RAMAKRISHNA. B
ShareChat
click to see wallet page
@2163187996
2163187996
RAMAKRISHNA. B
@2163187996
ఐ లవ్ షేర్ చాట్, ఐ లవ్ తెలుగు సంస్కృతి.
_*🪷🌹🪔🙏"అక్టోబర్-18వ తేది యమ దీపారాధన" గురించి శివలోకం మీ కోసం.....*_ 🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔 దీపావళి అమావాస్య నుంచి నాగుల చవితి వరకు ఐదురోజుల పాటు జరుపుకునే వేడుక.ఈ వేడుకలలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే.ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం.. అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు,ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం.. యమ దీపం అనేది మృత్యుదేవత అయిన యమ భగవానుని పూజించడానికి అంకితం చేయబడిన రోజు. ఆరోజు మాత్రమే అవకాశం సాయం సంధ్య వేళలో సమయం 5.48 pm to 7.05 pm ఆ సమయంలో వెలిగించండి.. మన ఇంటి గుమ్మానికి బయటనా చక్కగా శుభ్రం చేసుకొని తుడుచుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఉంటే తమలపాకు పరిచి దానిపైన ఉప్పు కళ్ళు పోసుకుని ప్రమిదలు నాలుగు పెట్టుకోవాలి నాలుగు దిక్కులా చూస్తున్నట్టు జ్యోతిని వెలిగించుకోవాలి ఒకవేళ లేదు అంటే ఫోటోలో చూపిస్తున్నట్టు ఒక ప్రమిదలోని నాలుగు దిక్కుల వత్తులు వేసుకొని వెలిగించవచ్చు.. యమ దీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి.దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కు గా చెబుతుంటారు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకు మంచిదని, ఎలాంటి భయాలు దరి చేరవని నమ్మకం.. నైవేద్యం కొంచెం బియ్యం బెల్లం పెట్టుకోవాలి అవి తర్వాత రోజు ఉదయాన్నే పక్షులకి పేటయండి.. చక్కగా నమస్కరించుకుని యమ మంత్రాన్ని చదువుకోండి.. *యమ గాయత్రీ మంత్రం...* 🪷🌹🪷🌹🪷🌹🪷 ఔం సూర్య-పుత్రయే విద్మహే| మహాకాలయే, ధీమహి తన్నో యమః ప్రచోదయాత్|| యమ భగవానుడు భక్తులను దీర్ఘాయువుతో, శ్రేయస్సుతో రక్షిస్తాడని మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తాడని నమ్ముతారు. ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు మరియు ప్రజలు ధనత్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి, ఎందుకంటే భక్తులు యమ భగవానుడికి ప్రార్థనలు చేసే ఏకైక రోజు. ఎవరైనా పెట్టుకోవచ్చా సంతోషంగా పెట్టుకోవచ్చు దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు.. దీని వెనుక ఒక పురాణ గాధ దాగి ఉందని చాలా మందికి తెలియదు. యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన ఆ కథే.. యమదీపం పుట్టుకకు కారణమైంది.. పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు. అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే నాలుగో రోజుకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు. ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అనేది తప్పించలేనిది. కాలక్రమంలో యువరాజుపై ఒక రాకుమారికి ప్రేమ పుట్టింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు తెలిసినా.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది. చివరికి రాజు కూడా విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించాడు. వివాహం జరిగి నాలుగో రోజు.. ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది. అదే రోజు రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రాసాదానికి చేరుకున్నాడు. కానీ రాజమహల్ లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. యువరాణి సర్వసంపదలతో ప్రాసాదాన్ని అలంకరించి… బంగారు ఆభరణాలను రాశులుగా పోసి.. దీపాల వెలుగులతో రాజమహల్‌ను ప్రకాశవంతం చేసింది. సంపద దేవత లక్ష్మీదేవిని స్తుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తోంది. ఆ వెలుగులు, బంగారు మెరుపులు, గానాల సౌందర్యం యముడినే కట్టిపడేశాయి. సమయం గడిచిపోయింది. మృత్యు ఘడియ దాటిపోయింది. యముడు ఖాళీచేతులతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది. ధన త్రయోదశి మరొక ప్రత్యేకత ధన్వంతరి జయంతి. పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మథనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు. ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు. సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యో నారాయణ హరి అని స్తుతిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుందని విశ్వసిస్తారు.. 🪷🌹🪷🌹🪷🌹🪷 మీ.... శివలోకం ప్రాజెక్ట్ #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి
🙏మన సాంప్రదాయాలు - క్టోబర్ 18వ తేదీ శనివారం రోజున ప్రతి ఒక్కరు అ యమ దీపం పెట్టుకోండి @ூலூ వెల్రి @ శివలోకం ప్రాజెక్ట్ యమ దీపాన్నిఎప్పుడు? ఎలా? ఎక్కడ ? పెట్టాలంటే . ! క్టోబర్ 18వ తేదీ శనివారం రోజున ప్రతి ఒక్కరు అ యమ దీపం పెట్టుకోండి @ூலூ వెల్రి @ శివలోకం ప్రాజెక్ట్ యమ దీపాన్నిఎప్పుడు? ఎలా? ఎక్కడ ? పెట్టాలంటే . ! - ShareChat
_*🪷🌹🔱🙏"పాండవ తీర్థం, తిరువణ్ణామలై క్షేత్రం" గురించి శివలోకం మీ కోసం.... #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ 🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱 మహాభారతం ఆది కావ్యంగా పేరొందినది. వ్యాస భగవానుడు ప్రధాన పాత్ర పోషిస్తూ స్వయంగా తెలుపగా విఘ్ననాయకుడు శ్రీ గణపతి అక్షరీకరించిన మహా కావ్యంలో అన్ని యుగాలకు మరియు కాలాలకు సంబంధించిన విషయాలు వివరంగా ఉండటం విశేషం. అందుకే పెద్దలు అంటారు మహా భారతంలో లేనిది లేదు అని. రాజకీయం, కుట్రలు, కుతంత్రాలు, యుద్దాలు, ప్రజల జీవన శైలి, నీతి నియమాలు, న్యాయ, అన్యాయాలు, ధర్మ, అధర్మాలు,స్త్రీ గౌరవం, ఎంతటి వారినైనా వదలని కర్మ ఫలం ఇలా ఎన్నో పంచమ వేదం లో కనిపిస్తాయి. 🌹🔱🙏ఈ మహా పురాణంలో ప్రధాన పాత్రలు కౌరవులు మరియు పాండవులు. వీరు దండయాత్రల పేరిట, యాత్రల నిమిత్తం మరియు ఇతర కార్యక్రమాల కొరకు భారతదేశ నలుమూలలా తిరుగాడినట్లుగా తెలుస్తోంది. 🌹🔱🙏అందుకే భారత దేశంలోని ప్రతి రాష్ట్రం లోని ఏదో ఒక చోట వీరితో ముడిపడి ఉన్న ప్రదేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పాండవులు లక్క దహనం తరువాత,మాయా జూదంలో ఓటమి పాలు అయిన తరువాత చేసిన పుష్కర కాల అజ్ఞాత వాసంలో అనేక ప్రాంతాలలో నివసించినట్లుగా అనేక స్థానిక కధనాలు తెలుపుతున్నాయి. అక్కడి వారు వాటికి తగిన ఆధారాలను కూడా చూపిస్తారు. అలాంటి వాటిల్లో పంచ భూత స్థలాలలో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన తిరువణ్ణామలై ఒకటి. భక్తులలో అపరిమిత ఆదరణ కలిగిన జ్యోతిర్లింగాలకు బీజం పడినది ఇక్కడే అని పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీ మహా విష్ణు మరియు విధాత బ్రహ్మదేవుని మధ్య అహంకారంతో తలెత్తిన ఆధిపత్య పోరును తొలగించడానికి శ్రీ పరమేశ్వరుడు జ్యోతి రూపంలో వారికి దర్శనమిచ్చి, జ్ఞానాన్ని ప్రసాదించినది కూడా ఇక్కడే అని అరుణాచల పురాణం పేర్కొంటోంది. వారివురి కోరిక మేరకు కైలాసనాధుడు కొండగా కొలువైనది ఇక్కడే అన్న విశ్వాసంతో భక్తులు పర్వతం చుట్టూ పదునాలుగు కిలోమీటర్ల దూరం నియమంగా భక్తిశ్రద్దలతో ప్రదక్షిణ చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ అరుణాచల యాత్ర పరిపూర్ణం కాదని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ మార్గంలో ఎనిమిది దిక్పాలక లింగాలు, లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య మరియు చంద్ర లింగాలు మరియు శ్రీ దూర్వాస, శ్రీ గౌతమ మరియు శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్థ్య మహర్షుల సన్నిధులు ఉంటాయి. ఇలాంటి విశేష ఆలయాలను మరెక్కడా చూడలేము. ఈ పదునాలుగు కిలోమీటర్ల మార్గంలో అనేక కనపడుతుంటాయి. అన్నీ కూడా అరుణగిరిని చూస్తూ ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మార్గంలో శ్రీ కన్నప్ప నయనార్ మరియు శ్రీ ఆది అణ్ణామలై ఆలయాలు అరుదైనవి. పురాతనమైనవి. భక్తులు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కనుక చూస్తే అనేక రూపాలలో కనిపిస్తుంది. వీటన్నిటి లోనికి కుబేర తరువాత వచ్చే పంచముఖ దర్శనం ముఖ్యమైనది. ఇక్కడే మహనీయులు శ్రీ ఇసక్కి జీవ సమాధి కలదు. సుమారు ఆరు దశాబ్దాల క్రిందట వందల సార్లు గిరికి అంగప్రదక్షిణ చేసిన మహానుభావులు వీరు. ఇవన్నీ తిరువణ్ణామలై తరుచుగా సందర్శించే వారికి తెలిసినవే ! తెలియని రెండు ముఖ్య విశేషాల గురించి తెలుసుకొందాము. 🌹🔱🙏పాండవ తీర్థం లక్క ఇంటి అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్న పాండవులు కొంత కాలం కాలం వివిధ ప్రాంతాలలో తలదాచుకున్నారు. ఆ క్రమంలో కొన్ని రోజులు వారు తిరువణ్ణామలై లో కూడా ఉన్నారని చెబుతారు. _*🌹🔱🙏విశ్వసించిన వారిని విశ్వనాధుడే విపత్తుల బారి నుండి విముక్తి కలిగిస్థాడన్న లోకోక్తి ఉన్నదికదా ! దానిని పూర్తిగా విశ్వసించిన పాండు పుత్రులు ఈ క్షేత్రంలో ఉన్నన్ని రోజులు నిత్య పూజల నిమిత్తం లింగాన్ని ప్రతిష్ఠించు కొన్నారట. అభిషేకాదుల కొరకు ఒక కొలను కూడా నిర్మించారట.*_ 🌹🔱🙏అవే నేడు పాండవ లింగం పాండవ తీర్థం అని పిలవబడుతున్నాయి. చాలా మంది తిరువణ్ణామలై నివాసులకు కూడా వీటి గురించి తెలియదు. బాగా వర్షాలు కురిస్తే పర్వత పాదాల వద్ద ఉండటంతో పాండవతీర్థం కూడా పూర్తిగా నిండి పోయి కనపడుతుంది. కొండ వాలులో నివసిస్తున్న వారికి పాండవ తీర్ధమే ప్రధాన నీటి వనరు. నీరు స్వచ్ఛంగా ఉంటుంది. గట్టున ఉన్న ఆలయంలో సర్వేశ్వరుడు పాండవ లింగ రూపంలో కొలువై ఉంటారు. 🌹🔱🙏గర్భాలయంలో శ్రీ పాండవ లింగేశ్వరుడు పక్కన ఉన్న సన్నిధులలో శ్రీ పార్వతీ దేవి మరియు శ్రీ గణపతి కొలువుతీరి దర్శనమిస్తారు. ప్రతి రోజు ఉదయం పూట మాత్రమే నిర్వహిస్తారు. శనివారం మాత్రం సాయం సంధ్యా సమయంలో ప్రత్యేక పూజ చేస్తారు. ఆలయానికి కొద్దిగా దిగువన మరో కోనేరు కనపడుతుంది. ఆకారంలో చిన్నదైన రెండో కోనేరు పేరు"భీమ పుష్కరణి"ట. దానిని వాయుపుత్రుడు, అమిత బలవంతుడైన భీమసేనుడు తమ నిత్యకృత్యాలకు మరియు ప్రజల నీటి అవసరాల నిమిత్తం నిర్మించడం వలన ఆయన పేరుతోనే పిలుస్తున్నారట. 🌹🔱🙏పరమేశ్వరుని పూజాదికాల ప్రయోజనార్ధం నిర్మించబడిన పాండవ తీర్థ పవిత్రతను కాపాడటానికి దీనిని నిర్మించారట. కానీ నేడు ఈ భీమ పుష్కరిణి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనది. బాగుచేయడం అత్యంత ఆవశక్యంగ అనిపిస్తుంది చూడగానే!. 🌹🔱🙏మరో విశేషం ఏమిటంటే నియమంగా ప్రతి నిత్యం సూర్యాస్తమయ కాలంలో రెండు కృష్ణ గరుడ పక్షులు వచ్చి శ్రీ పాండవ లింగేశ్వరునికి ఆకాశంలో ప్రదక్షిణాలు చేయడం. పవిత్ర అరుణాచల పర్వత పాదాల వద్ద నలువైపులా పరుచుకున్న పచ్చని చల్లని వాతావరణంలో శ్రీ పాండవ లింగేశ్వరుని దర్శించుకోవడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అగ్ని లింగం నుండి సుమారు రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అగ్ని లింగం దగ్గర అడిగితే దారి చూపుతారు. 🌹🔱🙏శ్రీ దూర్వాస మహాముని సన్నిధి మనుకున్న అనేక మంది మహర్షులలో శ్రీ దూర్వాసమహాముని స్థానం ప్రత్యేకమైనది. ఈయన ముక్కోపి. ఆ కోపకారణంగా అనేక మంది జీవితాలు రకరకాల మార్పులకు లోను కావడం మన పురాణాలలో కనపడుతుంది. కానీ అవన్నీ కూడా ఆయా వ్యక్తులలో కావలసిన మార్పు తేవడానికి లేక జీవిత గమనాన్ని సన్మార్గంలో ప్రయాణించడానికో కారణమవ్వడం విశేషం. అలా ఆయన ఆగ్రహానికి గురి కాకుండా అనుగ్రహాన్ని పొందిన ఒకే ఒక్కరు పాండవ మాత కుంతీదేవి. వివాహానికి పూర్వం తమ రాజ్యానికి విచ్చేసిన మహర్షికి తండ్రి కుంతిభోజుని ఆజ్ఞ మేరకు సముచిత అతిధి సేవలు అందించి ఆయనను సంతోషపరచినది. ఆనందంతో మహర్షి ఆమెకు ప్రసాదించిన వర ప్రభావంతో వివాహానికి ముందు ప్రత్యక్ష నారాయణుని అనుగ్రహంతో కర్ణుని, వివాహానంతరం ధర్మ, భీమ,అర్జనులను కుమారులుగా పొందడం మహాభారత కథా గమనాన్ని మార్చడం వేరే విషయం. 🌹🔱🙏యోగ క్షేత్రం అయిన తిరువణ్ణామలైలో తాను సంతానాన్ని పొందడానికి పరోక్షంగా సహాయపడిన మహర్షి యొక్క ఆలయాన్ని నిర్మించాలన్న తలంపు కలిగిందట కుంతీదేవికి. తల్లి కోరిక తెలుసుకొన్న కుమారులు పవిత్ర గిరి మార్గంలో తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసి మహాముని విగ్రహాన్ని ప్రతిష్టించారట. 🌹🔱🙏అలా అరుణగిరి ప్రదక్షిణా మార్గంలో ఇద్దరు మహర్షులతో పాటు శ్రీ దూర్వాస మహర్షి సన్నిధి ఏర్పడినది. ముఖ మండపం మరియు గర్భాలయం మాత్రమే చిన్న ఆలయంలో శ్రీ దూర్వాస మహాముని పద్మాసనంలో ధ్యాన ముద్రలో ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు. 🌹🔱🙏 ఆలయానికి వెలుపల ఉన్నచిన్నరాతి మండపంలో కనిపించే పాద ముద్రలు కుంతీదేవివి అని చెబుతారు. భక్తులు మహామునికి పసుపుతో అర్చన చేసి, నివేదన సమర్పించుకొంటారు. అనంతరం ఆలయానికి వెనుక ఉన్న వేప చెట్టుకు పూసిన కొత్త గుడ్డను కడతారు. దీని వలన వివాహం వారికి వివాహం, సంతానం వారికి సంతాన యోగం మహర్షి అనుగ్రహంతో కలుతాయన్నది తరతరాల విశ్వాసం. పౌర్ణమి, పర్వదినాలలో, ఆదివారాలు కొందరు స్త్రీలు వీటిని అక్కడ అమ్ముతుంటారు. అదేవిధంగా వేపచెట్టు పక్కన ఉన్న విశాల స్థలంలో సొంత ఇంటి కల నిజం కావాలన్న ఆశతో,దానికి మహర్షి ఆశీర్వాదాలు లభిస్తాయన్న తలంపుతో రాతిని రాతి పైన పేరుస్తారు భక్తులు. శ్రీ దూర్వాస మహాముని ఆలయం పై నుండి చీలి గిరి వెనుక ఉన్న మార్గంలో వచ్చే రెండో నంది విగ్రహానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుండి అరుణాచల దక్షిణ వాలుకు చూస్తే సహజసిద్ధంగా రాళ్లతో ఏర్పడిన నంది ముఖ దర్శనం లభిస్తుంది. అద్భుతాలకు నిలయమైన తిరువణ్ణామలై లో ఉన్న అనేక అద్భుతాలలో పైన పేర్కొన్న రెండూ కూడా చాలామందికి తెలియని అరుదైన ప్రదేశాలుగా పేర్కొనవచ్చును. 🪷🌹🔱🙏🪷🌹🔱 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల !!! 🪷🌹🔱🙏🪷🌹🔱 _*మీ.... శివలోకం ప్రాజెక్ట్*_
🙏మన సాంప్రదాయాలు - OM NAMAH ARUNACHALESWARA SHIVALOKAMPROJECT OM NAMAH ARUNACHALESWARA SHIVALOKAMPROJECT - ShareChat
_*🪷🌹🎻"నామ మహత్యం "గురించి శివలోకం మీ కోసం....*_ 🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏 ఒక వృద్ధుడు చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించి, 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపిస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. ఆ తరంగాలు కలిపురుషుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానదీ తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపా లని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబో యాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపో యాడు. 'ఇతన్ని చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతు న్నాను. ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? లేక ఇదంతా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముస లివాడు ఎవడు? శివుడా? విష్ణువా?' అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్లి "మహానుభావా! సమయానికి వచ్చావు. నా సందే హాన్ని నివృత్తి చెయ్యి. అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలి వాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి" అని వేడుకున్నాడు. వేదవ్యా సుడు నవ్వి, "ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణుభక్తుడు. అయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రిక రణ శుద్ధిగా నిత్యం 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు' అని చెప్పి వెళ్ళి పోయాడు. ఆనాటినుంచి కలిపురుషుడు వీలయినంత వరకు హరినామస్మరణ జర గకుండా అడ్డుపడుతూ, ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాడు. పుణ్యపురుషులు మాత్రం భగవన్నామ స్మరణ జరిగేలా చూస్తూనే ఉన్నారు. అందుకే ధర్మం ఈ మాత్రం ఒంటి కాలిమీదనైనా నిలబడగలుగుతోంది. 🪷🌹🙏🪷🌹🙏🪷 మీ.... శివలోకం ప్రాజెక్ట్ #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి
🙏మన సాంప్రదాయాలు - "ఓం నమ్ోభ్రగవతే' ವೌನುದವಾಯ శివల్కోకం ప్రాజెక్ట్ Pratipal ` फ "ఓం నమ్ోభ్రగవతే' ವೌನುದವಾಯ శివల్కోకం ప్రాజెక్ట్ Pratipal ` फ - ShareChat
_*🪷🌹🔱🙏శుక్లాం భరధరంవిష్ణుం శశివర్ణం చతుర్భుజం|ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే||🪷🌹🔱🙏 #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - NAMO GANANADHA SHIVALOKAM PROJECT NAMO GANANADHA SHIVALOKAM PROJECT - ShareChat
*🙏🌹जय श्री महाकाल🌹🙏15-10-25,శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్ సుప్రభాత దర్శనం 🙏🪷🌹🔱* 🪷🔱🪷🔱🪷🔱🪷 *श्री महाकालेश्वर ज्योतिर्लिंग का भस्म आरती श्रृंगार दर्शन* *15-10-2025 कण-कण में महादेव*💕 🪷🔱🪷🔱🪷🔱🪷 *--SHIVALOKAM PROJECT* #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - श्री महाकालेश्वर भस्म आरती दर्शन    श्री महाकालेश्वर भस्म आरती दर्शन - ShareChat
*🙏🌹जय श्री महाकाल🌹🙏14-10-25,శ్రీ ఉజ్జయిని మహా కాళేశ్వర్ జ్యోతిర్లింగ్ సుప్రభాత దర్శనం 🙏🪷🌹🔱* *श्री महाकालेश्वर ज्योतिर्लिंग का भस्म आरती श्रृंगार दर्शन* *14-10-2025 कण-कण में महादेव*💕 🪷🔱🪷🔱🪷🔱🪷 --SHIVALOKAM PROJECT #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - श्री महाकालेश्वर भस्म दर्शन সামনী ಂದ ఫ్డ క్లీ 5 % 5 = 8 డ్డి 9 0 e  श्री महाकालेश्वर भस्म दर्शन সামনী ಂದ ఫ్డ క్లీ 5 % 5 = 8 డ్డి 9 0 e - ShareChat
🌹राजाधिराज द्वारकाधीश जी के मङ्गला आरती दर्शन श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात. 🪷🌹🪷🌹🪷🌹🪷 *दिनांक :- 14/10/2025 मंगलवार, శ్రీ ద్వారకాదినాధ శ్రీకృష్ణ భగవానుని సుప్రభాత దర్శనం 🪷🌹🙏🎻* 🪷🙏🪷🙏🪷🙏🪷 మీ.... శివలోకం ప్రాజెక్ట్ #⛳భారతీయ సంస్కృతి #🙏మన సాంప్రదాయాలు
⛳భారతీయ సంస్కృతి - V V - ShareChat
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - ShareChat
00:23
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ జ్ఞానం అంటే సర్వేశ్వరుని తెలుసుకోవడం "వివరంగా శివలోకం మీ కోసం.....*_ 🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹 వేదాంతమును సృష్టించిన వాడు వేదమును బాగా తెలిసిన వాడు. వేదములన్నిటిచే తెలియబడదగినవాడు శ్రీమన్నారాయణుడైన శ్రీమహావిష్ణువే ఆ పరమాత్మ. భగవద్గీతలో పదిహేనవ అధ్యాయంలో ఒక శ్లోకంలో పరమాత్మ స్వరూపాన్ని ఇలా చెప్పారు. *🕉️"శ్లో|| సర్వస్యచాహం-హృది సన్ని విష్టో మత్తః స్మృతిజ్ఞాన-మపోహనంచ* *వేదైశ్చసర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద-విదేవచాహం" అన్నారు.* పరమాత్మ సమస్త ప్రాణుల హృదయమునందున్నవాడు. జీవులకు జ్ఞా పకశక్తిని, జ్ఞానమును, మఱపును కలుగచేయుచున్నవాడు.వేదములన్నిటిచేతను తెలియదగినవాడు. వేదములందు, శాస్త్రములందు అనేక దేవులు, దేవతలు పేర్కొనబడినను, తెలుసుకొనదగినవాడు ఆ పరమాత్మ ఒకడే అయి ఉన్నాడు. త్రిమూర్తులు కూడా ఒక్క పరమాత్మగానే భాసిస్తూ వివిధ రూపులైయున్నారు. ప్రపంచమున ఒకే చరమలక్ష్యము- ధ్యేయము-జ్ఞేయము కలది పరమాత్మయే. లోకంలో గురుపరంపరను దెప్పునపుడు ఓం నారాయణం పద్మభువం అంటూ మొదట ఆ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుని పేర్కొంటారు. ప్రపంచంలో ముగ్గురు పురుషులుంటారు. క్షరుడు-అక్షరుడు- ఉత్తమ పురుషుడు ఉంటారు. పదిహేడవ శ్లోకంలో ఉత్తమ పురుషుని స్వభావాన్ని వర్ణిస్తూ.... *🕉️శ్లో||ఉత్తమః పురుషస్త్వన్స: పరమాత్మేత్యుదాహృతః* *యోలోకత్రయమా విశ్వ-భిభర్త్యవ్యయ ఈశ్వర ॥* అంటూ ఎవరు ఈ ముల్లోకములందును చేరి వానిని భరించుచున్నాడో అట్టి నాగరహితు డను. జగన్నియామకుడును అయిన పరమాత్మ క్షర-అక్షర పురుషుల కంటే వేరుగా ఉంటూ ఉత్తమ పురుషునిగా తెలియబడుచున్నాడు. 🕉️నశ్వర దేహాభిమాని కంటెనుచిత్ ప్రతిబింబరూపుడగు జీవుని కంటెను వేరుగ ఆత్మకలదు, అతడే ఉత్తమ పురుషుడని తెలిపాడు కృష్ణ పరమాత్మ. క్షణికమగు దేహాభిమానికంటెను బద్ధుడగు జీవునికంటెను ముక్తుడైన ఆత్మగొప్పవాడు శ్రేష్ఠుడు గదా. జీవుడు త్రిగుణ సహితుడు. పరమాత్మ త్రిగుణ రహితుడు. గుణాతీతుడు. ఈ కారణము వలన క్షర-అక్షర పురుషుల కంటెను ఉత్తముడుగా పరిగణింపబడి ఉత్తమ పురుషుడుని లేక పురుషోత్తముడని వ్యవహరింపబడుచున్నాడు. ఆత్మయందుండువాడే ఉత్తమ పురుషుడు. అలాంటి ఉత్తమ పురుషత్వమును- పురుషోత్త మత్వమును అందరూ కూడా ప్రయత్న పూర్వకముగా సంపాదించాలి. విజ్ఞులైన వారు ఎల్లకాలము జీవస్థితిలోనే అనగా బద్ద జీవితములోనే యుండుట వలన ఇబ్బందులెదురౌతాయి. క్రమంగా దేహస్థితిని, జీవస్థితిని దాటి, సాక్షియగు ఆత్మ స్థితికి అనగా పురుషోత్తముని స్థితికి వచ్చినవారు ధన్యులు, శ్రేష్ఠులు, ఈ స్థితియే జీవితము పరమావధి. పరమలక్ష్యము. దానివలన జన్మలు సార్ధకమౌతాయి. మిగిలిన ఇతర ప్రక్రియల చేతను మన మానవజన్మ సార్ధకతను పొందలేదు. పరమాత్మను, పరమాత్మ తత్త్వమును గ్రహించి సర్వలోకధారుని, అవ్యయుడని అంతర్యామిగా భావించి ఈశ్వరుడై వెలయుచున్న పరమాత్మ ధ్యాసలో, ధ్యానంలో, స్మరణలో తరించాలి. ✡️మోక్షప్రాప్తి వేళ జీవత్వము తొలగిపోతుంది. కావున ఏ కాలమందునూ నశింపని పరమాత్మ కొరకు సర్వులూ ప్రయత్నించాలి. పురుషోత్తముడైన పరమాత్మను ఎరుగువాడు నిర్మల భక్తితో సేవించి నిరంతరము అతనినే భజించాలి. ఎన్ని విద్యలు పొందినను, ఎంత పాండిత్యమును బడసినను, ఎన్ని కళలనార్జించినను మనుజుడు సర్వజ్ఞుడు, సర్వవేత్త కాలేడు. ఇవన్నియును పరమాత్మకు యందే ఉండుట వలన అచంచల భక్తి భావంతో సేవించి తరించాలి. పరిపూర్ణ మనస్సు తో మసలాలి. *"యస్మిన్ విజ్ఞాతే-సర్వమిదం విజ్ఞాతం భవతి"* ✡️దేనిని తెలిసికొనినచో సమస్తము తెలిసికొనబడినదగునో అట్టి పరమాత్మ నెఱగువాడే లోకంలో సర్వవేత్త- సర్వజ్ఞుడు కాగలడు. పరిపూర్ణ భావము దైవము యదార్థతత్త్వము తెలిసికొననిదే కాలగదు. ముందుగా పరమాత్మ విభవము వాస్తవ స్వరూపము తెలుసుకొనాలి. భక్తి భావమును విభజించి చూడరాదు. అభ్యాసంతో పూర్ణభక్తిని పొంది, సర్వభావమును అందరూ పొందాలని "సర్వభావేన" అనుపదానికి నిర్వచనంగా పరమాత్మ బోధించాడు. ఈ విషయాలను తెలిసికొన్నవాడు జ్ఞానవంతుడై కృతకృత్యుడవుతాడు. ఉత్తమ పురుషునిగా పరమాత్మని తెలిసికొని పాపరహితుడౌతాడు. ధీశక్తిని పొందుతాడు. యోగ్యత గల వారికే పరమాత్మతత్త్వం లభిస్తుంది. ఇదే జీవులకు లభించే జీవనరహస్యం, దుఃఖరహితము, వేదాహమేతం పురుషం మహాన్తమ్" అనిపురుషసూక్తం. ✡️🕉️✡️🕉️✡️🕉️✡️ _*మీ.... శివలోకం ప్రాజెక్ట్*_
🙏మన సాంప్రదాయాలు - OM NAMAH SHIVAYA SHIALOKAM PROJECT OM NAMAH SHIVAYA SHIALOKAM PROJECT - ShareChat