ShareChat
click to see wallet page
#భగవద్గీత #🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 #🙏 గురుమహిమ #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... #జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev *🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 *🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹* *19. ఓం తత్త్వ ప్రబోధిన్యై నమః* జగత్తు యొక్క తత్త్వాన్ని శ్రీమద్భగవద్గీత తెలుపుతుంది. దృశ్యమాన జగత్తు మొత్తం, అందలి సమస్త రూపాలు నశించిపోయేవే అని తెలుపుతుంది. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః । అనాశినో-ప్రమేయస్య తస్మాత్‌ యుధ్యస్వ భారత ॥ 2.18 దేహి యొక్క దేహం అంతమై పోయేదే. కాని దేహి నాశరహితుడు, నిత్యుడు. నామ రూపాత్మకమైన చరాచర జగత్తు, అందలి సమస్తం ఎప్పుడో ఒకప్పుడు నశించేదే. అయితే మరి నిత్యమైనది ఏది? ఆత్మ స్వరూపుడుగా దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. ఎప్పుడయితే దేహం యొక్క అనిత్యత్వాన్ని గుర్తిస్తామో అప్పుడు దేహ భ్రాంతి తొలగిపోతుంది. దేహం పట్ల మమకారం నశిస్తుంది. దేహం నశించినా ఆత్మ నశించదు అని, అది పరమాత్మ స్వరూపమే అని భగవద్గీత తెల్పుతుంది. ఆత్మ నాశనం లేనిది. నిత్యమైనది. న జాయతే మ్రియతే వా కదాచిత్‌ । 2.20 ఆత్మ ఎప్పుడూ పుట్టటం లేదు. చనిపోవటం కూడా లేదు. నేను ఆత్మ స్వరూపుడిని, నాశనం లేనివాడిని. నాకు, పరమాత్మకు భేదం లేదు. ఈ ఆత్మతత్త్వాన్ని బోధిస్తున్న గీతామాతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.   జై గురుదేవ్ 🙏
భగవద్గీత - ShareChat
00:53

More like this