బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు: మంత్రి జూపల్లి (వీడియో)
TG: లిక్కర్ టెండర్ పంచాయితీలో ఐఏఎస్ అధికారి రిజ్వీ బలయ్యారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. దీనిపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే సీఎం రేవంత్ అల్లుడు, తన కొడుకుపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల ఫ్యామిలీకి పేటెంట్ రైట్ అని ఎద్దేవా చేశారు. తనపై టెండర్ స్కాం అంటూ ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మీద పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 24th అప్‌డేట్స్💬
00:21
