ShareChat
click to see wallet page
#📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం *అక్రమ లే-అవుట్లపై చర్యలు తీసుకోరా..?* *టౌన్ ప్లానింగ్ పనితీరుపై సభ్యుల అసంతృప్తి..* *పారిశుధ్య నిర్వహణపై అసహనం..* వార్డులలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదంటూ *అధికార,ప్రతిపక్ష కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు...* ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వెలిసిన అక్రమ లేవుట్లు, భవన నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని 17వ వార్డు కౌన్సిలర్ బొంతు సత్యశ్రీనివాస్ ప్రశ్నించారు. ముమ్మిడివవరం నగర పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో ఛైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. అక్రమ లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల విషయం సభ దృష్టికి తీసుకువచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సత్యశ్రీనివాస్ అడిగారు. అముడా పరిధి నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారని కమిషనర్ వివరణ ఇవ్వడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఫ్లోర్ లీడర్ ములపర్తి బాలకృష్ణ మాట్లాడుతూ మార్కెట్లో నిల్వ ఉన్న చేపలు,మాంసాహారం విక్రయిస్తున్నారని,విద్యుత్తునియంత్రికల వద్ద తుప్పలు పెరిగిపోయి ప్రమాదదకర పరిస్థితులుగా మారుతున్నాయన్నారు. మార్కెట్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డులో మురుగు జలాలు వదులుతున్నారని 7వ వార్డు కౌన్సిలర్ గంజా శ్రీనివాసరావు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. *బందరుపాలెం,అగ్రహారం ప్రాంతాల్లో అక్రమ లే-అవుట్లువేసి తాగునీటి పైపులైన్లను సైతం తొలగిస్తున్నారని ఆరోపించారు.* ఈ సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ - googeकo  పరసారికసంసు ১৯৪g০১০০  googeकo  పరసారికసంసు ১৯৪g০১০০ - ShareChat

More like this