ShareChat
click to see wallet page
_*🌹🎻🙏🪷అమ్మలను కన్న అమ్మలు మనం ఈ వ్యాసం లో చెప్పుకోబోయే అమ్మలు వారి గురించి శివలోకం మీ కోసం..... #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి 🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻 దక్ష ప్రజాపతికి "స్వాథా" అనే ఇంకొక కుమార్తె కలదు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. వారెవ్వరూ ఆమె గర్భము. నుండి జన్మించ లేదు. వారు ఆమె మానస పుత్రికలు పెద్దకుమార్తె మేనాదేవి రెండవకుమార్తె ధన్యాదేవి. మూడవ కుమార్తె కళావతి. ఒకసారి "స్వాథా" తన కుమార్తెలను తీసుకుని శ్వేతదీపానికి వెళ్లింది. అక్కడ శ్రీమహావిష్ణువు అందరికి దర్శనం ఇస్తూ ఉంటాడు. అనేకమంది ఋషులు ఆయన దర్శనానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా! అక్కడ వారంతా ఉన్నారు. ఆ సమయంలో సనక సనందాది ఋషులు అక్కడికి వచ్చారు. అందరూ! వారి గౌరవార్థం లేచినుంచున్నారు. కాని అక్కడ ఉన్న "స్వాథా" కుమార్తెలు గమనించలేదు. అక్కడి అద్భుత ప్రదేశాన్ని చూస్తూ మైమరచిపోయారు. అందరూ! ఒక్కసారి మౌనం వహించాడు. పరంధాముని సన్నిధిలో కూడా వారు ముగ్గురు పరిహాసాలాడు కుంటున్నారు. అది చూసి సనకాది ఋషులకు కోపము వచ్చింది. "చపలమైన మనస్సులు కలవారు భూలోకంలో పుట్టండి" అని శాపము ఇచ్చారు. అప్పుడు కాని వారికి వారి తప్పు తెలియలేదు. "సోథా” తన కుమార్తెలతో వారి పాదాలపై పడింది. "మేమంతా శ్వేతద్వీపంలోని అద్భుతాలకు మైమరచిపోయాము అంతేకాని మిమ్మల్ని అవమానపరచాలని కాదు" అని శాపాన్ని తిరిగి తీసుకోమని ప్రాధేయపడ్డారు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీమహావిష్ణువు సనకాదులవైపు మందస్మితవదనంతో చూసాడు. వారు తమ కోపాలను తగ్గించుకొని వారివైపు తిరిగి "మీరంతా భూలోకంలో తప్పకుండా జన్మిస్తారు. కాని మీమీ కుమార్తెల వలన మీరు కూడా అందరితో మన్ననలు అందుకుంటారు. మేనాదేవి కుమార్తె పార్వతి శంకరుని తన భక్తితో గెలుచుకుని పరిణయమాడుతుంది. ధన్యాదేవి భూలోకంలో జనక మహారాజును వివాహం చేసుకొని "సీత"ను అల్లారుముద్దుగా పెంచుతుంది. ఆమెను శ్రీరాముడు చేపట్టుతాడు. ఇక కళావతి ద్వాపరయుగంలో రాధను కుమార్తెగా పొంది ఆమెను పెంచి పెద్దచేస్తుంది. వీరంతా జగత్ప్రసిద్ధి గాంచిన మహాపురుషులకు భార్యలు అవుతారు" అని చెప్పి సనకాదులు అక్కడి నుండి వెళ్లిపోయారు. మేనాదేవి హిమవంతులు ఎంతోకాలంగా సంతానం కొరకు పూజలు చేసారు. శ్రీమహావిష్ణువును వారు ప్రార్ధించారు. దేవతల కల్యాణం కొరకు వారికి పార్వతి జన్మించింది. పార్వతి తపస్సుతో పరమశివుని మెప్పించి భర్తగా పొందింది. త్రేతాయుగంలో ధన్యాదేవి పుట్టి జనకమహారాజును వివాహం చేసుకొంది. సీతాదేవిని పెంచి పెద్ద చేసింది. సీతాదేవిని శ్రీరాముడు "శివధనస్సు" విరిచి గెలుచుకుని పెండ్లి ఆడాడు. విధివిలాసం వారిద్దరిని అరణ్యవాసానికి పంపించింది. భరతుడు తిరిగి వారిని అయోధ్యానగరానికి తీసుకొని వెళ్లడానికి సహాయపడవలసినదిగా జనకమారాజును ఆహ్వానం పంపాడు. జనకమహారాజు ధన్యాదేవి వనవాసం చేస్తున్న చిత్రకూటం వద్దకు వచ్చారు. అక్కడ భరతుడు మహారుషులు ధర్మనిపుణులు సమావేశం అయ్యారు. పలురకాలుగా చర్చించారు. జనకమహారాజు ధన్యాదేవి వనవాసం పూర్తిగా చెయ్యాలని శ్రీరాముడు తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఆయన ధర్మనిరతికి చాలా సంతోషించారు. ఒంటరిగా ధన్యాదేవి సీతాదేవిని కలిసింది. "పతివ్రతా ధర్మాన్ని ఆచరించాలి" అని హితవు చెప్పింది. అత్తగార్లకు "సేవలు" చెయ్యమని చెప్పింది. వీరి అరణ్యవాసానికి కారణం అయిన కైకేయిని కూడా కౌసల్య సుమిత్రలతో సమానంగా గౌరవించాలని కోరింది. ద్వాపరయుగంలో కళావతి పుట్టింది. శ్రీకృష్ణుణి పెంచిన నందుని వలె మరియొక యాదవ ప్రముఖుడు అయిన వృషభానుని పెండ్లి ఆడింది. అప్పుడు ఆమె పేరు రత్నాగర్భాదేవి. బర్మానా అనే చోట చిన్న సముదాయం అతనిని ముఖ్యుడుగా ఎన్నుకున్నారు. వీరంతా తమపై ఆధారపడిన ప్రజలను చక్కగా చూసుకుంటే మధుర రాజైన కంసునికి "కప్పాలు" (అడగకుండానే) వారంతట వారే కట్టేవారు. కంసుని విశ్వాసపాత్రులు అయ్యారు. శ్రీకృష్ణుడు నందగ్రామంలోనే ఉన్నట్లు కంసునికి అనుమానం కలిగేవరకు వారిపై దృష్టి పడలేదు. ఆ తరువాత మాత్రమే కంసుని దృష్టివారిపై పడింది. అనేక వింతపరిణామాలు జరిగిపోయాయి. రాధాకృష్ణుల అలౌకిక ప్రేమ జగత్ప్రసిద్ధము. నందుని కుటుంబము వృషభానుని కుటుంబాలు ఉత్సవాలలో కలుసుకునేవి, అక్కడే రాధాకృష్ణులు రాధ కూడా అక్కడే ఉంది. శ్రీకృష్ణుడు మధురానగరానికి వెళ్లి తిరిగి రాలేదు. ఒకసారి స్నేహితుడయిన ఉద్దవుని మాత్రము అక్కడికి పంపాడు. ఆయన బృందావనంలో గోపికలను కలుసు కున్నాడు. వారంతా శ్రీకృష్ణుని ఆటపాటలు గుర్తుచేసుకొని వారి వారి పనులు చేసుకుంటున్నారు. ఒంటరిగా రాధాకృష్ణునితో మాటలాడుతున్నది. ఉద్దవుడు ఆశ్చర్యపడ్డాడు. వారు వేరొక లోకంలో ఉన్నారు. ఆయన మౌనంగా తిరిగి ద్వారక వెళ్లి చూడగా శ్రీకృష్ణుడు ద్వారకలో కూడా ఉన్నాడు. అంతవరకు తాను మాత్రమే శ్రీకృష్ణునికి నిజమైన మిత్రుడు అనుకున్న ఉద్దవునికి రాధ గొప్పదనం అర్ధం అయింది. ఆమె శ్రీకృష్ణుని ఏమి కోరలేదు. కాని ఆయనే ఆమె వశుడయ్యాడు. "సీతారాములు గౌరీశంకరులు రాధాకృష్ణులు" అని మాత్రమే అంటారు. శ్రీకృష్ణునికి ఎంతోమంది భార్యలు భార్యలు ఉన్నా" రాధాస్థానం ఎంతో ఉన్నతమైనది. ఈవిధముగా జగదీశ్వరులను చేపట్టిన "అమ్మలను కన్న అమ్మలు" మేనాదేవి, ధన్యాదేవి, కళావతి అంతటి. ప్రాముఖ్యాన్ని పొందారు. 🪷🌹🎻🪷🌹🎻🪷 _*మీ.... శివలోకం ప్రాజెక్ట్*_
🙏మన సాంప్రదాయాలు - "అమ్మలగన్న ಅಮ್ಮೆಲು: శివలోకం ప్రాజెక్ట్ "అమ్మలగన్న ಅಮ್ಮೆಲು: శివలోకం ప్రాజెక్ట్ - ShareChat

More like this