ఉరేసుకుని అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య!
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని అంగన్వాడి టీచర్ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సనుగుల గ్రామానికి చెందిన గొట్టే పరిమళ(39) దేవుని తండా గ్రామంలో అంగన్వాడి టీచర్ గా పని చేస్తోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పరిమళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వివరించారు. #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢

