ShareChat
click to see wallet page
#శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #కార్తీక మాసం #🔱🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏శివపార్వతులు *శివనామస్మరణం శుభకారకం.....* *ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానందభాజాం* *అంటూ కార్తీకంలో శివుని కొలువనివారు అరుదుగా ఉంటారు. విష్ణుభక్తులు సైతం "శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగం శివః" అంటూ మహావిష్ణువును పూజిస్తారు. శివభక్తులకోసం ప్రపంచమంతా శివాలయాలు న్నాయి. వాటిల్లో పంచదార్ల శివుడు మహిమో పేతుడని ఖ్యాతి వహించినవాడు.* *కైలాసవాసిఅయిన పరమేశ్వరుడు ఓ సారి విశాఖ పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలో గాజువాక యలమంచలి దారిలో స్వయంభువుగా వర్ధమానలింగరూపంలో దర్శనం ఇచ్చాడు. అప్పుడక్కడి భక్తులు ఆయన్ను కొలిచారట. కొంతకాలం తరువాత కర్మతాలుకు ఏర్పడిన కుష్ఠురోగాన్ని పోగొట్టుకోవడానికి యమధర్మరాజు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ కాలగర్భంలో కలసిపోతున్న ఈ శివలింగాన్ని బయటకు తీసి మరలా పునఃప్రతిష్ఠించాడట. దానితో ఈ శివలింగానికి ధర్మలింగేశ్వరుని నామంతో కూడా ఇక్కడి వారు శివుణ్ణిని కొలిచేవారట. ఈ ధర్మలింగేశ్వరుణ్ణి కొలిచిన వారికి వ్యాధులు దూరమవుతాయట. అంతే కాక ముక్తినిచ్చేవాడే ఈ ఈశ్వరుడేనని భక్తులు నమ్మికొలుస్తారు. ఈ క్షేత్రంలోనే భూగర్భంలో నుంచి ఐదుచోట్ల జలధారలు ఉబికి వస్తాయట. ఇది ఫణిగిరి పర్వతం క్రింద వుండే రాంబిల్లి మండలంలో ఈ జలధారల పొంగులు కనిపిస్తాయి. ఈ ఐదు జలధారల పేర్లమీదే ఈ క్షేత్రానికి పంచధారలు అన్న పేరు ఏర్పడింది. కాలక్రమేణ పంచధారలు కాస్త పంచదార్లగా మారిపోయిందని ఇక్కడి నివాసితులు చెబుతున్నారు.* *ఈ పంచధారలు నిరంతరం ప్రవహిస్తునే ఉండడం వల్ల వీటిని ఆకాశ ధారలుగా భక్తులు ప్రస్తుతిస్తుంటారు. ఈ పంచధారలలో నీటిలో గంధకం శాతం ఎక్కువగా ఉన్నందు వల్లే ఇక్కడ స్నానాలు చేసేవారికి అనేకానేక రుగ్మతలు పోతున్నాయని హేతువాదులు చెబుతుంటారు. ఈ ధర్మలింగేశ్వరుని పాండవులు కూడా కొలిచినట్లు చెప్తారు. ఈ ఫణిగిరి పర్వతంపైనే ఓ గుహ వుంది. ఆ కాలంలో పాండవులు ఇందులో కొంతకాలం నివసించారని అందుకే ఈ గుహకు పాండవుల గుహ అన్ననామం ఏర్పడిందనీ అంటారు.* *ఈ పంచధారల క్షేత్రంలో నారసింహుడు మొదట పాదం మోపాడట. కాని ధర్మలింగేశ్వరుడు ఆయన్ను సింహగిరిలో నివాసమేర్పచు కోమన్నందు వల్ల సింహగిరిలో కొలువై సింహగిరి నరసింహుడుగా ఖ్యాతి పొందుతున్నాడని కొందరు భక్తులు అంటారు. ఆ నరసింహుడు మొదట పాదం మోపిన గుర్తుగా ఇక్కడ నారసింహుని పాద చిహ్నాలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ దర్శనం ఇచ్చే రాధామాధ వాలయానికి పశ్చిమంలో అతి ప్రాచీనమైన కాశీవిశ్వేశ్వర ఆలయం కూడా కనిపిస్తుంది. దీనిని యలమంచలి నాగేంద్ర దేవుడనే రాజమ హేంద్రవరపు గవరశెట్టి నిర్మించినట్లు ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.* *ఈ ధర్మలింగేశ్వరుడి ఆలయంలో విశాలమైన నృత్య మండపం, ఆస్థాన మండపం ఉన్నాయి. వీటిలో సుందరమైన శిల్పసంపద భక్తులనే కాక ఇక్కడి ప్రాచీన కట్టడాలను వీక్షించడానికి వచ్చే యాత్రీకులను సైతం ఆకర్షిస్తుంది. ఈ మండపాలలోని చెక్కడాలు ఆనాటి శిల్పసౌందర్యాన్ని మచ్చుతునకల్లా కనిపిస్తున్నాయి.* *కార్తీకాన ఈ రాధామాధవాలయంలోను, ధర్మలింగేశ్వరుని ఆలయంలోనూ దీప తోరణాలు భక్తులను కైలాసదర్శనం చేసుకున్న అనుభూతికిలోను చేస్తాయి. రాధా మాధవ స్వామి ఆలయం ఈ ధర్మలింగేశ్వరుని ఆలయం, పంచధార క్షేత్రం ఆస్తికులకు, నాస్తికులకు ఆనందాన్నిచ్చే పుణ్యక్షేత్రంగా భాసిస్తోంది.* *┈┉━❀꧁నమఃశివాయ꧂❀━┉┈* *ఆధ్యాత్మిక అన్వేషకులు* 🍁⚜️🍁 🙏🕉️🙏 🍁⚜️🍁
శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ - 8 8 8 8 - ShareChat

More like this