#📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
*ముమ్మిడివరం పిడిఎస్ బియ్యం పట్టివేత కలకలం*
*సివిల్ సప్లై డైరెక్టరుపై.1.50 లక్షల డిమాండ్ ఆరోపణ*
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన పిడిఎస్ బియ్యం పట్టివేత ఘటన పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారితీసింది. హై స్కూల్ సెంటర్ సమీపంలోని ఒక బియ్యం దుకాణంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు.
తనిఖీ సందర్భంగా రెండు బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ వ్యవహారం బయటికి వెళ్లకుండా చూసేందుకు డైరెక్టరు వెంట ఉన్న వ్యక్తి రూ.1,50,000 డిమాండ్ చేశాడని దుకాణ యజమాని ఆరోపిస్తూ ఈ విషయాన్ని ముమ్మిడివరం చాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఛాంబర్ సభ్యులు వెంటనే దుకాణానికి చేరుకుని డైరెక్టరుతో ఘర్షణకు దిగారు. ఇది రేషన్ బియ్యం అవునా కాదా అన్నది మీరు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రధాన రహదారి పక్కనే దుకాణం ఉండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. తరువాత పరిస్థితిని సమీక్షించిన ఛాంబర్ సభ్యుల మధ్యస్థంతో దుకాణదారుడు—సివిల్ సప్లైస్ డైరెక్టర్ మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం.
ఈ సంఘటనతో ముమ్మిడివరం ప్రాంతంలో పిడిఎస్ బియ్యం పట్టివేత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

