ShareChat
click to see wallet page
_*🪷🌹🪔🙏"అక్టోబర్-18వ తేది యమ దీపారాధన" గురించి శివలోకం మీ కోసం.....*_ 🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔 దీపావళి అమావాస్య నుంచి నాగుల చవితి వరకు ఐదురోజుల పాటు జరుపుకునే వేడుక.ఈ వేడుకలలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే.ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం.. అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు,ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం.. యమ దీపం అనేది మృత్యుదేవత అయిన యమ భగవానుని పూజించడానికి అంకితం చేయబడిన రోజు. ఆరోజు మాత్రమే అవకాశం సాయం సంధ్య వేళలో సమయం 5.48 pm to 7.05 pm ఆ సమయంలో వెలిగించండి.. మన ఇంటి గుమ్మానికి బయటనా చక్కగా శుభ్రం చేసుకొని తుడుచుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఉంటే తమలపాకు పరిచి దానిపైన ఉప్పు కళ్ళు పోసుకుని ప్రమిదలు నాలుగు పెట్టుకోవాలి నాలుగు దిక్కులా చూస్తున్నట్టు జ్యోతిని వెలిగించుకోవాలి ఒకవేళ లేదు అంటే ఫోటోలో చూపిస్తున్నట్టు ఒక ప్రమిదలోని నాలుగు దిక్కుల వత్తులు వేసుకొని వెలిగించవచ్చు.. యమ దీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి.దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కు గా చెబుతుంటారు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకు మంచిదని, ఎలాంటి భయాలు దరి చేరవని నమ్మకం.. నైవేద్యం కొంచెం బియ్యం బెల్లం పెట్టుకోవాలి అవి తర్వాత రోజు ఉదయాన్నే పక్షులకి పేటయండి.. చక్కగా నమస్కరించుకుని యమ మంత్రాన్ని చదువుకోండి.. *యమ గాయత్రీ మంత్రం...* 🪷🌹🪷🌹🪷🌹🪷 ఔం సూర్య-పుత్రయే విద్మహే| మహాకాలయే, ధీమహి తన్నో యమః ప్రచోదయాత్|| యమ భగవానుడు భక్తులను దీర్ఘాయువుతో, శ్రేయస్సుతో రక్షిస్తాడని మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తాడని నమ్ముతారు. ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు మరియు ప్రజలు ధనత్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి, ఎందుకంటే భక్తులు యమ భగవానుడికి ప్రార్థనలు చేసే ఏకైక రోజు. ఎవరైనా పెట్టుకోవచ్చా సంతోషంగా పెట్టుకోవచ్చు దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు.. దీని వెనుక ఒక పురాణ గాధ దాగి ఉందని చాలా మందికి తెలియదు. యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన ఆ కథే.. యమదీపం పుట్టుకకు కారణమైంది.. పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు. అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే నాలుగో రోజుకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు. ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అనేది తప్పించలేనిది. కాలక్రమంలో యువరాజుపై ఒక రాకుమారికి ప్రేమ పుట్టింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు తెలిసినా.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది. చివరికి రాజు కూడా విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించాడు. వివాహం జరిగి నాలుగో రోజు.. ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది. అదే రోజు రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రాసాదానికి చేరుకున్నాడు. కానీ రాజమహల్ లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. యువరాణి సర్వసంపదలతో ప్రాసాదాన్ని అలంకరించి… బంగారు ఆభరణాలను రాశులుగా పోసి.. దీపాల వెలుగులతో రాజమహల్‌ను ప్రకాశవంతం చేసింది. సంపద దేవత లక్ష్మీదేవిని స్తుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తోంది. ఆ వెలుగులు, బంగారు మెరుపులు, గానాల సౌందర్యం యముడినే కట్టిపడేశాయి. సమయం గడిచిపోయింది. మృత్యు ఘడియ దాటిపోయింది. యముడు ఖాళీచేతులతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది. ధన త్రయోదశి మరొక ప్రత్యేకత ధన్వంతరి జయంతి. పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మథనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు. ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు. సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యో నారాయణ హరి అని స్తుతిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుందని విశ్వసిస్తారు.. 🪷🌹🪷🌹🪷🌹🪷 మీ.... శివలోకం ప్రాజెక్ట్ #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి
🙏మన సాంప్రదాయాలు - క్టోబర్ 18వ తేదీ శనివారం రోజున ప్రతి ఒక్కరు అ యమ దీపం పెట్టుకోండి @ூலூ వెల్రి @ శివలోకం ప్రాజెక్ట్ యమ దీపాన్నిఎప్పుడు? ఎలా? ఎక్కడ ? పెట్టాలంటే . ! క్టోబర్ 18వ తేదీ శనివారం రోజున ప్రతి ఒక్కరు అ యమ దీపం పెట్టుకోండి @ூலூ వెల్రి @ శివలోకం ప్రాజెక్ట్ యమ దీపాన్నిఎప్పుడు? ఎలా? ఎక్కడ ? పెట్టాలంటే . ! - ShareChat

More like this