🪷🌹🔱🙏శివోహం 🪷🌹🔱🙏
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
_*🌹🔱🙏🎻"శివనామ స్మరణ గొప్పదనం" గురించి శివలోకం మీ కోసం....*_
🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏🌹🔱🙏
(తప్పనిసరిగా చదవండి. శివ తత్వం కొంత వరకైనా అర్ధం అవుతుంది.)
🌹🙏🌹🙏🌹🙏🌹
వేదాలలో 'యజుర్వేదం' గొప్పది. యజుర్వేదంలో నాల్గవకాండలో ఉన్న 'రుద్రం' ఇంకా గొప్పది. రుద్రం మధ్యలో ఉన్న 'పంచాక్షరి' అంతకంటే గొప్పది. 'పంచాక్షరి' లోని రెండక్షరాలు మరీ గొప్పవి. ఆ రెండక్షరాలు.... - "శివ". శివ అంటే 'మంగళం' 'శుభం' అని అర్ధం.
- శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు.
నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే ...
🌹🔱🙏ఈ సంసారిక జీవితంలో మానవజన్మ తరించాలంటే నామ స్మరణ చేయాలి. భగవంతుణ్ణి చేరే మార్గంలో నామస్మరణం ఉత్తమం. 'శివ' అనే రెండక్షరాలు పరబ్రహ్మ స్వరూపం.🔱🙏 *'శి' అంటే పాపనాశనం. 'వ'అంటే ముక్తిప్రదానం.*
🌹🔱🙏లోకసమస్తాన్ని తనలో నిలుపుకొని, తానే లోకమైన విశ్వనాధుడు ఈశ్వరుడు. ఆదిదేవుడు, ఆద్యంతరహితుడు అయిన శివుడు మన జీవనతాత్త్వికతకు అతిసన్నిహితంగా ఉంటాడు. సుఖదుఃఖాలు అనే ద్వంద్వాల నడుమ సాగే మన జీవనయానంలో ద్వంద్వాలన్నింటినీ ఏకంచేసే అద్వయమూర్తిగా గోచరిస్తాడు.
🌹🔱🙏ప్రమధాది గణాలను నియంత్రించే సర్వాత్మకుడైన పరమశివుడే ఇంద్రియాల్ని నియంత్రించగలిగిన శక్తిమంతుడు.
🌹🔱🙏కాలకూట విషాన్ని, శేషనాగును కంఠంలో ధరించి ఉండటం ద్వారా మృత్యుంజయ రూపత్వం విశదమౌతుంది. గంగను శిరస్సుపై ధరించి విశ్వముక్తి మూలాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
🌹🔱🙏అగ్నిమయమైన తృతీయ నేత్రం దగ్గరే చంద్రకళను ధరించి ఉండడం వల్ల సంహారకర్త పోషకత్వరూపమై విరుద్ధ ధర్మాశ్రయత్వాన్ని దిగ్దర్శితం చేస్తున్నట్లు తెలుస్తుంది.
🌹🔱🙏సర్వలోకాధిపతియై కూడా విభూతీ వ్యాఘ్రచర్మాన్ని ధరించి పామును మెడలో వేసుకొని, కపాలం చేబూని శ్మశానంలో తిరుగాడే లోకశివశంకరుడు వైరాగ్యంనే శ్రేష్ఠమైనదిగా వ్యక్తం చేస్తున్నాడు.
🌹🔱🙏అణిమాది అష్టసిద్దులున్న - ఒంటికి పూసుకునేది భస్మమే. చుట్టుకున్నది గజవస్త్రమే. ధరించేది నాగభరణాలే. శివుని మూడోనేత్రం జ్ఞాననేత్రం. నటరాజు స్వరూపం - కళాంతరంగుడైన శివుని కళా స్వరూపానికి ప్రతీక. స్వచ్ఛతకు హిమాలయం మారుపేరు. ధర్మరూపమైన వృషభమే వాహనం. చంద్రుడు చిత్తానికి ప్రతినిధి. గంగ చంచలత్వానికి గుర్తు. పులి స్వార్ధ చింతనకు మరో రూపం. ఏనుగంటే నిలువంత గర్వం. వాటన్నింటిని జయించమని చెబుతుంది శివతత్వం. నంది ధర్మానికి సర్పాలు నిర్భయత్వానికి నిదర్శనం.
🌹🔱🙏భస్మాన్ని ధరించిన ఆయన దగ్గర ఏముందీ అని అడుగుతారు కొందరు. కానీ,
భస్మాన్ని మించిన పవిత్రమైనది ఈ సృష్టిలో వేరే ఏమీ లేదు. జన్మాంతర పాపాలను దహించి వేసేదే భస్మం. కాబట్టే, భస్మానికి 'విభూతి' అని పేరు. విభూతి అంటే ఐశ్వర్యమనీ అర్ధముంది.
🌹🔱🙏తాను గరళాన్ని మింగి లోకానికి అమృతం దక్కించిన ఈ నీలకంఠుని నెత్తిన నీళ్లు కుమ్మరిస్తే చాలు, మెచ్చి వరాలు కురిపించేస్తాడు. దోసెడు నీళ్ల అభిషేకం, చిటికెడు బూడిద అలంకారం, కూసిన్ని బిల్వపత్రాలు, కాసిన్ని ఉమ్మెత్తపువ్వులు, 'శంభో శంకర శరణు శరణు' అన్న స్మరణకే పొంగిపోయే బోళాశంకరుడు.
🪷🌹🔱🙏అందుకే,....💦💦💦
*నీలకంఠుని శిరసుపై నీళ్లుచల్లి*
*పత్తి రిసుమంత ఎవ్వాడు పాఱవైచు*
*కామధేనువు వానింటి గాడిపసర*
*మల్ల సురశాభి వానింటి మల్లెచెట్టు"*
అని మాదయగారి మల్లన్నవారు కొనియాడారు.
🌹🔱🙏సామాన్యుడైన, సంపన్నుడయినా, విద్యావంతుడయినా, అవిద్యావంతుడయినా, మిత్రుడయినా, శత్రువయినా పశువయినా, పురుగయినా ... అందరూ శివయ్యకు సమానమే. అందుకే -
సుహృద్విపక్ష పక్షమో, తృణారవింద చక్షు షో, ప్రజా మహిమహేంద్రయో, సమ ప్రవృత్తికః ... అని శివతాండవస్తోత్రం లో రావణాసురుడు కీర్తిస్తాడు.
🌹🔱🙏సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం. ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాసుడు.... అందర్నీఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు శివయ్య.
రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించాడు. భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చాడు. దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడు శంకరుడు. ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు.
🌹🔱🙏మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసిన చిరంజీవత్వమును ఒసగేసాడు, తిన్నడు నిరక్షరాసుడయిన ముక్తినిచ్చాడు.
సాలెపురుగు సర్పం, ఏనుగు ప్రేమకే పరవశించి మోక్షాన్ని ప్రసాదించేసాడు. చెట్టునెక్కి, భయంతో రాత్రంతా మెలుకువగా ఉండడం కోసం కొన్ని ఆకులు వేసేసరికి విలుకాడిని కూడా ఆదరంగా అక్కున చేర్చేసుకున్నాడు. అధికపనులతో కష్టింపజేసిన, అవమానించిన, అవరోధించిన .... నొవ్వక నొప్పించక చెదరని భక్తితో, దీపారాధన చేసే చాకలి పోలికి స్వర్గప్రాప్తినిచ్చాడు. ఒకానొక రోజు, విసుగ్గా ఓ ఇల్లాలు విసిరిన మలిన వస్త్రాన్ని ఆనందంగా స్వీకరించి, శుభ్రపరచి, వత్తులుగా చేసి వెలిగించిన బీద బ్రాహ్మణుకి జీవనముక్తినే ప్రసాదించిన కారుణ్యమూర్తి. ఎంతటి కరుణశాలియో కదా, ఈ గుండె చల్లని దేవర.
🌹🔱🙏వేదాలు -వాదాలు, పాండిత్య చర్చలు - పామరుల ప్రశ్నలు, తర్కాలు - మీమాంసాలు, సోత్కర్షలు - సలహాలు, సొగసులు -బేషజాలు, అవసరం లేదు భక్తికి. స్వచ్ఛమైన ప్రేమ కనబరిస్తే చాలు కదిలిపొతాడు, కరిగిపోతాడు, కరుణిస్తాడు ఈ భక్తవత్సలుడు.
*🌹🔱🙏మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్ |ఏకేన ముక్తిమాప్నోతి ద్వాభ్యాం శంభూ ఋణీ భవేత్ ||*
*🌹🙏🔱భావము :మహాదేవ మహాదేవ మహాదేవ అని ముమ్మారు ఉచ్చరించునట్టివారికి ఈశ్వరుడు ఒకమారు స్మరణకు ముక్తినిఛ్చి, మిగిలిన రెండుమార్లు స్మరణకు రుణపడి ఉంటాడు.*
చన్నీటి స్నానాలు, నిత్యా దీపారాధనలు, ఆలయ సందర్శనాలు, అభిషేకాలు అర్చనలు, అష్టోత్తరాలు, శివనామస్మరణలు ... ప్రతీ కార్తీకమాసంలో ఎంతోమంది చేస్తున్నారు. మరి వారికెందుకు ముక్తి రావడం లేదు??? మరి పై కధలన్నీ అబద్దమా???
శివార్చనలో పోటీపడి తమని తాము అర్పించుకునేటంత దృఢభక్తి సాలీడు పాము ఏనుగులకు ఉన్నందునే శివసాయుజ్యమునే ప్రాప్తింపజేశాడు ఆ శ్రీకాళహస్తీశ్వరుడు.
తనకున్న శక్తిలో నోటిదారాలతోనే తనకై గూడు కాదు, శివునికై గుడి కట్టింది సాలెడు. ఆ రీతిలో మనం కూడా, మన బుద్ధిశక్తిని ఆశలదారాలను ఆస్తులు అంతస్థుల చుట్టూ తిప్పకుండా, కాస్త పరమేశ్వరార్పణం చేస్తే ముక్తి వస్తుంది.
తనదగ్గరున్న విలువైన మణిని శివుని ముందు పెట్టి భక్తితో పూజించి తపించేది పాము. అదే రీతిలో మనలో బుసలుకొట్టే అరిషడ్వార్గాల పామును పట్టి పరమాత్ముని చుట్టూ తిప్పి తపిస్తే ముక్తి వస్తుంది.
తన తొండం నిండా జలమును నింపి అపార భక్తి పరవశంతో శివాభిషేకం చేసేది ఏనుగు. అటులనే దేహమే నేనన్న బలమైన అహంతో మధించిన మనస్సనే గజాన్ని అంకుశమనే అకుంఠిత భక్తితో అదుపులో పెట్టి శివకైంకర్యానికి ఉపక్రమిస్తే కైవల్యం వస్తుంది. ఆ మూడింటిలా ఒకే ధ్యాసతో చిత్తశుద్ధితో తపనతో మనమూ ఆరాధించాలి.
*తిన్నడని బోయవాడు కధకు వస్తే.....*
🪷🌹🔱🙏🪷🌹
తిన్నడు తత్వాన్ని ముందు గ్రహించండి -
వృక్షమూలంలో శివుణ్ణి దర్శించి, అక్కడే సేవిస్తూ వుండిపోయిన భక్తిత్వమే స్థిరత్వం, ఏ వంకరలు లేని ఏకాగ్రతయే తిన్నని తనం. చెక్కు చెదరని పట్టుదలే ధీరత్వం. మనోదృష్టిని చెదరనీయకుండా శివుణ్ణే దర్శిస్తూ, తన దృష్టిని నమ్మిన శివునికే నివేదించడం సర్వ సమర్పణం. ఆ రీతిలోనే మన దివ్య చక్షువుతో అంతరాలయంలో నున్న శివుణ్ణి దర్శించి, త్రికరణాలను శివార్పణం చేస్తే మోక్షమొస్తుంది.
శివుని మహిమల్ని గుర్తించి ఆరాధించడమే భక్తి. పై కధల్లో చాలావరకు గతజన్మ పుణ్య ప్రారబ్ధాలు కలిసివచ్చాయని నా భావన. అందుకే పెద్దలు పూర్వజన్మ సుకృతం వుండాలిఅంతారు. మనం కూడా చేసే సాధనాలు వృధా పోవు. ఏ జన్మలోనో కలిసివచ్చి ముక్తిని ప్రసాదిస్తాయి.
*శివపూజ:*
🪷🌹🔱🙏🪷🌹
*మనస్సును శుద్ధి చేసుకోవడం"అభిషేకం".అత్యాశలనువదిలించుకోవడం"విభూతిధారణ". నేనే అన్న అహం, నాదీ అన్న మాయ, నేనే చేస్తున్న అన్న క్రియ - ఈ మూడుభావాలనువిడిచిపెట్టడం"త్రిదళసమర్పణం".అప్పుడేతేజోమయమైన "ఆత్మలింగం" కాంచగలం.*
🪷🌹🔱🪷🌹🔱🪷
మీ.... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
_*🪷🌹🔱"శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 24"శివలోకం మీ కోసం....*_
🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱
*చండముండ వధ - 1*
🌸🌹🌸🌹🌸🌹🌸
ఋషి పలికెను :
🪷🌹🪷🌹🪷🌹🪷
అంతట అతనిచేత ఆజ్ఞాపింపబడినవారై అసురులు చతురంగబల సమేతులై, ఆయుధాలు పైకెత్తి, చండముండులు ముందు నడుస్తూ బయలుదేరారు.
ఆ పర్వతరాజంపై ఒక గొప్ప బంగరు శిఖరంపై సింహంపై కూర్చుని చిరునగవుతో ఉన్న దేవిని వారు చూసారు.
ఆమెను చూసినప్పుడు కొందరు ఉత్సాహపూరితులై ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇతరులు వంపబడిన ధనుస్సులతో, ధరింపబడిన ఖడ్గాలతో ఆమెను సమీపించారు.
అంతట అంబిక ఆ శత్రువులపై ప్రచండ రోషపూరితయయ్యెను. ఆమె ముఖం సిరా వలె నల్లనయ్యింది.
బొమముడిపాటుతో భయంకరంగా ఉన్న ఆమె నొసటి నుండి హఠాత్తుగా ఘోర ముఖంతో, ఖడ్గపాశాయుధాలను ధరించి కాళికాశక్తి వెలువడింది.
విచిత్రమైన పుట్టెతలతో ఉన్న దండం దాల్చి, పుప్లైలపేరు ఆభరణంగా ధరించి, పెద్దపులిచర్మాన్ని కట్టుకొని, కండలు శుష్కించడంతో మిక్కిలి భీషణమై కనబడుతూ, తెరుచుకొని ఉన్న నోటితో, భయానకంగా వ్రేలాడు నాలుకతో, లోతుకుపోయిన ఎఱ్ఱని కన్నులతో, దిక్కులు పిక్కటిల్లే గర్జిరావాలతో ఆమె ఆ సైన్యంలోని మహాసురులపై రభసంగా పడి చంపి, ఆ సురవైరి బలాలను భక్షించివేసింది.
ఏనుగులను, వాటి వెంబడి వారితో, మానటీండ్రతో, స్వారి చేసే యోధులతో, ఘంటలతో సహా ఒక్క చేతితో లాగి పట్టుకొని నోట్లోకి విసరి వేసుకుంటూ ఉంది.
అలాగే తురగబలాన్ని, గుర్రలతో, రథంతో, సారథితో సహా నోటిలో వేసుకొని అత్యంత భయంకరంగా పళ్ళతో నమలివేసూ ఉంది.
ఒకణ్ణి జుట్టుపట్టి, మరొకణ్ణి మెడపట్టి లాగుకొంది. ఒకణ్ణి కాలితో తొక్కి, మరొకణ్ణి బొమ్ముతో నెట్టి సుగుజేసింది.
ఆ అసురులు ప్రయోగించిన శస్త్రాలను, మహాస్త్రాలను నోటితో పట్టుకొని రోషంతో పళ్ళతో నమలివేసింది.
దుష్టులు బలిష్ఠులు అయిన ఆ రక్కసుల సైన్యాన్నంతా, కొందరిని భక్షించి, మరికొందరిని కొట్టి, నాశమొనర్చింది.
కొందరు ఖడ్గంతో నరకబడ్డారు; కొందరు ఆమె ఖట్వాంగం (పుట్టెతల బెత్తం)తో కొట్టబడ్డారు. కొందరు ఆమె పంటిమొనలతో నమిలి వేయబడి నశించారు.
🪷🌹🔱🪷🌹🔱🪷
మీ... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ మహాదేవ 🙏🪷🌹🔱
🪷🌹🔱🙏శుక్లాం బరధరంవిష్ణుం శశివర్ణం చతుర్భుజం|ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే||🪷🌹🔱🙏
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ నమఃశివాయ 🪷🌹🙏🔱
*🙏🌹जय श्री महाकाल🌹🙏16-10-2025 శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ సుప్రభాత దర్శనం 🙏🪷🌹🔱*
🪷🔱🪷🔱🪷🔱🪷
*श्री महाकालेश्वर ज्योतिर्लिंग का भस्म आरती श्रृंगार दर्शन*
*16-10-2025 कण-कण में महादेव*💕
🪷🔱🪷🔱🪷🔱🪷
*--SHIVALOKAM PROJECT*
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
_*🪷🌹🪔🙏"అక్టోబర్-18వ తేది యమ దీపారాధన" గురించి శివలోకం మీ కోసం.....*_
🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔
దీపావళి అమావాస్య నుంచి నాగుల చవితి వరకు ఐదురోజుల పాటు జరుపుకునే వేడుక.ఈ వేడుకలలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే.ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం..
అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు,ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం..
యమ దీపం అనేది మృత్యుదేవత అయిన యమ భగవానుని పూజించడానికి అంకితం చేయబడిన రోజు. ఆరోజు మాత్రమే అవకాశం సాయం సంధ్య వేళలో సమయం 5.48 pm to 7.05 pm ఆ సమయంలో వెలిగించండి..
మన ఇంటి గుమ్మానికి బయటనా చక్కగా శుభ్రం చేసుకొని తుడుచుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఉంటే తమలపాకు పరిచి దానిపైన ఉప్పు కళ్ళు పోసుకుని ప్రమిదలు నాలుగు పెట్టుకోవాలి నాలుగు దిక్కులా చూస్తున్నట్టు జ్యోతిని వెలిగించుకోవాలి ఒకవేళ లేదు అంటే ఫోటోలో చూపిస్తున్నట్టు ఒక ప్రమిదలోని నాలుగు దిక్కుల వత్తులు వేసుకొని వెలిగించవచ్చు..
యమ దీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి.దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కు గా చెబుతుంటారు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకు మంచిదని, ఎలాంటి భయాలు దరి చేరవని నమ్మకం..
నైవేద్యం కొంచెం బియ్యం బెల్లం పెట్టుకోవాలి అవి తర్వాత రోజు ఉదయాన్నే పక్షులకి పేటయండి.. చక్కగా నమస్కరించుకుని యమ మంత్రాన్ని చదువుకోండి..
*యమ గాయత్రీ మంత్రం...*
🪷🌹🪷🌹🪷🌹🪷
ఔం సూర్య-పుత్రయే విద్మహే| మహాకాలయే, ధీమహి తన్నో యమః ప్రచోదయాత్||
యమ భగవానుడు భక్తులను దీర్ఘాయువుతో, శ్రేయస్సుతో రక్షిస్తాడని మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తాడని నమ్ముతారు. ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు మరియు ప్రజలు ధనత్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి, ఎందుకంటే భక్తులు యమ భగవానుడికి ప్రార్థనలు చేసే ఏకైక రోజు.
ఎవరైనా పెట్టుకోవచ్చా సంతోషంగా పెట్టుకోవచ్చు దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు..
దీని వెనుక ఒక పురాణ గాధ దాగి ఉందని చాలా మందికి తెలియదు. యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన ఆ కథే.. యమదీపం పుట్టుకకు కారణమైంది..
పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు. అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే నాలుగో రోజుకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు. ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అనేది తప్పించలేనిది. కాలక్రమంలో యువరాజుపై ఒక రాకుమారికి ప్రేమ పుట్టింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు తెలిసినా.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది. చివరికి రాజు కూడా విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించాడు.
వివాహం జరిగి నాలుగో రోజు.. ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది. అదే రోజు రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రాసాదానికి చేరుకున్నాడు. కానీ రాజమహల్ లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. యువరాణి సర్వసంపదలతో ప్రాసాదాన్ని అలంకరించి… బంగారు ఆభరణాలను రాశులుగా పోసి.. దీపాల వెలుగులతో రాజమహల్‌ను ప్రకాశవంతం చేసింది. సంపద దేవత లక్ష్మీదేవిని స్తుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తోంది. ఆ వెలుగులు, బంగారు మెరుపులు, గానాల సౌందర్యం యముడినే కట్టిపడేశాయి. సమయం గడిచిపోయింది. మృత్యు ఘడియ దాటిపోయింది. యముడు ఖాళీచేతులతో తిరిగి వెళ్లిపోయాడు.
ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది.
ధన త్రయోదశి మరొక ప్రత్యేకత ధన్వంతరి జయంతి. పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మథనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు. ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు. సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యో నారాయణ హరి అని స్తుతిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుందని విశ్వసిస్తారు..
🪷🌹🪷🌹🪷🌹🪷
మీ.... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి
_*🪷🌹🔱🙏"పాండవ తీర్థం, తిరువణ్ణామలై క్షేత్రం" గురించి శివలోకం మీ కోసం.... #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱
మహాభారతం ఆది కావ్యంగా పేరొందినది. వ్యాస భగవానుడు ప్రధాన పాత్ర పోషిస్తూ స్వయంగా తెలుపగా విఘ్ననాయకుడు శ్రీ గణపతి అక్షరీకరించిన మహా కావ్యంలో అన్ని యుగాలకు మరియు కాలాలకు సంబంధించిన విషయాలు వివరంగా ఉండటం విశేషం. అందుకే పెద్దలు అంటారు మహా భారతంలో లేనిది లేదు అని. రాజకీయం, కుట్రలు, కుతంత్రాలు, యుద్దాలు, ప్రజల జీవన శైలి, నీతి నియమాలు, న్యాయ, అన్యాయాలు, ధర్మ, అధర్మాలు,స్త్రీ గౌరవం, ఎంతటి వారినైనా వదలని కర్మ ఫలం ఇలా ఎన్నో పంచమ వేదం లో కనిపిస్తాయి.
🌹🔱🙏ఈ మహా పురాణంలో ప్రధాన పాత్రలు కౌరవులు మరియు పాండవులు. వీరు దండయాత్రల పేరిట, యాత్రల నిమిత్తం మరియు ఇతర కార్యక్రమాల కొరకు భారతదేశ నలుమూలలా తిరుగాడినట్లుగా తెలుస్తోంది.
🌹🔱🙏అందుకే భారత దేశంలోని ప్రతి రాష్ట్రం లోని ఏదో ఒక చోట వీరితో ముడిపడి ఉన్న ప్రదేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పాండవులు లక్క దహనం తరువాత,మాయా జూదంలో ఓటమి పాలు అయిన తరువాత చేసిన పుష్కర కాల అజ్ఞాత వాసంలో అనేక ప్రాంతాలలో నివసించినట్లుగా అనేక స్థానిక కధనాలు తెలుపుతున్నాయి. అక్కడి వారు వాటికి తగిన ఆధారాలను కూడా చూపిస్తారు.
అలాంటి వాటిల్లో పంచ భూత స్థలాలలో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన తిరువణ్ణామలై ఒకటి. భక్తులలో అపరిమిత ఆదరణ కలిగిన జ్యోతిర్లింగాలకు బీజం పడినది ఇక్కడే అని పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీ మహా విష్ణు మరియు విధాత బ్రహ్మదేవుని మధ్య అహంకారంతో తలెత్తిన ఆధిపత్య పోరును తొలగించడానికి శ్రీ పరమేశ్వరుడు జ్యోతి రూపంలో వారికి దర్శనమిచ్చి, జ్ఞానాన్ని ప్రసాదించినది కూడా ఇక్కడే అని అరుణాచల పురాణం పేర్కొంటోంది. వారివురి కోరిక మేరకు కైలాసనాధుడు కొండగా కొలువైనది ఇక్కడే అన్న విశ్వాసంతో భక్తులు పర్వతం చుట్టూ పదునాలుగు కిలోమీటర్ల దూరం నియమంగా భక్తిశ్రద్దలతో ప్రదక్షిణ చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ అరుణాచల యాత్ర పరిపూర్ణం కాదని నమ్ముతారు.
గిరి ప్రదక్షిణ మార్గంలో ఎనిమిది దిక్పాలక లింగాలు, లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య మరియు చంద్ర లింగాలు మరియు శ్రీ దూర్వాస, శ్రీ గౌతమ మరియు శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్థ్య మహర్షుల సన్నిధులు ఉంటాయి. ఇలాంటి విశేష ఆలయాలను మరెక్కడా చూడలేము. ఈ పదునాలుగు కిలోమీటర్ల మార్గంలో అనేక కనపడుతుంటాయి. అన్నీ కూడా అరుణగిరిని చూస్తూ ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మార్గంలో శ్రీ కన్నప్ప నయనార్ మరియు శ్రీ ఆది అణ్ణామలై ఆలయాలు అరుదైనవి. పురాతనమైనవి.
భక్తులు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కనుక చూస్తే అనేక రూపాలలో కనిపిస్తుంది. వీటన్నిటి లోనికి కుబేర తరువాత వచ్చే పంచముఖ దర్శనం ముఖ్యమైనది. ఇక్కడే మహనీయులు శ్రీ ఇసక్కి జీవ సమాధి కలదు. సుమారు ఆరు దశాబ్దాల క్రిందట వందల సార్లు గిరికి అంగప్రదక్షిణ చేసిన మహానుభావులు వీరు.
ఇవన్నీ తిరువణ్ణామలై తరుచుగా సందర్శించే వారికి తెలిసినవే ! తెలియని రెండు ముఖ్య విశేషాల గురించి తెలుసుకొందాము.
🌹🔱🙏పాండవ తీర్థం
లక్క ఇంటి అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్న పాండవులు కొంత కాలం కాలం వివిధ ప్రాంతాలలో తలదాచుకున్నారు. ఆ క్రమంలో కొన్ని రోజులు వారు తిరువణ్ణామలై లో కూడా ఉన్నారని చెబుతారు.
_*🌹🔱🙏విశ్వసించిన వారిని విశ్వనాధుడే విపత్తుల బారి నుండి విముక్తి కలిగిస్థాడన్న లోకోక్తి ఉన్నదికదా ! దానిని పూర్తిగా విశ్వసించిన పాండు పుత్రులు ఈ క్షేత్రంలో ఉన్నన్ని రోజులు నిత్య పూజల నిమిత్తం లింగాన్ని ప్రతిష్ఠించు కొన్నారట. అభిషేకాదుల కొరకు ఒక కొలను కూడా నిర్మించారట.*_
🌹🔱🙏అవే నేడు పాండవ లింగం పాండవ తీర్థం అని పిలవబడుతున్నాయి.
చాలా మంది తిరువణ్ణామలై నివాసులకు కూడా వీటి గురించి తెలియదు.
బాగా వర్షాలు కురిస్తే పర్వత పాదాల వద్ద ఉండటంతో పాండవతీర్థం కూడా పూర్తిగా నిండి పోయి కనపడుతుంది. కొండ వాలులో నివసిస్తున్న వారికి పాండవ తీర్ధమే ప్రధాన నీటి వనరు. నీరు స్వచ్ఛంగా ఉంటుంది. గట్టున ఉన్న ఆలయంలో సర్వేశ్వరుడు పాండవ లింగ రూపంలో కొలువై ఉంటారు.
🌹🔱🙏గర్భాలయంలో శ్రీ పాండవ లింగేశ్వరుడు పక్కన ఉన్న సన్నిధులలో శ్రీ పార్వతీ దేవి మరియు శ్రీ గణపతి కొలువుతీరి దర్శనమిస్తారు. ప్రతి రోజు ఉదయం పూట మాత్రమే నిర్వహిస్తారు. శనివారం మాత్రం సాయం సంధ్యా సమయంలో ప్రత్యేక పూజ చేస్తారు.
ఆలయానికి కొద్దిగా దిగువన మరో కోనేరు కనపడుతుంది. ఆకారంలో చిన్నదైన రెండో కోనేరు పేరు"భీమ పుష్కరణి"ట. దానిని వాయుపుత్రుడు, అమిత బలవంతుడైన భీమసేనుడు తమ నిత్యకృత్యాలకు మరియు ప్రజల నీటి అవసరాల నిమిత్తం నిర్మించడం వలన ఆయన పేరుతోనే పిలుస్తున్నారట.
🌹🔱🙏పరమేశ్వరుని పూజాదికాల ప్రయోజనార్ధం నిర్మించబడిన పాండవ తీర్థ పవిత్రతను కాపాడటానికి దీనిని నిర్మించారట. కానీ నేడు ఈ భీమ పుష్కరిణి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనది. బాగుచేయడం అత్యంత ఆవశక్యంగ అనిపిస్తుంది చూడగానే!.
🌹🔱🙏మరో విశేషం ఏమిటంటే నియమంగా ప్రతి నిత్యం సూర్యాస్తమయ కాలంలో రెండు కృష్ణ గరుడ పక్షులు వచ్చి శ్రీ పాండవ లింగేశ్వరునికి ఆకాశంలో ప్రదక్షిణాలు చేయడం.
పవిత్ర అరుణాచల పర్వత పాదాల వద్ద నలువైపులా పరుచుకున్న పచ్చని చల్లని వాతావరణంలో శ్రీ పాండవ లింగేశ్వరుని దర్శించుకోవడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.
అగ్ని లింగం నుండి సుమారు రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అగ్ని లింగం దగ్గర అడిగితే దారి చూపుతారు.
🌹🔱🙏శ్రీ దూర్వాస మహాముని సన్నిధి
మనుకున్న అనేక మంది మహర్షులలో శ్రీ దూర్వాసమహాముని స్థానం ప్రత్యేకమైనది. ఈయన ముక్కోపి. ఆ కోపకారణంగా అనేక మంది జీవితాలు రకరకాల మార్పులకు లోను కావడం మన పురాణాలలో కనపడుతుంది. కానీ అవన్నీ కూడా ఆయా వ్యక్తులలో కావలసిన మార్పు తేవడానికి లేక జీవిత గమనాన్ని సన్మార్గంలో ప్రయాణించడానికో కారణమవ్వడం విశేషం. అలా ఆయన ఆగ్రహానికి గురి కాకుండా అనుగ్రహాన్ని పొందిన ఒకే ఒక్కరు పాండవ మాత కుంతీదేవి. వివాహానికి పూర్వం తమ రాజ్యానికి విచ్చేసిన మహర్షికి తండ్రి కుంతిభోజుని ఆజ్ఞ మేరకు సముచిత అతిధి సేవలు అందించి ఆయనను సంతోషపరచినది. ఆనందంతో మహర్షి ఆమెకు ప్రసాదించిన వర ప్రభావంతో వివాహానికి ముందు ప్రత్యక్ష నారాయణుని అనుగ్రహంతో కర్ణుని, వివాహానంతరం ధర్మ, భీమ,అర్జనులను కుమారులుగా పొందడం మహాభారత కథా గమనాన్ని మార్చడం వేరే విషయం.
🌹🔱🙏యోగ క్షేత్రం అయిన తిరువణ్ణామలైలో తాను సంతానాన్ని పొందడానికి పరోక్షంగా సహాయపడిన మహర్షి యొక్క ఆలయాన్ని నిర్మించాలన్న తలంపు కలిగిందట కుంతీదేవికి.
తల్లి కోరిక తెలుసుకొన్న కుమారులు పవిత్ర గిరి మార్గంలో తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసి మహాముని విగ్రహాన్ని ప్రతిష్టించారట.
🌹🔱🙏అలా అరుణగిరి ప్రదక్షిణా మార్గంలో ఇద్దరు మహర్షులతో పాటు శ్రీ దూర్వాస మహర్షి సన్నిధి ఏర్పడినది. ముఖ మండపం మరియు గర్భాలయం మాత్రమే చిన్న ఆలయంలో శ్రీ దూర్వాస మహాముని పద్మాసనంలో ధ్యాన ముద్రలో ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు.
🌹🔱🙏 ఆలయానికి వెలుపల ఉన్నచిన్నరాతి మండపంలో కనిపించే పాద ముద్రలు కుంతీదేవివి అని చెబుతారు. భక్తులు మహామునికి పసుపుతో అర్చన చేసి, నివేదన సమర్పించుకొంటారు. అనంతరం ఆలయానికి వెనుక ఉన్న వేప చెట్టుకు పూసిన కొత్త గుడ్డను కడతారు. దీని వలన వివాహం వారికి వివాహం, సంతానం వారికి సంతాన యోగం మహర్షి అనుగ్రహంతో కలుతాయన్నది తరతరాల విశ్వాసం. పౌర్ణమి, పర్వదినాలలో, ఆదివారాలు కొందరు స్త్రీలు వీటిని అక్కడ అమ్ముతుంటారు. అదేవిధంగా వేపచెట్టు పక్కన ఉన్న విశాల స్థలంలో సొంత ఇంటి కల నిజం కావాలన్న ఆశతో,దానికి మహర్షి ఆశీర్వాదాలు లభిస్తాయన్న తలంపుతో రాతిని రాతి పైన పేరుస్తారు భక్తులు.
శ్రీ దూర్వాస మహాముని ఆలయం పై నుండి చీలి గిరి వెనుక ఉన్న మార్గంలో వచ్చే రెండో నంది విగ్రహానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుండి అరుణాచల దక్షిణ వాలుకు చూస్తే సహజసిద్ధంగా రాళ్లతో ఏర్పడిన నంది ముఖ దర్శనం లభిస్తుంది.
అద్భుతాలకు నిలయమైన తిరువణ్ణామలై లో ఉన్న అనేక అద్భుతాలలో పైన పేర్కొన్న రెండూ కూడా చాలామందికి తెలియని అరుదైన ప్రదేశాలుగా పేర్కొనవచ్చును.
🪷🌹🔱🙏🪷🌹🔱
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల !!!
🪷🌹🔱🙏🪷🌹🔱
_*మీ.... శివలోకం ప్రాజెక్ట్*_