఉన్నాడు. వానికి నాలుగింతల పెద్దగా వున్న ఒక గంగాళాన్ని మోసుకుంటా ఎదురుగా వచ్చాడు*. *ఆ మరుగుజ్జు ముసలోన్ని చూసి ''ఏం తాతా... ఆవును అమ్మడానికి తీసుకొని పోతున్నావా. నాకు ఇవ్వు. ఈ గంగాళాన్ని నీకు ఇస్తా'' అన్నాడు*. *''ఈ గంగాలాన్ని నేనేం చేసుకుంటా...* *తినడానికి పనికొస్తుందా తిరగడానికి పనికొస్తుందా...* *నాకొద్దు'' అన్నాడు ముసలోడు.* *వెంటనే ఆ గంగాళం మరుగుజ్జు భుజంపై నుండి ఎగిరి కిందికి దూకి* *''వద్దనకు వద్దనకు ఓ తాత* *వెంటనే తీసుకో ఓ తాత* *బాధలే తీరుస్తా ఓ తాత* *నీ తలరాతనే మారుస్తా ఓ తాత'' అంది.* *అది మాట్లాడ్డం చూసి ముసలోడు అదిరిపడ్డాడు*. *''కొంపతీసి దీంట్లో దయ్యం గానీ, భూతం గానీ లేదు కదా'' అన్నాడు వణికిపోతూ.* *మరుగుజ్జు నవ్వేసి ''ఇది అల్లాటప్పా మామూలు గంగాళం కాదు. మాయా గంగాళం. మంచోళ్ళకు మంచి, చెడ్డోళ్లకు చెడు చేస్తాది. భయపడకు తీసుకో. నా మాట నమ్ము. నీ సమస్యలన్నీ తీర్చి మరలా నా దగ్గరికి వచ్చేస్తాది. ఈ మధ్యనే నాకు కూతురు పుట్టిది.* *పాపకు పాలు అవసరం'' అన్నాడు.* *మరుగుజ్జు అంతగా చెబుతా వుంటే ముసలోడు కాదనలేకపోయాడు. తన దగ్గర వున్న ఆవుని ఇచ్చి ఆ మాట్లాడే మాయా గంగాళాన్ని తీసుకొని బయలుదేరాడు*. *గంగాళాన్ని నెత్తిన పెట్టుకొని ఇంటికొచ్చిన మొగున్ని చూసి ముసలామెకు కోపం ముంచుకొచ్చింది.* *బంగారం లాంటి ఆవుని ఇచ్చి పనికిరాని తుప్పు పట్టిన ఈ గంగాళాన్ని తీసుకొస్తావా... ఏం చేయాల దీన్ని. నెత్తిన పెట్టుకొని ఊరేగమంటావా... లేక దేవుని గూట్లో పెట్టి పూజ చేయమంటావా'' అంటూ విసుగ్గా విసిరి మూలకు పడేసింది.* *కింద పడిన గంగాళం చిన్నపిల్లోని మాదిరి ఎగురుకుంటా అవ్వ దగ్గరికి వచ్చి* *''కోప్పడకు కోప్పడకు ఓ అవ్వ* *ముసలోన్ని తిట్టకు మా అవ్వ* *వచ్చాను వచ్చాను మీ ఇంటికి* *మేలు చేసి పోతాను మా ఇంటికి'' అంది.* *గంగాళం అలా మాట్లాడతా వుంటే అవ్వ భయంతో నోరెళ్లబెట్టింది*. *అంతలో ముసలోడు జరిగిందంతా చెప్పాడు*. *దాంతో ఆమె సరేనని దాన్ని తీసుకుపోయి జాలాడిలో వేసి తుప్పు అంతా వదిలిపోయేలా తెల్లగా తోమింది.* *ఎండకు అది తళతళా మెరవసాగింది.* *అంతలో ఆ గంగాళం ఎగురుకుంటా అవ్వ దగ్గరికి వచ్చి* *''అవ్వా అవ్వా పొయ్యంటించు* *పొయ్యి మీదకు నన్నెక్కించు* *సుర్రుమంటే తుర్రుమంటా* *దొరికిందంతా తెస్తా ఉంటా'' అంది*. *సరే ఈ తమాషా ఏదో చూద్దామనుకొని ముసలామె గంగాళాన్ని పొయ్యి మీదికి ఎక్కించి కింద మంట పెట్టింది. అది సలసలసల కాగడం ఆలస్యం పొయ్యి మీద నుంచి ఎగిరి కిందికి దూకింది*. *''అవ్వా అవ్వా పోయొస్తా* *దొంగోనిల్లు చూసొస్తా* *తినడానికన్నీ తెచ్చేస్తా* *కడుపులన్నీ నింపేస్తా''* *అంటూ కిటికీలోంచి ఎగిరి బైటికు దుంకింది.* *ఆరోజు ధనవంతుని ఇంటికి చానామంది బంధువులు వచ్చారు.* *వచ్చినవాళ్ళ ముందు ధనవంతుడు తన గొప్పతనాన్ని చాటుకోడానికి పెళ్ళాంతో ''ఏమే*... *మా వాళ్ళ కోసం బళ్లారి కొబ్బరి, మంచి నెయ్యి వేసి తియ్యని పాయసం చెయ్‌*. *గోడంబి, ద్రాక్ష డబ్బా మొత్తం వేసెయ్‌. ఒక్క చుక్క నోట్లో పోసుకుంటే చాలు కమ్మగా అదిరిపోవాల చూడు'' అన్నాడు*. *ఆ ధనవంతుని పెళ్ళాం సరేనని పాయసానికి కావలసిన సరుకులన్నీ తెచ్చి వంటింట్లో కుప్పబోసింది.* *అంతమందికి సరిపోయే పాత్ర ఏముందబ్బా అని చూడసాగింది. సరిగ్గా అదే సమయానికి ఆ మాయాగంగాళం కిటికీలోంచి చప్పుడు కాకుండా లోపలికి దూరి ఒక మూలన కూర్చుంది. వంట పాత్ర కోసం వెతుకుతా వున్న ధనవంతుని పెళ్ళానికి అది కనపడింది. ''అరే...* *ఇది ఎప్పుడు కొనుక్కొచ్చాడు నా మొగుడు. ఒక్కటి కూడా సరిగా చెప్పడు''* *అనుకుంటూ గంగాళాన్ని తీసుకుపోయి పొయ్యి మీదికి ఎక్కించింది .* *సెనగబ్యాళ్లు, పాలు, నెయ్యి, బెల్లం, ద్రాక్ష, జీడిపప్పు... అన్నీ వేసి ఘుమఘుమలాడేలా కమ్మని పాయసం చేసింది*. *బంధువులందరినీ అన్నానికి కూర్చోమని చెప్పి పాయసం తీసుకురావడానికి లోపలికి పోయింది*. *వంటింట్లోంచి ఆమె అట్లా పక్కకు పోవడం ఆలస్యం ఆ గంగాళం కన్నుమూసి తెరిచేంతలోగా పాయసంతో సహా ఎగిరి బయటకు దుంకింది. సంబరంగా ఎగురుకుంటా పోయి ముసలోని ఇంటికి చేరింది.* *''అవ్వా అవ్వా పాయసం* *తియ్యాతియ్యని పాయసం* *కమ్మ కమ్మగా తినండి* *కడుపునిండా మెక్కండి'' అంది*. *వాళ్ళు ఆ పాయసాన్ని చూసి సంబరంగా తాము తిని చుట్టుపక్క వాళ్ళనంతా పిలిచి కడుపునిండా పెట్టారు*. *ధనవంతుని పెళ్ళాం అందరూ అన్నానికి కూర్చున్నాక వడ్డిద్దామని పాయసం కోసం లోపలికిపోయింది*. *చూస్తే ఇంకేముంది... గంగాళమూ లేదు*. *పాయసమూ లేదు. ఉత్త పొయ్యి వెక్కిరిస్తా కనపడింది. ఉత్త చేతులు ఊపుకుంటా వచ్చిన ఆమెను చూసి బంధువులంతా ''ఛీ...* *ఛీ... పాయసం పాయసం అంటూ పొద్దున్నుంచీ ఊరించి ఊరించి ఇప్పుడు ఉత్త చేతులు చూపి అవమానిస్తారా...* *ఇంకెప్పుడు సచ్చినా ఇట్లా అబద్ధాలు చెప్పే నీలాంటోళ్ళ ఇంటి గడప అసలు తొక్కగూడదు''* *అంటూ పెట్టే బేడా సర్దుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు*. *ముసలామె తర్వాతరోజు పొద్దున్నే మరలా ఆ గంగాళాన్ని పొయ్యి మీదికి ఎక్కించి కింద మంట పెట్టింది*. *అది సలసలసల కాగడం ఆలస్యం పొయ్యి మీద నుంచి ఎగిరి కిందికి దుంకి* *''అవ్వా అవ్వా పోయొస్తా* *పొలాలన్నీ తిరిగొస్తా* *ఇంటికి ధాన్యం* *తెచ్చేస్తా* *సంచులన్నీ నింపేస్తా'' అంటూ కిటికీలో నుంచి ఎగిరి బైటకు దుంకింది.* *ధనవంతుని పొలంలో కోతలన్నీ పూర్తయ్యాయి*. *దాన్యం కుప్పలు పోసి ఉన్నాయి. వాటిని సంచీలకు ఎత్తుతా వున్నారు. గంగాళం పోయి ఒక ధాన్యం కుప్ప పక్కన నిలబడింది*. *దాన్ని చూసి వాళ్ళు ''ఓహో... దీన్ని కూడా ధాన్యం నింపడం కోసం ఇక్కడ తెచ్చి పెట్టినట్లు ఉన్నారు'' అనుకొని* *ధాన్యం పోయసాగారు. కానీ ఎంత పోసినా అది నిండడం లేదు*. *పోసినవి పోసినట్లు లోపలికి పోతావున్నాయి*. *చూస్తుండగానే కుప్ప ఖాళీ అయింది.* *అంతే... ఆ గంగాళం నెమ్మదిగా జరుగుతా జరుగుతా వెనక్కి వెళ్ళిపోయింది*. *ఎవరూ చూడని సమయంలో* *ఒక్కసారిగా ఎగురుకుంటూ ముసలోని ఇంటికి చేరుకుంది.* *''అవ్వా అవ్వా* *సంచులు తియ్‌* *ధాన్యంతోనా నింపేసెయ్‌* *చుట్టూ పక్కల పిలిచేసెయ్‌* *తలాకొంచం పంచేసెయ్‌'' అంది.* *ముసలామె సంబరంగా ఇల్లంతా నింపుకొని మిగిలినవి చుట్టుపక్కల జనాలకు పంచి పెట్టింది*. *తర్వాతరోజు పొద్దున్నే ముసలామె ఎప్పట్లాగే గంగాళాన్ని మరలా పొయ్యి మీదికి ఎక్కించి మంట పెట్టింది.* *అది సలసలసల కాగడం ఆలస్యం ఎగిరి కిందికి దుంకింది.* *''అవ్వా అవ్వా పోయొస్తా* *వీధీ వీధీ తిరిగొస్తా* *మోసగాళ్లనే మోసం చేస్తా* *దొంగోళ్లనే దోచుకోస్తా''* *అంటూ ఎగురుకుంటా బయటికి పోయింది.* *సరిగ్గా అదే సమయానికి ఆ ధనవంతుడు తన గదిలో కూర్చుని సంపాదించిన బంగారు వరహాలన్నీ కుప్ప పోసి లెక్క పెట్టుకుంటా ఉన్నాడు.* *ఆ గంగాళం నెమ్మదిగా కిటికీలోంచి లోపలికి దూరి చప్పుడు చేయకుండా ధనవంతుని వెనుకకు పోయి నిలబడింది*. *ధనవంతుడు బంగారాన్ని ఎక్కడ దాచిపెడదామా అని చుట్టూ చూస్తావుంటే ఈ గంగాళం తళాతళా మెరిసిపోతా కనపడింది.* *''అరే... ఇది భలేగుందే. నా పెళ్ళాం కొత్తగా కొన్నట్లుంది''* *అనుకొని ఆ వరహాలన్నీ దాంట్లో వేసి నింపాడు.* *అంతే... అది మరుక్షణమే అక్కడినుంచి ఎగిరి కిటికీలోంచి బయటకు దూకింది*. *ధనవంతుడు లబలబలాడుకుంటూ బైటికి వచ్చేసరికి కనపడకుండా మాయమైంది.* *పాయసం ఎత్తుకుపోయిందీ*, *ధాన్యం కొట్టుకపోయిందీ,* *వరహాలు మాయం చేసిందీ... ఆ గంగాళమే అని తెలుసుకొని... దాన్ని6 ఎలాగైనాసరే పట్టుకోవాలని వెతుక్కుంటా బయలుదేరాడు*. *ఆ గంగాళం ఎగురుకుంటా ముసలవ్వ ఇంటికి చేరుకుంది.* *''అవ్వా అవ్వా వచ్చేసెయ్‌* *వరహాలన్నీ దాచేసెయ్‌* *పేదవారికీ దానంచెయ్‌* *మంచిగ నువ్వూ బతికేసెయ్‌'' అంది.* *ఆ ముసలామె ఆ వరహాలన్నీ తీసుకుని ఎవరికీ కనబడకుండా భద్రంగా దాచి పెట్టింది.* *తర్వాతరోజు పొద్దున్నే ముసలామె ఆ గంగాళాన్ని తీసుకొని ఎప్పటిలాగే పొయ్యి మీదికి ఎక్కించి మంట పెట్టింది. అది ఎర్రగా సలసలసల కాగడం ఆలస్యం పొయ్యి మీద నుంచి ఎగిరి కిందికి దూకింది.* *''అవ్వా అవ్వా పట్టుకుపోతా* *దొంగోన్నింకా ఎత్తుకుపోతా* *పట్టిన శనిని వదిలించేస్తా* *ఊరికంతా మేలే చేస్తా'' అంటూ ఎగురుకుంటా బయటికి పోయింది.* *ధనవంతుడు ఆ గంగాళాన్ని వెతుక్కుంటూ పొలాల్లో పిచ్చిపట్టినవానిలా తిరుగుతా ఉన్నాడు. వానికి కనపడేలా ఒక చెట్టు కిందకు వచ్చి ఆగింది. దానిని చూడగానే ధనవంతుడు సంబరంగా ''హమ్మయ్య దొరికింది. దీన్ని ఇంక అస్సలు వదలిపెట్టకూడదు'' అనుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా దగ్గరకొచ్చి ఎగిరి గట్టిగా వాటేసుకున్నాడు.* *అంతే... మరుక్షణమే ఆ గంగాళం ఆ ధనవంతంతో సహా వేగంగా గాలిలో ఎగురుకుంటా సర్రున దూసుకుపోయింది. అది వాగులు దాటింది. వంకలు దాటింది. కొండలు దాటింది. అడవులు దాటింది. అలా అది ఎక్కడికి పోయిందో... ఏమయిందో ఎవరికీ తెలీదు. ఆ ఊరివాళ్ళు ఆ గంగాళాన్ని గానీ, ధనవంతునితో గానీ మరలా ఎప్పుడూ ఎక్కడా చూడలేదు.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ಮೌಯ್ ೧೦೧೬೪೦ (విదేశీ జానపదకథ) ಮೌಯ್ ೧೦೧೬೪೦ (విదేశీ జానపదకథ) - ShareChat
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:14