మత్తు మందులకు బానిస అవుతున్న యువత!
లేదా
ఆరోగ్యకరమైన సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్న మధుపానం(మద్యపానం),ధుమపానం వంటి దురలవాట్లు!
అతి చిన్న వయసులోనే మత్తు మందులకు బానిసలూ అవుతూ అటు అనారోగ్యం బారిన పడుతూ ఇటు ఇంటిని గుల్ల చేస్తూ తమ బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్న యువతను సరియైన దారిలో నడిపించే వారెవరు? క్షణికావేశంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి చెడుస్నేహాల బారినపడి ఇటు ధుమపానం అటు మధుపానం(మద్యపానం) చేస్తూ వారి మీద ఎన్నో గంపెడు ఆశలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులకు, జననీజనకులకు పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తూ వారి పాలిట యమధర్మరాజులా మారుతున్న నేటి యువత తీరుతెన్నులు తీవ్ర ఆందోళనకరం,ఆవేదన కలిగించే విషయం.కాయకష్టం చేస్తూ తాము తిని తిన గానక తమ పిల్లల ఉన్నత,ఉజ్వల భవిష్యత్తు కోసం వారికి చక్కటి విద్యాబుద్ధులు చెప్పించడం కోసం పైసా పైసా కూడబెట్టి వారి చేతికి అందిస్తే వారు ఆ పైసలతో సినిమా,షికార్లు అంటూ ఎడపెడా ఖర్చు చేస్తూ వారి విద్యాభ్యాసాన్ని అటకెక్కించడం ఏ మేరకు భావ్యమో ఒక్కసారి యువత విచక్షణాజ్ఞానంతో ఆలోచించాలి. అలాకాకుండా చదువు మీద ఏ మాత్రం ధ్యాస పెట్టకుండా ఆడింది ఆటగా పాడింది పాటగా మీ ఇష్టనుసారంగా వ్యవహారిస్తూ పోతే మాత్రం ఇటు మీ బంగారు భవిష్యత్,అటు మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న కోటి ఆశలు ఆడి ఆశలుగా మారి బూడిద లో పోసిన పన్నీరులా మిగిలిపోవడం తథ్యం.కాబట్టి మద్యపానం,ధుమపానం అనే ఈ రెండు రుగ్మతలకు,మహమ్మారిలకు ఎలాంటి పరిస్థితుల్లో బలి కాకుండా మనల్ని మనం కాపాడుకుంటే చాలు మన జీవితం ఉన్నంతలో ఎలాంటి ఓడుదుడుగులు లేకుండా సాపిగా సాగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలా కాకుండా పొరపాటున ఈ రెండు విష గుళికల బారిన పడ్డామంటే ఇక మన అమూల్య జీవితం కుక్కలు చింపిన విస్తరే అనే మాట సత్య దూరం కాదు.
ఏదిఏమైనా మధుపానం(మద్యపానం), ధుమపానం అనే ఈ అత్యంత ప్రమాదకరమైన విషసర్పాల వంటి దురలవాట్లు యువత ఉజ్వల భవిష్యత్తుకు ఓక శనిలా పట్టిన చీడపురుగులు, రాబందుల్లా,పిశాచుల్లా పీక్కుతినే అతి క్రూరమైన స్వభావం వీటి స్వంతం.అలాగే పొరపాటున, దురదృష్టవశాత్తు ఈ రెండు శాపగ్రస్తం,కుదిబండ వంటి వీటికి లొంగిపోతే యువత తమతో పాటు ఈ ఆరోగ్యకరమైన సమాజాన్ని సైతం బ్రష్టుపట్టించిన వారవుతారు.కాబట్టి ఇప్పటికైనా నిద్రాణావస్థలో వున్న యువత అతి తొందరగా మేల్కొని,ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్తంత బాధ్యతతో మెలుగుతూ ఈ రెండు భయంకరమైన విష సర్పాల,క్రూర మృగాల వంటి ధుమపానం,మద్యపానం వంటి వాటికి ఆమడ దూరంలో వుంటూ తమ విలువైన కెరీర్ ను అభివృద్ధి చేసుకుంటే మాత్రం నేటి యువత అటు తమ జీవితాలను చక్కబెట్టుకోవడంతో పాటు,ఇటు మున్ముందు ఈ దేశాన్ని, వారి తల్లిదండ్రులను సైతం ఉద్ధరించిన వారవుతారు.జయ జయహో నేటి యువత! వారి ఉజ్వల భవిష్యత్ అత్యంత తేజోవంతంగా ఓక వెలుగు వెలగాలి!అందుకు ఈ సభ్య సమాజం యావత్తు తీవ్ర కృషి సల్పాలి!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #మాయ దారి మత్తు

