#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ జ్ఞానం అంటే సర్వేశ్వరుని తెలుసుకోవడం "వివరంగా శివలోకం మీ కోసం.....*_
🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹
వేదాంతమును సృష్టించిన వాడు వేదమును బాగా తెలిసిన వాడు. వేదములన్నిటిచే తెలియబడదగినవాడు శ్రీమన్నారాయణుడైన శ్రీమహావిష్ణువే ఆ పరమాత్మ. భగవద్గీతలో పదిహేనవ అధ్యాయంలో ఒక శ్లోకంలో పరమాత్మ స్వరూపాన్ని ఇలా చెప్పారు.
*🕉️"శ్లో|| సర్వస్యచాహం-హృది సన్ని విష్టో మత్తః స్మృతిజ్ఞాన-మపోహనంచ*
*వేదైశ్చసర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద-విదేవచాహం" అన్నారు.*
పరమాత్మ సమస్త ప్రాణుల హృదయమునందున్నవాడు. జీవులకు జ్ఞా పకశక్తిని, జ్ఞానమును, మఱపును కలుగచేయుచున్నవాడు.వేదములన్నిటిచేతను తెలియదగినవాడు. వేదములందు, శాస్త్రములందు అనేక దేవులు, దేవతలు పేర్కొనబడినను, తెలుసుకొనదగినవాడు ఆ పరమాత్మ ఒకడే అయి ఉన్నాడు. త్రిమూర్తులు కూడా ఒక్క పరమాత్మగానే భాసిస్తూ వివిధ రూపులైయున్నారు. ప్రపంచమున ఒకే చరమలక్ష్యము- ధ్యేయము-జ్ఞేయము కలది పరమాత్మయే. లోకంలో గురుపరంపరను దెప్పునపుడు ఓం నారాయణం పద్మభువం అంటూ మొదట ఆ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుని పేర్కొంటారు. ప్రపంచంలో ముగ్గురు పురుషులుంటారు. క్షరుడు-అక్షరుడు- ఉత్తమ పురుషుడు ఉంటారు.
పదిహేడవ శ్లోకంలో ఉత్తమ పురుషుని స్వభావాన్ని వర్ణిస్తూ....
*🕉️శ్లో||ఉత్తమః పురుషస్త్వన్స: పరమాత్మేత్యుదాహృతః*
*యోలోకత్రయమా విశ్వ-భిభర్త్యవ్యయ ఈశ్వర ॥*
అంటూ ఎవరు ఈ ముల్లోకములందును చేరి వానిని భరించుచున్నాడో అట్టి నాగరహితు డను. జగన్నియామకుడును అయిన పరమాత్మ క్షర-అక్షర పురుషుల కంటే వేరుగా ఉంటూ ఉత్తమ పురుషునిగా తెలియబడుచున్నాడు.
🕉️నశ్వర దేహాభిమాని కంటెనుచిత్ ప్రతిబింబరూపుడగు జీవుని కంటెను వేరుగ ఆత్మకలదు, అతడే ఉత్తమ పురుషుడని తెలిపాడు కృష్ణ పరమాత్మ. క్షణికమగు దేహాభిమానికంటెను బద్ధుడగు జీవునికంటెను ముక్తుడైన ఆత్మగొప్పవాడు శ్రేష్ఠుడు గదా. జీవుడు త్రిగుణ సహితుడు. పరమాత్మ త్రిగుణ రహితుడు. గుణాతీతుడు. ఈ కారణము వలన క్షర-అక్షర పురుషుల కంటెను ఉత్తముడుగా పరిగణింపబడి ఉత్తమ పురుషుడుని లేక పురుషోత్తముడని వ్యవహరింపబడుచున్నాడు. ఆత్మయందుండువాడే ఉత్తమ పురుషుడు. అలాంటి ఉత్తమ పురుషత్వమును- పురుషోత్త మత్వమును అందరూ కూడా ప్రయత్న పూర్వకముగా సంపాదించాలి. విజ్ఞులైన వారు ఎల్లకాలము జీవస్థితిలోనే అనగా బద్ద జీవితములోనే యుండుట వలన ఇబ్బందులెదురౌతాయి. క్రమంగా దేహస్థితిని, జీవస్థితిని దాటి, సాక్షియగు ఆత్మ స్థితికి అనగా పురుషోత్తముని స్థితికి వచ్చినవారు ధన్యులు, శ్రేష్ఠులు, ఈ స్థితియే జీవితము పరమావధి. పరమలక్ష్యము. దానివలన జన్మలు సార్ధకమౌతాయి. మిగిలిన ఇతర ప్రక్రియల చేతను మన మానవజన్మ సార్ధకతను పొందలేదు. పరమాత్మను, పరమాత్మ తత్త్వమును గ్రహించి సర్వలోకధారుని, అవ్యయుడని అంతర్యామిగా భావించి ఈశ్వరుడై వెలయుచున్న పరమాత్మ ధ్యాసలో, ధ్యానంలో, స్మరణలో తరించాలి.
✡️మోక్షప్రాప్తి వేళ జీవత్వము తొలగిపోతుంది. కావున ఏ కాలమందునూ నశింపని పరమాత్మ కొరకు సర్వులూ ప్రయత్నించాలి. పురుషోత్తముడైన పరమాత్మను ఎరుగువాడు నిర్మల భక్తితో సేవించి నిరంతరము అతనినే భజించాలి. ఎన్ని విద్యలు పొందినను, ఎంత పాండిత్యమును బడసినను, ఎన్ని కళలనార్జించినను మనుజుడు సర్వజ్ఞుడు, సర్వవేత్త కాలేడు. ఇవన్నియును పరమాత్మకు యందే ఉండుట వలన అచంచల భక్తి భావంతో సేవించి తరించాలి. పరిపూర్ణ మనస్సు తో మసలాలి.
*"యస్మిన్ విజ్ఞాతే-సర్వమిదం విజ్ఞాతం భవతి"*
✡️దేనిని తెలిసికొనినచో సమస్తము తెలిసికొనబడినదగునో అట్టి పరమాత్మ నెఱగువాడే లోకంలో సర్వవేత్త- సర్వజ్ఞుడు కాగలడు. పరిపూర్ణ భావము దైవము యదార్థతత్త్వము తెలిసికొననిదే కాలగదు. ముందుగా పరమాత్మ విభవము వాస్తవ స్వరూపము తెలుసుకొనాలి. భక్తి భావమును విభజించి చూడరాదు. అభ్యాసంతో పూర్ణభక్తిని పొంది, సర్వభావమును అందరూ పొందాలని "సర్వభావేన" అనుపదానికి నిర్వచనంగా పరమాత్మ బోధించాడు. ఈ విషయాలను తెలిసికొన్నవాడు జ్ఞానవంతుడై కృతకృత్యుడవుతాడు. ఉత్తమ పురుషునిగా పరమాత్మని తెలిసికొని పాపరహితుడౌతాడు. ధీశక్తిని పొందుతాడు. యోగ్యత గల వారికే పరమాత్మతత్త్వం లభిస్తుంది. ఇదే జీవులకు లభించే జీవనరహస్యం, దుఃఖరహితము, వేదాహమేతం పురుషం మహాన్తమ్" అనిపురుషసూక్తం.
✡️🕉️✡️🕉️✡️🕉️✡️
_*మీ.... శివలోకం ప్రాజెక్ట్*_
