#శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #కార్తీక మాసం
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏శివపార్వతులు
#విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏
🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏
🪔శుభోదయం🕉
🏵️ నేటిపెద్దలమాట 🏵️
మాట నిచ్చెన లాంటిది ఎత్తుకు తీసుకెళ్లగలదు, కింద పడేయగలదు. మనకు సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి మంచి చేయడానికి ప్రయత్నం చెయ్యాలి, మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది.
🌹 నేటిమంచిమాట 🌹
అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం, ఈరోజు బాగానే ఉంటాయి కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి.
🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 17 - 11 - 2025,
వారం ... ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : *త్రయోదశి* పూర్తి,
నక్షత్రం : *చిత్ర* తె5.32 వరకు,
యోగం : *ప్రీతి* ఉ9.19 వరకు,
కరణం : *గరజి* సా5.52 వరకు,
వర్జ్యం : *మ12.13 - 1.57*
దుర్ముహూర్తము : *మ12.07 - 12.52*
మరల *మ2.21 - 3.06*
అమృతకాలం : *రా10.37 - 12.20*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం : *6.09*
సూర్యాస్తమయం : *5.21*
🌹☘️🌹☘️🌹☘️🌹☘️🌹
*_నేటి విశేషం_*
*మహా ప్రదోష వ్రతం*
_ప్రదోష వేళ శివ పూజా మహిమ🙏_
ప్రదోష కాలం లో చేయు శివ పూజ శివుడికి ఇష్టమైనది ..ఇది త్వరితగతిన శివానుగ్రహము కలిగిస్తుంది.
ప్రదోష వేళలో సకల దేవతలు తమ పరివారం తో కైలాసం చేరి నన్దికేశ చండికేశ ప్రమద గణాలతో చేసే ఆనంద తాండవంను తన్మయత్వంతో అనుభవిస్తారు
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
ప్రదోషమంటే అది ఒక కాల విశేషము, ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము.
ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్ర�

