*సిస్టర్, బ్రదర్ అంటూనే.. పాడు పనులా?*
*ఈరోజుల్లో చాలామంది పిలుపులు పైకి బాగుంటున్నాయి కానీ, బుద్ధులు మాత్రం బాగోవటం లేదు, పైకి ఆత్మీయతను ఒలకపోస్తున్నారు కానీ లోపల నీచమైన కార్యాలు చేయడానికి తెగ ఎగబడే వారు లేరా. ఒకవేళ నీలో అటువంటి బుద్ధి ఉంటే.. వాటికి దూరం కావడం చాలా మంచిది. దేవుని చేత ఎలా సహోదరి ప్రేమ కలిగి ఉండాలో బైబిల్ లో మనం చూస్తాం. మరి నీవు దేవుని చేత సహోదరి ప్రేమ కలిగి ఉండటం నేర్చుకున్నావా? లేదా కామంతో నిండిపోయిన కోరికలతో పైకి మాత్రమే ప్రేమ కలిగిన వ్యక్తిగా నటిస్తూ.. పైకి మాత్రమే చక్కని పేర్లు పెడుతూ, చక్కని రిలేషన్ ఏర్పరచుకుంటూ.... లోపల మాత్రము నీచమైన ఆలోచనతో కూడిన మనిషిగా బతుకుతున్నావా?*
*మనం దేవుని హృదయం గలవారమైతే ఆయన ప్రేమ కలిగి జీవించాలి. బ్రదర్ అంటే బ్రదర్.. సిస్టర్ అంటే సిస్టర్ కావాలి. చెల్లి అంటే చెల్లిగానే చూడాలి, తమ్ముడు అంటే తమ్ముడు గానే చూడాలి, అన్నా అంటే అన్నయ్య గానే చూడాలి, అక్క అంటే అక్కగానే చూడాలి, కానీ ఈ రోజుల్లో చాలామంది చెల్లి, చెల్లి అంటున్నారు కానీ చివరకు చెల్లి అనే పదానికి వత్తు తీసి చెలిగా భావించేవారు ఎంతమంది లేరు, సిస్టర్ అంటూనే .. అదే సిస్టర్ తో అక్రమ సంబంధం ఏర్పరుచుకునే ఎంతమంది దుర్మార్గులు లేరు. జాగ్రత్త.. చివరికి దేవుడు నీకు జీవం లేకుండా, బ్రతుకు లేకుండా చేస్తాడు. దేవుడు నీ జీవితాన్ని ఆర్పేయబోతున్నాడు జాగ్రత్త!! ఆరోజు రాకమునుపే జాగ్రత్త పడితే మంచిది.*
*దేవుని చేత ఏర్పరచబడిన మనము ఎంత పరిశుద్ధంగా, ఎంత ఆత్మీయంగా, ఎంత పవిత్రంగా, ఎంతో బహు జాగ్రత్తగా జీవించాలో ఒక్కసారి ఆలోచించండి!! క్రైస్తవ విలువలను, క్రైస్తవ విశ్వాసమును, క్రైస్తవ వాక్యానికి జీవిత విధానమైన ఆధారాన్ని మనం ప్రతి రోజు ఘనపరిచేవారిగా ఉండాలి.*
*ప్రాముఖ్యంగా సేవలో ఉంటున్న వారు, పరిచర్యలో ఉంటున్న వారు బహు జాగ్రత్తగా ఉండాలి. సిస్టర్ అంటున్నప్పుడు సిస్టర్ గానే భావించు, బ్రదర్ అంటున్నప్పుడు బ్రదర్ గానే భావించు. నీ భార్య తప్ప ప్రతి ఒక్కరు నీకు సిస్టర్స్ కావాలి, నీ భర్త తప్ప ప్రతి ఒక్కరు నీకు బ్రదర్స్ కావాలి, నీలో వక్రపు ఆలోచనలుగాని, వక్రపు తలంపులుగాని, వక్రపు పిలుపులు గాని, వక్రపు చూపులు గాని దేవుని బిడ్డగా నీలో ఉండకూడదు. దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం దేవుని మందిరంలోనికి అడుగు పెట్టాలి కానీ కామ కోరికలను తీర్చుకోవడానికి దేవుని మందిరాన్ని ఆశ్రగా తీసుకుంటున్నట్లయితే.. జాగ్రత్త! నీ దగ్గర ఉన్న దీప స్తంభాన్ని దేవుడు హఠాత్తుగా తీసేస్తాడు. ఆరోజు రాకముందు పై నీవు జాగ్రత్తపడు.*
*పైపై ప్రేమలు, పైపై ఆత్మీయత, పైపై నవ్వు, పైపై పిలుపులు, పైపై ఆప్యాయత, పైపై చిరునవ్వు మంచిది కాదు సుమా!! మనం సహోదరి ప్రేమ ఎలా కలిగి ఉండాలో దేవుని చేత నేర్పించబడ్డాం. నీవు ఎవరినైనా పలకరించాలంటే.. ప్రేమతో పలకరించు. నీ హృదయములో ఉన్న ఆత్మీయతను బట్టి పలకరించు. అంతేగాని వేషధారణ పలకరింపు, పలకరించాలి కాబట్టి పలకరించాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలి కాబట్టి షేక్ హ్యాండ్ ఇవ్వాలని అనుకోవడం దేవుని బిడ్డకు తగదు. బ్రతికున్న మూడునాలు నిజమైన దేవుని బిడ్డలుగా జీవిద్దాం, నిజమైన క్రైస్తవులుగా జీవిద్దాం, క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా జీవిద్దాం!!*
*నీవు ఎవరిని పులకరించినా, ఎవరిని చూసి చిరునవ్వు నవ్వినా, ఎవరికి చేయూత ఇవ్వాలన్నా.. నటించడం మానేయండి. మనం దేవుని ప్రేమిస్తున్నాము అని చెబుతున్నట్లయితే.. మన సహోదరున్ని ప్రేమించాలి. కనిపించె సహోదరిని సహోదరుడుని ప్రేమించకపోతే.. ఇంటివారినే ప్రేమించకపోతే నీ దేవున్ని ఎలా ప్రేమించగలవు? నీ పక్కవారిని ఎలా ప్రేమించగలవు? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో!!*
*********************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://www.youtube.com/@calvarykiranalu-l7t
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
************************************
#JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #i love jesu #Jesus #jesu #యేసు ప్రభువు

