అ... అమ్మతోనె అందరము
ఆ.. ఆవు పాలు మధురము
ఇ.. ఇటుక గోడ మందము
ఈ .. ఈల పాట విందాము
ఉ.. ఉడుత బొమ్మ గీద్దాము
ఊ.. ఊయలంటె యిష్టము
ఎ... ఎలుక పేరె మూషికము
ఏ... ఏనుగుకొకటి తొండము
ఐ.. ఐదవు వేళ్ళు అందము
ఒ.. ఒంటె మెడసుదీర్ఘము
ఓ.. ఓడ నీట పయనము
ఔ... ఔ అనగా ఔషధము....
***************************
ఆ.వె:
పల్లెనిండు బాష! ఎల్లజనులభాష! పసిడివెలుగుభాష! ప్రజలభాష !
సత్యమైన భాష! నిత్యవాడుక భాష !
అడుగు గిడుగు భాష! అమ్మ భాష!!
#🌺దేశభాషలందు తెలుగు లెస్స 🌺 #దేశ భాషలందు తెలుగు లెస్స.. 👌👏🤠

