ShareChat
click to see wallet page
💚song:634💚 పల్లవి : M అబ్బ దీని సోకు సంపంగి రేకు F అంటుకుంటె షాకు నన్నంటుకోకు M అమ్మ దీని చూపు మరుమల్లె తూపు F అమ్మ రాకు రాకు నేనున్నవైపు M లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే F సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే M అబ్బ దీని సోకు సంపంగి రేకు F అంటుకుంటె షాకు నన్నంటుకోకు M అమ్మ దీని చూపు మరుమల్లె తూపు F అమ్మ రాకు రాకు నేనున్నవైపు చరణం 1 : M దోర అందాలు చూశాక నేను దోచుకోకుంటె ఆగేదెలా F కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచినా నేను దాగేదెలా M సందెపొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా F చిమ్మచీకట్లు సిగ్గుపడ్డాక నిన్ను నేనల్లుకోనా M ఒడ్డులేని ఏరు ఒడేల భామా F అడ్డులేని ప్రేమా ఇదేనులే M ముద్దుపెట్టగానె ముళ్ళుజారిపోయే వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి చాటు చూసి దాటుతుంటే తంటా M అబ్బ దీని సోకు సంపంగి రేకు F అంటుకుంటె షాకు నన్నంటుకోకు M అమ్మ దీని చూపు మరుమల్లె తూపు F అమ్మ రాకు రాకు నేనున్నవైపు M లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే F సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే M అబ్బ దీని సోకు సంపంగి రేకు F అంటుకుంటె షాకు నన్నంటుకోకు చరణం 2 : F ఎన్ని బాణాలు వేస్తావు నీవు... తీపిగాయలతో చెప్పనా M ఎన్ని కోణాలు ఉన్నాయి నీలో... కంటికే నోరు మూసెయ్యనా F ఎంత తుళ్ళింత లేత ఒళ్ళంతా కౌగిలే కప్పుకోనా M మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా F తెడ్డులేని నావా చలాకి ప్రేమా... M సందు చూసి పాడే సరాగమే F బొట్టు పెట్టగానే గట్టు జారిపోయే వెన్నెలంటి సోకులన్ని ఈలవేసి ఇవ్వబోతే ముందుగానె దోపిడైతె .... టాటా M అబ్బ దీని సోకు సంపంగి రేకు F అంటుకుంటె షాకు నన్నంటుకోకు M అమ్మ దీని చూపు మరుమల్లె తూపు F అమ్మ రాకు రాకు నేనున్నవైపు M లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే F సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే M అబ్బ దీని సోకు సంపంగి రేకు F అంటుకుంటె షాకు నన్నంటుకోకు M అమ్మ దీని చూపు మరుమల్లె తూపు F అమ్మ రాకు రాకు నేనున్నవైపు 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 చిత్రం : ఆఖరి పోరాటం (1988) సంగీతం : ఇళయరాజా గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, చిత్ర #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵

More like this