Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_6️⃣6️⃣_* *_సంపూర్ణ మహాభారతము_* *_66 వ రోజు_* *_సభా పర్వము ద్వితీయాశ్వాసము_* *పాండవులు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వద్ద శలవు తీసుకున్నారు. కుంతీ దేవి వద్దకు వచ్చారు. ఆమె “పుత్రులారా! ఇలాంటి దుస్థితి వస్తుందని ముందుగా ఊహించి మీ తండ్రి, మాద్రి స్వర్గానికి వెళ్ళారు. నేను దురదృష్టవంతురాలిని కృష్ణా! నా కుమారులను కాపాడు" అని ప్రార్థించింది*. *కొడుకులను కోడలిని దీవించి పంపింది. అందరూ అడవికి పయనమయ్యారు. దుశ్శాసనుడు “ద్రౌపదీ! ఈ పాండవులు అరణ్యంలో తిరుగుతుంటే నీకు ప్రీతి ఎలా కలుగుతుంది. కౌరవులు ధన సంపన్నులు వీరిలో ఎవరినైనా నీ కిష్టమైన వానిని వరించు" అని పాండవులు వినేతట్లు అన్నాడు.* *“నీవు శకుని మాయా ప్రభావంతో గెలుచుకున్న రాజ్య మదంతో మమ్ములను బాధిస్తున్నావు. యుద్ధంలో నీ మర్మస్థానాలను బ్రద్దలు చేస్తూ ఈ నీ మాటలను గుర్తుచేస్తాను” అని భీముడు మాటాడుతుంటే.. దుశ్శాసనుడు “ఎద్దు, ఎద్దు” అని పరిహసిస్తూ కౌరవుల మధ్యలో వుండి నృత్యం చేయసాగాడు*. *ధర్మరాజు భీమసేనుని నిరోధిస్తున్నా భీముడు ఆగక “ఈ వృకోధరుడు యుద్దంలో నీ గుండెలు చీల్చి నీ నెత్తురు త్రాగక పోతే పుణ్యలోకాలను పొందలేడు. అంతే గాదు దుశ్శాసనా! అందరు చూస్తుండగా ధార్తరాష్ట్రులందరినీ చంపి శాంతిని పొందుతాను” అని ప్రతిజ్ఞ చేసాడు.* *అయినా దుర్యోధనుడు ఆనందపరవశుడై భీముడి గమనాన్ని ఎగతాళిగా అనుకరిస్తూ హేళనచేసాడు*. *“మూర్ఖుడా! దుర్యోధనా! కౌరవపాండవుల మధ్య యుద్ధం జరిగినప్పుడు దుశ్శాసనుడి నెత్తురు త్రాగాడమే కాదు, నిన్ను సభాన్ధవంగా యమలోకాని పంపి, నీవు చేస్తున్న హేళనను గుర్తుచేస్తా*. *రణభుమిలో నిన్ను గదతో చంపి నేలపై పడత్రోసి* *నీ తలను కాలితో తన్ని నిలబడుతా*. *అర్జునుడు కర్ణుని చంపుతాడు. జూదరి శకునుని సహదేవుడు చంపుతాడు" అని భయకర ప్రతిజ్ఞ జేయగా అర్జునుడు* *“భీమా! సజ్జనులు తాము చేయదలచుకున్నది మాటలతో చెప్పరు.* *నేటికి పదునాల్గవ సంవత్సరంలో దుర్యోధనుడు మన రాజ్యంను మనకు ఇవ్వకుంటే నీవు చెప్పినట్లు నేను కర్ణుడిని, మతిచెడి మరెవారైన సరే నాకెదురు నిల్చి యుద్ధం చేస్తే వారందరిని యమపురికి పంపుతాను" అని ప్రతిజ్ఞ చేసాడు*. *సహదేవుడు “గాంధారుల కీర్తిని నాశనం చేసిన ఓ శకునీ! ఇవి పాచికలనుకుంటున్నావు. ఈ రూపంలో వున్న తీవ్ర బాణాలివి. యుద్ధధర్మాన్ని అనుసరించి నీవు రణరంగంలో నిలిస్తే నీ బాంధవులతో సహా నిన్ను సంహరిస్తా! అని ప్రతిజ్ఞ చేసి పాండవులు కోపం నిండిన చూపులకు జనం దహించబడతారని ధర్మరాజు ముఖానికి వస్త్రం అడ్డం పెట్టుకుని వెళ్ళాడు, ఎట్టకేలకు యుద్ధంలో బాహు బలం ప్రదర్శించే అవకాశం వచ్చిందని భీముడు రొమ్ము విరుచుకుంటూ వెళ్ళాడు. ఇంత కంటే ఎక్కువగా అస్త్ర సంధానం చేసి శత్రు సంహారం చేస్తానని అర్జునుడు చేతితో ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు. తమ అందచందాలు చూసి జనులు దు॰ఖిస్తారని నకులసహదేవులు మలిన వస్త్రాలతో వెళ్ళారు. తడిసిన బట్టలతో విడిన కురులతో దుఃఖిస్తూ యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్న కౌరవుల భార్యలు ఇలా రాజ్యం వదిలి వెళతారని సూచిస్తూ ద్రౌపది వెళ్ళింది.* *పాండవులతో ధౌమ్యుడు, వేలాది బ్రాహ్మణులు పాండవులను అనుసరించారు. ఇలా పాండవులు అడవులకు వెళ్లారు*. *రాముడు అరణ్యవాసంకు వెళ్ళినపుడు అయోధ్యా వాసులు ఎలా దుఃఖించారో అలా హస్తినాపుర వాసులు దుఃఖించారు.* *అంతలో నారదుడు సభాస్థలికి వచ్చాడు "నేటికి పదునాల్గవ సంవత్సరంలో దుర్యోధనుడి అపరాధం కారణంగా భీమార్జునుల బలంవలన కౌరవులు నశిస్తారు" అని చెప్పి అదృశ్యమయ్యాడు*. *అదివిని ధృతరాష్ట్రుడు మూర్చపోయాడు. విదురుడు సముదాయించాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ద్రోణాచార్యుల శరణు వేడారు. "నాకు ద్రుపదుడికి మైత్రికి సంబంధించి యుద్ధం జరిగినప్పుడు అతడిని ఓడించాను గదా! తర్వాత అతడు నన్ను చంపగలిగే శక్తిగల కుమారునికై యజ్ఞం చేసి దృష్టద్యుమ్నుడనే కుమారుని గన్నాడు. అతడు అగ్నిజ్వాలలనుండి కవచం, ధనుర్భాణాలతో నన్ను చంపేటందుకు పుట్టాడు. కాబట్టి యుద్ధం వచ్చిందంటే దృష్టద్యుమ్నుడు అర్జునుడి సహాయంతో సంహరిస్తాడు. కావున దృష్టద్యుమ్నుడు నా మృత్యువు అని తెలుసుకో, అందుకని మీ శ్రేయస్సాధనకై త్వరగా సన్నద్ధం కండ" ని ద్రోణుడు అన్నాడు* *_సభా పర్వము సప్తమాశ్వాసము_* #మన సంప్రదాయాలు సమాచారం
*_మన ఆరోగ్యం…!_* *_మహా ఓషది శొంఠి_.* *_సర్వరోగ నివారిణి_* *అల్లం ను బాగా కడిగి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే ‘సొంఠి’గా మారుతుంది.* *ఈ భూమి మీద, అనేక రోగాలను ధ్వంసం చేయగల మహా మహా మూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి.* *దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి ‘మహా ఓషది’ అని అర్థం వచ్చేటట్లుగా ‘విశ్వభేషజo’ అని సంస్కృతంలో నామకరణం చేశారు*. *దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది.* *మానవునిలో జీవనశక్తిని (వ్యాధినిరోధక శక్తి) వృద్ధి చేస్తుంది*. *కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది*. *మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది.* *పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది*. *శ్వాశ రోగాలను, ఉదరశూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలును, వాత రోగములను తగ్గిస్తుంది.* *ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి కూడా తగ్గుతుంది*. *దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి*. *ఒకవైపు తలనొప్పి వచ్చేవారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపైన పట్టు వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది*. *జాయింట్లలో వాపు (ఆమవాతము) వచ్చి విపరీతమైన నొప్పి తో బాధపడే వారు దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా మోతాదు గా చెరకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది*. *అదేవిధంగా శొంఠి పొడిని తిప్పతీగ సమూల రసం పావుకప్పులో కలిపి సేవిస్తూ ఉంటే దీర్ఘకాలిక ఆమవాత సమస్య తగ్గిపోతుంది.* *కొంతమందికి పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని రోజూ రెండుపూటలా 5గ్రా మోతాదుతో సేవిస్తూ వస్తే మందాగ్ని హరించిపోయి మంచి ఆకలి పుడుతుంది*. *ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని కలిపి ఒక కప్పు వేడినీటిలో వేసి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు, దమ్ము, ఎక్కిళ్ళు అన్ని తగ్గిపోతాయి*. *రక్తక్షీణత వల్ల వచ్చే పాండు రోగాలకు శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధము 10గ్రా తీసుకుని దానిని 50గ్రా ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నెయ్యిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే పాండురోగము తగ్గి రక్తము వృద్ధి చెందును*. *మూత్రం కష్టంగా వచ్చేవారికి శొంఠి పొడి, సైంధవ లవణం కలిపి తీసుకుని పల్లేరుకాయలతో కాచిన ఒక కప్పు కషాయంలో కలిపి రోజూ రెండుపూటలా సేవిస్తూ ఉంటే మూత్రం ధారాళంగా వస్తుంది*. *నడుం నొప్పి ఉన్నవాళ్లు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠి ని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగుతూవుంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి*. *ప్రతి ఒక్కరు ఈ చిట్కాలను పాటించండి.* *_సేకరణ_* #మన సంప్రదాయాలు సమాచారం
*_రాక్షసులు_* *_రాక్షసులు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు??_* *రాక్షసులు అనేపదం వినపడగానే మనమనస్సులో ఒకరకమయిన భయం, వారి దోషపూరిత ప్రవర్తన, వారిపట్ల అసహ్యం కలుగుతాయి*. *ఎందుకంటే వారి గురించి వారి మనోభావాల గురించి మనం విన్న కథలు అలా మన మనస్సులో ముద్రలు వేశాయి. ఇక పూర్వం వారి ఆకారములు, ప్రవర్తనలు ఎలావున్నా యుగాలననుసరించినా వారిబుద్ధులు మాత్రం మారలేదు. అటువంటి బుద్ధికలవాడు రాక్షసునిగానే వర్ణింపబడుతున్నాడు*. *మొదటిలో అంటే కృతయుగములో రాక్షసులు జలములలో నివసించేవారట*. *అక్కడనుండే లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగిలించటం* *లాంటివి చేయటము వలన భగవంతుడు* *మత్స్యావతారమెత్తి*, *వరాహావతారములెత్తి*వారిని* *సంహరించాడు*. *ఇలాకాదు అని వాళ్ళు నీళ్ళమధ్యలో దీవులలో చేరి లోకములో దుర్మార్గములు చేయటము మాత్రమేకాక, ఆ భావాలను వ్యాపింపచేయాలని ప్రయత్నించారు.* *అయితే అప్పుడు కూడా ఆయన రామాది అవతారాలను దాల్చి వాళ్లను నిర్మూలించాడు*. *ఇలాకూడా లాభం లేదు, మనకార్యం* *నెరవేరాలంటే మనం మానవుల బంధువర్గంగా మారాలని* *సంకల్పించి, కంస, దుర్యోధన, జరాసంధ, శిశుపాలాది రూపాలలో మానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించి చాలావరకు మానవజాతిని తమకనుకూలముగా మార్చగలిగారు*. *ఆయనకూడా ఊరుకోకుండా కృష్ణావతారమెత్తి, సద్బుద్ధి కలిగిన మానవులద్వారానే వారిని ఊచకోత కోపించి, మానవుల కర్తవ్యాన్ని తెలియపరచాడు*. *ఇక మనం బయటవుంటే* *వాసుదేవుని నుండి మనం* *తప్పించుకోలేము*. *ఆయనకు దొరకకుండా వుండేందుకు*. *ఎక్కడచేరి మనప్రయత్నాలు సాగించాలా అని బాగా ఆలోచించి ఈ కలియుగములో మానవ మనస్సులలో నివాసము ఏర్పరచుకున్నారు.* *అక్కడ నుండి తమ పనులు కొనసాగిస్తున్నారు.* *అందుకే మనలో కోపాలు, ఈర్ష్య, అసూయాది గుణాలు, ధర్మవిరుద్ధమయిన ప్రవర్తన, భగవంతుని ఉనికిని* *వ్యతిరేకించటం, సాటి జీవులపట్ల జాలి లేకపోవటం లాంటి లక్షణాలు పొడసూపుతున్నాయి*. *మనలోనే నివాసమున్న ఈ రాక్షసజాతి మనమాదమరచివున్న సందర్భములో మన మనస్సును అరిషడ్వర్గాలవైపు మళ్ళించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు*. *ఆదమరచామో మనలో వారిగుణాలు ప్రజ్వరిల్లుతుంటాయి. భగవన్నామమనే కవచాన్ని ధరించి ప్రేమ, శమదమాదులనే ఆయుధాలు ధరించి జాగురూకులమై ఉండాలి*. *వాళ్ళు తలెత్తిన ప్రతిసారీ చావుదెబ్బ తీయాలి.* *ఇది చాలా కష్టతరమయిన పోరాటం*. *ఎదుటవున్న శత్రువునయితే కనిపెట్టి వుండవచ్చు*. *లోపలున్న ఈ* *రాక్షసులను* *కనిపెట్టిఉండటమే పెద్ద కష్టం*. *ఇక యుద్ధమెంత కఠినమో ఆలోచించాలి మనం*. *ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా మన పతనం ఖాయం.* #మన సంప్రదాయాలు సమాచారం
*_గోదావరిపిలిచింది!_* *‘ఇంత చదువూ చదివించింది #ఇండియాలో పనిజేయటానికా?’* *‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.* *దానికా అబ్బాయి... ‘#అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు*. *అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ?* *_ఇక కథ లోకి వెళదాం..._* *కొత్తగా పెళ్లైన కూతుర్నీ అల్లుడినీ అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనం చేయించి,భోజనాలయ్యేసరికి ఒంటిగంటయింది.* *కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు.* *ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికొచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్లైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా, నాన్న.* *ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళయినా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణస్వామి దర్శనం*. *కారు నేషనల్‌ హైవే మీద పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలూ, దూరంగా పచ్చదుప్పటి కప్పుకున్నట్లున్న కొండలూ గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రం వెలితిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు*. *ఈమధ్యనే అమ్మాయి పెళ్ళి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం. మంచి స్థితిమంతుల కుటుంబం. భార్య తరఫు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని, మరో ఆలోచన లేకుండా పెళ్ళి జరిపించాడు. ఒక వారంరోజుల్లో కూతురూ అల్లుడూ అమెరికా వెళ్ళిపోతారు*. *తనసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు-మంచీ చెడ్డా కళ్ళెదురుగుండా ఉంటే బావుంటుందని!* *భార్య పట్టుపడితే కాదనలేక ఒప్పుకున్నాడు*. *అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థమప్పుడు వియ్యంకుడితో అనేశాడు.. “మీకు పది తరాలకూ తరగని ఆస్తి- అబ్బాయి పదేళ్ళుగా అమెరికాలో సంపాదించుకున్నాడు. నాకూ ఒక్కగానొక్క కూతురు. నాదంతా నా కూతురికే. ఇంకా అమెరికా దేనికంటారూ! ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారూ” అని*. *‘ఇంత చదువూ చదివించింది ఇండియాలో పన్జేయటానికా?’ అని రాచనాగు లేచినట్టు లేచింది వియ్యపురాలు*. *ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి*. *1960లలో చెన్నైలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు దక్షిణామూర్తి. తల్చుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిలైపోయేవాడే. కానీ, సొంతగడ్డ మీద మమకారం, ఏం చేసినా మన వూరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత వూళ్ళోనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారుచేసే ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌ ప్రారంభించాడు. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన పదెకరాల పొలం పాతికెకరాలకు పెంచాడు*. *చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై వూరికి పెద్దదిక్కుగా మారాడు. అందరూ పిల్లల్ని ఇంజినీర్లూ డాక్టర్లూ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్‌ బిఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోశాడు.* *కానీ, పిల్ల పెళ్ళిచేశాక మన చేతుల్లో విషయం కాదు కదా! మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గరుండదు*. *మనం బెంగపడితే మన కంటికి కనపడదు.* *ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేదా?* *మన పిల్లలకి అమెరికా తప్ప దారిలేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా?* *వేల మైళ్ళు ఏళ్ళకు ఏళ్ళు దూరమైపోవాలా?* *“కడియంలో కాసేపు ఆపాలయ్యా” డ్రైవర్‌కి చెప్పి కారాపించాడు.* *వియ్యపురాలు ఏవో పూలమొక్కలు కొనుక్కుంటానంది మరి.* *కడియంలో కారాగింది. అందరూ దిగారు. అదొక పూలస్వర్గం.* *వియ్యపురాలు ఎప్పుడూ చూడలేదేమో తెగ సంబరపడిపోయింది.* *రంగురంగుల పూలూ... ఒకటా రెండా వందల రకాల పువ్వులు తివాచీ పరిచినట్టు ఎరుపూ, పసుపూ, నీలం, తెలుపు గులాబీలూ, చామంతులూ అదొక పూల సామ్రాజ్యం.* *కారు ధవళేశ్వరం బ్యారేజ్‌ సమీపించింది*. *“నాన్నా, కాటన్‌ మ్యూజియంకి వెళ్దాం” దక్షిణామూర్తి కూతురు అంది*. *“సాయంత్రం అయింది. చీకటిపడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేవిఁటే! ఇంటికెళ్ళాక బోలెడు పనుంది. తర్వాత చూద్దాంలే! అయినా చూడ్డానికేవుందీ? మీ నాన్నా, నువ్వూ ఎప్పుడూ చూసేది అదే కదా!” అంది దక్షిణామూర్తి భార్య హైమ.* *“అదికాదమ్మా, ఆయనకి ఒకసారి చూపిద్దామని!” కూతురనేలోగా దక్షిణామూర్తి కారు దిగాడు*. *ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికెళ్ళినట్టు కాటన్‌ మ్యూజియానికి వెళ్ళక మానడు*. *బ్రిడ్జ్‌ పక్కనే ఉన్న పదడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్‌ అడిగాడు- “అది ఎవరి విగ్రహం మామయ్యగారూ?” అని.* *హైదరాబాద్‌లో పెరిగి, అమెరికాలో పనిజేసేవాళ్ళకి కాటన్‌ గురించి తెలియదు కదా!* *చానాళ్ళక్రితం ఒకసారి ట్రెయిన్‌లో వస్తుండగా విజయనగరం కుర్రాడు తగిలాడు*. *‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.* *దానికా అబ్బాయి... ‘అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు*. *అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ? విజయనగరంలో పుట్టి, విజయనగరంలో పెరిగినవాడికి గురజాడ అప్పారావంటే తెలియకపోగాలేందీ, హైదరాబాద్‌లో పెరిగి అమెరికాలో సెటిలైనవాడికి కాటన్‌ తెలియకపోవడంలో తప్పేంలేదనుకున్నాడు దక్షిణామూర్తి*. *మ్యూజియం ముందుభాగంలో 1840సం. లలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలూ, పనిముట్లూ, వాహనాలూ ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్‌ నుంచి కాటన్‌ తెప్పించారు.* *కొంచెం ముందుకువెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తిచేసిన “కర్మయోగి ద గ్రేట్‌ సర్‌ సి.ఆర్ధర్‌ కాటన్.”* *ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా! దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు*. *లోపలికెళ్ళాక ప్రాజెక్టు వివరాలూ, ఫొటోలూ, చిత్రాలూ ఒక్కొక్కటీ వివరించి చెబుతోంది కూతురు- అల్లుడికి*. *అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు*. *“ఆ రోజుల్లో అంటే 183 ఏళ్ళక్రితం ఇక్కడ తినటానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళయితేనో లేదంటే శుభకార్యాలప్పుడో మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్నసంకటే. గోదారికి వరదొస్తే అడ్డే లేదు. కరవూ కాటకాలూ, జనాభా క్షయం..! ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి*. *అప్పుడే కాటన్‌ అనూహ్య ప్రవేశం*. *ప్రాజెక్ట్‌ కట్టి, ప్రజల కన్నీళ్ళు తుడవటం అనేది నిజానికాయన పనికాదు. కేవలం ఈ ప్రాంత ‘పన్ను వసూలు అధికారి మాత్రమే!’ కానీ, కష్టం నష్టం తెలుసుకున్నాడు*. *కంపెనీకి నచ్చజెప్పాడు. అయిదేళ్ళంటే అయిదేళ్ళలోనే అంచనా వ్యయంలోపే ఖర్చుపెట్టి రూ.4,75,572/- లతో పని పూర్తిచేసి చూపించాడు!”... దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు.* *“మన వూళ్ళో పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు...* *అయినా మనకోసం పదిలక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో వందోవంతు మన నాయకులూ మన విద్యావంతులూ ఏదో ఒక రంగంలో కృషిచేస్తే మనదేశం ఇలా ఉంటుందా బాబూ?” అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి*. *ఇంటికెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది*. *అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు. ‘నా మాటలు విసుగనిపించాయో ఏమో’ అనుకున్నాడు దక్షిణామూర్తి.* *మర్నాడు అల్లుడూ కూతురూ బయల్దేరారు. చీరా, సారె, కానుకలూ అన్నీ సర్ది పక్కన పెట్టారు. పెళ్ళి ఫొటోలు వచ్చాయి. చూసుకున్నారు. వీడియో కూడా చూశారు. సాయంత్రమే ట్రెయిన్‌ ఎక్కటం. అనుకున్న సమయం రానే వచ్చింది. సాయంత్రం అయిదు గంటలయింది. అల్లుడూ కూతురూ రెడీ అయ్యారు. దక్షిణామూర్తికీ, భార్య హైమకీ కాళ్ళకు నమస్కారం చేశారు. హైమ కూతుర్ని పట్టుకుని బావురుమంది. వియ్యపురాలు ఓదార్చింది*. *ఆరున్నరకి రాజమండ్రిలో ట్రెయిన్‌ ఎక్కించారు.* *“వెళ్ళొస్తాం మామయ్యగారూ!”అల్లుడు చేతిలో చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు.* *“సరే, జాగ్రత్త! హైదరాబాద్‌లో దిగగానే ఫోన్‌ చేయండి.” కళ్ళు చెమరుస్తుండగా గద్గదస్వరంతో అన్నాడు.* *ట్రెయిన్‌ కదిలింది. చెయ్యూపి ఇంటికి బయల్దేరారు దక్షిణామూర్తి దంపతులు.* *దక్షిణామూర్తి రొటీన్‌లో పడిపోయాడు... తన వ్యవసాయం, వర్క్‌షాప్‌ పనీ, ఊరి పనీ. క్షణం తీరిక లేకపోవటంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించే మరిచిపోయాడు*. *మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారని ఆశలేదు కాబట్టి, బాధ కూడా లేదు దక్షిణామూర్తికి.* *సరిగ్గా పదిరోజుల తర్వాత ఒక ఫైన్‌ మార్నింగ్‌ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి, భార్య హైమ పిలుపుతో లోపలికెళ్ళాడు “ఏమండీ, అమెరికా నుంచి అమ్మాయి ఫోను...!”* *దక్షిణామూర్తి ఫోనందుకున్నాడు.* *“నాన్నా, బావున్నారా?”* *“బావున్నానమ్మా. నువ్వూ, కిరణ్‌ ఎలా ఉన్నారు?”* *“ఫైన్‌ నాన్నా. ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్నా...”* *ఫోన్‌ అల్లుడికిచ్చింది.* *“మామయ్యగారూ బావున్నారా?”* *“బావున్నాను.* *మీరిద్దరూ ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటయిందా? ఇబ్బంది ఏమీ లేదు కదా?”* *“అదేంలేదు మామయ్యా. మరి మీతో ఓ విషయం చెప్పాలి మామయ్యా”మాటల్లో ఏదో తటపటాయింపు*. *“చెప్పు కిరణ్‌, ఫర్వాలేదు!”* *“నేను ఇండియా వచ్చేద్దామనుకుంటున్నా మామయ్యా. రాజమండ్రిలోనే నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం.* *ఇక్కడ రిలీవ్‌ కావటానికి ఇంకో మూణ్ణెల్లు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి...!” కిరణ్‌ చెబుతున్నాడు*. *దక్షిణామూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది…”అలాగే అల్లుడూ.* *మన ఊరు వచ్చి, మన వూళ్ళో బిజినెస్‌ చేసి, మనవాళ్ళకే ఉద్యోగాలిస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది*. *నేనేం కావాలన్నా చేస్తాను.” సంతోషంగా అన్నాడు*. *“థాంక్స్‌ మామయ్యా..!”* *“సరే కానీ కిరణ్‌, పెళ్లైన నెలలోపే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉందే!” దక్షిణామూర్తి నవ్వుతూ అన్నాడు*. *“మనదేశం కాదు, మన భాషా కాదు, మన మనిషే కాదు... అయినా మన నేలకు కాటన్‌ చేసినదాంట్లో వందో వంతైనా చేయాలి కదా, మామయ్యా! మీరు మీ ఊరికి చేసిన దాంట్లో పదో వంతైనా చేయాలి కదా!"* *దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కన్పించట్లేదు* *గోడమీద ‘కాటన్‌’ ఫొటో నవ్వుతూ కనపడింది*. *‘నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు...* *నా అమెరికా అల్లుణ్ణి కూడా మార్చేశావా! కాటన్‌ దొరా... !!* *నీకు కోటి నమస్కారాలు’ అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో.* *దూరంగా గోదావరి నింపాదిగా, నిర్మలంగా సాగిపోతోంది...* *తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడి చెంతే ఉండమని పిలుస్తోంది మౌనంగా* *_#Proud_Be_An_Indian_* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:21
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:11
*_ఓo దివ్య సింహాయ నమః_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:57
https://www.youtube.com/live/vogpFuXIOjw?si=lVt4mzX9-ShGuwiu #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
https://www.youtube.com/live/er6FMlE-2jI?si=n0UZLe9ilD4ZITlF #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
*ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్)లో రాహుల్ భాటియా ప్రత్యక్షంగా 0.01% షేర్ వాటా (సుమారు 40,000 షేర్లు) కలిగి ఉన్నారు, అయితే ఆయన కుటుంబం, హోల్డింగ్ కంపెనీలతో కలిపి 36-38% ప్రమోటర్ షేర్లు నియంత్రిస్తారు. ���షేర్ వివరాలుబీఎస్ఈ డేటా ప్రకారం, డిసెంబర్ 5, 2025 నాటికి రాహుల్ భాటియాకు ప్రత్యక్షంగా 0.01% (40,000 షేర్లు) మాత్రమే ఉంది, మిగిలిన ప్రమోటర్ గ్రూప్ ద్వారా నియంత్రణ. రాకేష్ గంగ్వాల్ వద్ద 4.53% (1.75 కోట్ల షేర్లు) ఉన్నాయి. ప్రమోటర్ నియంత్రణబ్లూమ్‌బెర్గ్ ప్రకారం, రాహుల్ భాటియా 36% స్టేక్‌ను కుటుంబం, హోల్డింగ్ కంపెనీల ద్వారా కలిగి ఉండటం వల్ల గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి నియంత్రణ కలిగి ఉన్నారు. � ఇది సెప్టెంబర్ 2024 స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఆధారంగా ఉంది.* #మన సంప్రదాయాలు సమాచారం #😁Hello🙋‍♂️
మన సంప్రదాయాలు  సమాచారం - NE WS 2 First F InGIGO: NE WS 2 First F InGIGO: - ShareChat