
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
ఐ లవ్ షేర్ చాట్ నా హాబీలు: డాన్స్, రైటింగ్,రీడింగ్
ఓం శ్రీ గణపతి నమో నమ :
గజముఖవదనా శరణు గణేశా!
గౌరీపుత్ర శరణు గణేశా!
విజ్ఞ వినాయక శరణు గణేశా!
విష్ణు ప్రదాత శరణు గణేశా!
- మా హిందూ భక్తజనసందడికి ఆధ్యాత్మిక ఓం గం గణపతయే నమో నమ శుభ బుధవారం! #శుభ బుధవారం
ఏడుకొండలవాడు!
వడ్డీ కాసులవాడు!
కలియుగ భరతుడు!
కారుణ్యశీలుడు!
లక్ష్మీ సమేతుడు శ్రీ వెంకటేశ్వరుడు!
ఎంతటి భాగ్యం అమ్మో సప్తగిరి కొండలను దర్శించుట ఓ యమ్మో!
ఏ జన్మ పుణ్యఫలమో!
- మా హిందూ భక్త జన శ్రేయస్సుకు ఆధ్యాత్మిక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా శుభ శనివారం!🕉️🕉️🕉️ #శుభ శనివారం
ఈ రోజు మా 26వ వివాహ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని! ( 11-10- 1999 - 2025)!
సరిగ్గా ఈరోజుతో మా వివాహం జరిగి ఇరవై ఐయిదు సంవత్సరాలు గడిచి పోయు 26వ సంవత్సరంలోకి అడుగిడినాము అంటే మాకు నమ్మశక్యము కావట్లేదు.ఎందుకంటే కాలం అనేది ఓక నిరంతర ప్రవాహం వంటిది,ఆ కాలం అనేది అత్యంత వేగంగా మున్ముందుకు దూసుకుపోతూ ఉంటుంది,ఆ అనంత కాల ప్రవాహంలో మనం ఎన్నో చేదు,తీపి అనుభవాలు చవిచూసి ఉంటాము.ఎన్నో,మరెన్నో విజయాలను,అపజయాలను,గెలుపు ఓటములను ఎదుర్కొని ఉంటాం.అలాగే కాలం అనేది ఓక కొవ్వతిని వెలిగిస్తే ఎలా కరిగిపోతు ఉంటుందో అలా మన జీవిత కాలం కళ్లుమూసి తెరిచే లోగా ముగిసిపోతూ ఉంటుంది,దీన్ని ఆపడం ఎవరి తరము కాదు.కాబట్టి మనం జీవించి నన్ని రోజులు ఎలాంటి చీకు చింతలు లేకుండా దైవ చింతనలో,ఆధ్యాత్మిక పంథాలో సంతృప్తిగా జీవిస్తే అదే మనకు పది వేలు,వెయ్యి జన్మల పుణ్యఫలం కూడా!
ఏదిఏమైనా మన పెద్దలు సెలవిచ్చినట్లుగా వివాహబంధం అనేది నూరేళ్ళ మంట లాగా కాకుండా నూరేళ్ళ పంట లాగా మన విలువైన,అమూల్యమైన జీవితాలు అనోన్యంగా సాగిపోవాలి.అలా కాకుండా వివాహబందాన్ని మనం దురదృష్టవశాత్తు నూరేళ్ళ మంటలాగా చేసుకుంటే మాత్రం మనకు చిక్కులు, ఇబ్బందులు తప్పవు.కాబట్టి ప్రతి ఒక్కరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ వివాహబంధాన్ని విచ్చిన్నం చేసుకోకుండా చాలా దృడంగా,పది కాలాల పాటు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లేటట్లు చేసుకోవాలని మా సవినయ,హృదయపూర్వక మనవి!
- బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #పెళ్లిరోజు
( 11 - 10 - 2025) మన జననేత,మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగనన్న గారికి నమ్మినబంటు,కుడిభుజం వంటి వైస్సార్సీపీ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ & మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇవే నా ఆత్మీయ,అభిమాన,గౌరవపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ముఖ్యంగా ఆయన మన జన హృదయనేత వైఎస్ జగనన్న గారి ఆశయాలకు,లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగిన ఓ పెద్దమనిషిగా వాటన్నింటికి హాజరు అవుతూ రాష్ట్ర వ్యాప్తంగా వున్న వైస్సార్సీపీ పార్టీ నాయకులతో,కార్యకర్తలతో మంచి సంబందాలు కలిగి వుంటూ,వారందరితో తలలో నాలుకలాగా మెలుగుతూ వారి సాధక,బాధకాల గురించి ఆరా తీస్తూ వారందరికీ కూడా ఎనలేని భరోసా ఇవ్వడమే కాదు,తనదైన ఉన్నత వ్యక్తిత్వంతో ఈ రాష్ట్ర ప్రజలందరి ఆధారాభిమానాలను విశేషంగా పొందుతూ రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో మన వైఎస్ జగనన్న గారి ఆశీస్సులతో వైస్సార్సీపీ పార్టీకి పూర్వపు వైభవం తీసుకొచ్చే దిశగా విశేష కృషి సల్పుతూ,ఆరు నూరైన మళ్ళీ వైస్సార్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మరోసారి మన వైఎస్ జగనన్న గారిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే ఏకైక లక్ష్యం,ఎజెండాతో అత్యంత అంకితభావం,దృఢచిత్తంతో పనిచేస్తున్న గౌరవనీయులు శ్రీ పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినం అయిన ఈ ప్రత్యేక సందర్బంగా ఆ సర్వేశ్వరుడు ఆయనకు ఆయురారోగ్యాలను,అనంత కరుణ,కృప,కటాక్ష్యాలను ప్రసరింపచేయాలని,అంతేకాదు రాబోయే కాలంలో రాజకీయ రంగంలో ఆయన గారు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఓ వైస్సార్సీపీ పార్టీ నాయకుడిగా నేను మనసా,వాచ,కర్మణ కోరుకుంటున్నాను!
- బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల, నంద్యాల జిల్లా! #ysr
జానకి అనుకోలేదు రాముడు పతి కాగలడని ఆనాడు!క్యాప్షన్ : ఏ వివాహ బంధం అయిన నిండు నూరేళ్లు వర్ధిల్లాలంటే మాత్రం పట్టువిడుపు ధోరణి కంటే కూడా పరస్పర సహకారం ఎంతో అత్యవసరం!నేడు మా 25 వ పెళ్లిరోజు ( 11- 10 - 2025 #పెళ్లిరోజు )!
అయిగిరి నందిని నందితమేదిని!
విశ్వావినోదిని నందినుతే!
గిరివరవింధ్య శిరోధినివాసిని!
విష్ణువిలాసిని జిష్టునుతే!
భగవతి హే శితికంఠకుటుంబిని!
- మా హిందూ భక్త జనసందడికి ఆధ్యాత్మిక ఆ దుర్గామాత దేవి నవరాత్రులు 8 వ రోజు శుభ గురువారం! #శుభ శుక్రవారం
( 10 - 10 - 2025 ) ఈ రోజు నేను వ్రాసిన వ్యాసం ' రిజిస్ట్రేషన్లలో అవకతవకలు ప్రజల పాలిట శాపం ' ప్రజాసంచలనం దినపత్రికలో ప్రచురితమైంది.ఇందుకు సంబంధించి ప్రజలు తమ స్థిరాస్తులు వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ కాకుండా ఎల్లవేళలా అత్యంత జాగురతతో వ్యవహారించాలనే ఓక హెచ్చరికను ప్రజలకు తెలియపరుస్తూ నేను వ్రాసిన ఈ వ్యాసానికి తగు రీతిలో ప్రాధాన్యత ఇచ్చి తన సొంత దినపత్రిక 'ప్రజాసంచలనం'లో ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్ సిరిపిరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నయ్య గారికి ఇవే నా ఆత్మీయ పూర్వక కృతజ్ఞతలు!
- మధుసూదనరెడ్డి బుగ్గన,బేతంచెర్ల! #న్యాయం
#💐నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు🎊 ఓక మంచి స్ఫూర్తిదాయకమైన, యావత్ దేశం మెచ్చిన సుపరిపాలకుడు మోదీజీ కి గౌరవ,అభిమాన,ఆత్మీయపూర్వక 75వ జన్మదిన శుభాకాంక్షలు! ( 17 - 9 - 2025)!
లేదా
భారతదేశాన్ని తన అసాధారణ నాయకత్వ పటిమతో ఓక తిరుగులేని,ఎదురులేని దేశంగా తీర్చిదిద్దిన గొప్ప ఘనత మన ప్రియతమ ప్రధాని మోదీజీ ది!
తన అద్భుతమైన నాయకత్వ పటిమతో,మచ్చలేని వ్యక్తిత్వంతో భారతదేశాన్ని అన్ని రంగాలలో ఓక బలమైన శక్తిగా తీర్చిదిద్దిడంలో,ఓక అసాధారణ,శత్రు దుర్బెద శక్తిగా మలచడంలో నూటికి నూరుపాళ్ళు విజయం సాధించారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ముఖ్యంగా ఆయన జన్మదినం అయిన ఈ సెప్టెంబర్ 17 ను పురస్కరించుకొని ఒక్కసారి మన మన ప్రధాని మోదీజీ గొప్పతనాన్ని,ఆయన నాయకత్వ లక్షణాలను,ఆయన ఎదిగిన తీరుతెన్నులను అశేష భారతదేశ ప్రజానీకం అయిన మనమందరం ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై వుంది.అదేవిధంగా ఓక సాధారణ టీ అమ్ముకునే దుకాణం వారి ఇంట 1950 వాద్ నగర్, మెహసానా ( గుజరాత్ ) లో జన్మించారు మన మోదీ జీ గారు.ఆయన తన చిన్ననాటి రోజుల్లో వాళ్ళ నాన్న అమ్మే టీ దుకాణానికి సహాయం చేస్తూ,చేదోడు, వాదోడిగా వున్న మోదీ ఆ తరువాత తానే స్వయంగా ఓక టీ దుకాణాన్ని నెలకొల్పాడు.అయితే 8 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చి ఆ సంస్థలో చేరారు.ఆ సంస్థలో అంచె లంచెలుగా ఎదుగుతూ 1985లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోని ఆ పార్టీ లో చేరారు.ఇక అక్కడి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మోదీజీ తనకున్న వాక్ చాతుర్యం,నాయకత్వ లక్షణాలతో గుజరాత్ రాష్ట్రానికి ఏకంగా బీజేపీ పార్టీ తరపున రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఇక ఆ తరువాత ఆయన రాజకీయ జీవితం ఉప్పందుకుంది,1995 లో ఏకంగా ఆయన బీజేపీ జాతీయ సంస్థ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఓక విధంగా చెప్పాలంటే ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే 1995 తరువాత కాలంలో గుజరాత్ రాష్ట్రం లోని ఓక స్థానానికి శాసన సభ్యునిగా గెలిచి ఏకంగా తన ప్రతిభాసామర్త్యాలతో,ఆ రాష్ట్ర ప్రజల విశేష ఆదరణతో గుజరాత్ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.అలా గుజరాత్ రాష్ట్రాన్ని దాదాపు (2001- 14) 14 సంవత్సరాలు అత్యంత అప్రతిహాసంగా, సమర్థవంతంగా,దిగ్విజయంగా పరిపాలన సాగించారు.ఇక ఆ తరువాత ఎవరు ఊహించని విధంగా 2014 లో ఎంపీగా ఓక లోకసభ సీటును గెలుచుకొని ఏకంగా మన భారతదేశ ప్రధానిగా ఎన్నికయ్యారు.దీంతో 1984 తరువాత భారతీయ జనతా పార్టీకి లోకసభ లో అత్యధిక మెజారిటీ తెచ్చిన ఘనతను, గొప్ప చరిత్రను మన ప్రియతమ ప్రధాని మోదీ మూటగట్టుకున్నాడు, తన పేర సువర్ణాక్షరాలతో లీఖించుకున్నాడు.ఆయన ఈ విధంగా అత్యంత విజయవంతంగా మూడో మారు సైతం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు అంటే యావత్ ఈ దేశ ప్రజానీకం ఆయన నాయకత్వంపై అంచె లంచెల నమ్మకం ఉంచడమే.అలాగే కోట్లాదిమంది భారతదేశ ప్రజానీకం తన మీద పెట్టుకున్న ఆశలను ఏ మాత్రం వమ్ము చేయకుండా భారతదేశాన్ని అన్ని రంగాలలో ఓక బలియమైన శక్తిగా తీర్చిదిద్దడం లో మన ప్రియతమ ప్రధాని చూపిన దృఢదీక్ష,చూపిన ధైర్య సాహసాలు,తెగువ,ఓర్పు,సహన శక్తి నభుతో నాభవిష్యత్ అని చెప్పవచ్చు.ముఖ్యంగా గత పార్టీ ల మాదిరి అరకొర మెజారిటీ తెచ్చుకొని ఇతర చిన్న చితక పార్టీ ల కనుసన్నలతో పాలన సాగించే దౌర్భాగ్యానికి తెరదించుతూ తమ బీజేపీ పార్టీ సాధించిన అఖండ మెజారిటీ తో చాలా స్వేచ్ఛగా, బందుప్రీతికి,అవినీతికి ఆమడ దూరంలో వుంటూ ఓక జనరంజక పాలనను భారతదేశ ప్రజానీకానికి సాక్షాత్కరింప చేస్తూ దేశానికి పాలకుడు అంటే ఇలా ఉండాలి అనేలా ఓక ఆదర్శ పాలనకు నడుము బిగించి ఆశేష భారతదేశ ప్రజల అదరాభిమానాలకు పాత్రుడు కావడమే కాదు,యావత్ ప్రపంచం మన దేశం వైపు చూసేలా తన పరిపాలన సామర్త్యాలను చాలా గొప్పగా,అన్ని దేశాల నాయకులతో శెభాష్ అనిపించుకునేలా సాగించాడు మన ప్రియతమ ప్రధాని మోదీజీ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏదిఏమైన మన దేశ శాంతి,సౌభాగ్యాల కోసం, సామాన్య ప్రజల యోగ, క్షేమాలు,అభివృద్ధి కోసం మనసా,వాచ,కర్మణ ఆవిరళ కృషి సలుపుతున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీజీ గారికి యావత్ భారతదేశం, ఈ దేశ ప్రజలు ఎంతో రుణపడి వున్నారు అనే మాట అక్షర సత్యం.ఏమైనా ఆయన 75 వ జన్మదినం అయిన ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ ప్రధానిమంత్రివర్యులు అయిన మన నరేంద్ర మోదీజీ గారికి భారతదేశ ప్రజలం అయిన మనమందరం ఆయనకు ప్రేమ,అభిమాన, గౌరవ,ఆత్మీయతానురాగాలతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజెయాల్సిన గురుతర బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఎంతైనా ఉంది.అలాగే ఆ సర్వేశ్వరుని అనంత కరుణ,కృప,కటాక్షలతో ఇలాగే దేశానికి మంచి స్ఫూర్తిదాయకమైన సేవలు చేస్తూ ఆయన నిండు నూరేళ్లు,ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా,హృదయపూర్వకంగా కోరుకుందాం.జయ జయహో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీజీ గారు! మేరా హిందూస్తాన్ మహాన్!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#😎మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు🧁 మనస్సున్న మహారాజు,తెలుగు సినిమా ప్రేక్షకుల ఆరాధ్య నటుడు,పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవిగారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు!
లేదా
తెలుగు సినిమా పరిశ్రమకు ఓక ఆశాదీపం వంటి మెగాస్టార్ చిరంజీవిగారి 70వ జన్మదినం నేడు!
ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి వుండే మహోన్నత వ్యక్తిత్వం,సౌమ్యుడు,అజాత శత్రువు,చీమకు కూడా హాని తలపెట్టని నైజం,అలనాటి నటులు దివంగత ఎన్టీఆర్,ఏ.ఎన్.ఆర్ ల తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ ను,తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని విశేషంగా చురగొన్న అరుదైన నటుడు,అన్నదమ్ముల మధ్య ఎలాంటి ఆత్మీయత,ప్రేమానురాగాలు, ఋణానుబంధాలు వెల్లివిరియాలో,మనం కలిగి ఉండాలో ఓక ఆదర్శ అన్నయ్య గా ఆచరించి మరీ పలువురికి స్ఫూర్తిగా నిలిచినా ఓక ప్రేమ,కరుణామూర్తి మన మెగాస్టార్.తెలుగు సినిమా పరిశ్రమ శ్రేయస్సును,అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులలో సైతం మన మెగాస్టార్ చిరంజీవి (చిరు ) మొదటి వరుసలో వుంటారు,అందుకే ఆయనను తెలుగు పరిశ్రమకు ఓక పెద్దాయన వంటి వారు అని చెబుతూ వుంటారు.క్రమశిక్షణకు పెట్టింది పేరు,స్వయంకృషికి పర్యాయపదం,ఎవరి అండ దండాలు లేకుండా తన స్వశక్తితో ఓక ఎవరెస్ట్ శిఖరం అంతా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఓక మేరుగరణదీరుడు,అవిరళ,నిత్య కృషివలుడు మన మెగాస్టార్ చిరు.ఆయన రాజకీయాలలో వున్న, సినిమా రంగంలో వున్న నైతిక విలువలకు ఓక పెద్ద పీట వేసే ఓక గొప్ప మానవతామూర్తి.అంతేకాదు 'ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న' , ' వంద మందికి నువ్వు సహాయం చేయలేకపోవొచ్చు,కనీసం ఒక్కరికైనా సహాయపడు' అన్న నీతి సూత్రానికి మనసా,వాచ, కర్మణ,కట్టుబడి తన స్వహాస్తాలతో బ్లాడ్ బ్యాంకును స్థాపించి ఎందరో ప్రాణాపాయ స్థితిలో ఉండి బ్లడ్ అవసరం వున్న వారికి బ్లడ్ సరఫరా చేసేలా తన సంస్థను అనేక ప్రాంతాలలో విస్తరించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెడుతున్న ప్రాణదాత మన చిరు గారు!ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ విషయం లో చూపే ఆత్మీయత,వినయ విదేయతలు,గౌరవ మర్యాదలు నభూతో న భవిష్యత్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఏదిఏమైన మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం అయిన ఈ ప్రత్యేక సందర్బంగా మంచికి, మానవత్వానికి మారు పేరు అయిన ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రేక్షకుల హృదయాలలో మరింతంగా చెరగని ముద్ర వేయాలని, తెలుగు సినిమా పరిశ్రమ ఆశాదీపం అయిన ఈ చిరు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లెలా ఆ సర్వేశ్వరుడు,ఆ దేవదేవుడు ఆయనపై అనంత కరుణ,కృప,కటాక్షాలు ప్రసరింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.ఏమైనా మెగాస్టార్ చిరంజీవి గారు ఓక రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో సైతం ఓక జెంటిల్ మ్యాన్ గా,ఓ మానవతామూర్తిగా,అన్నింటికి మించి వివాదాలకు దూరంగా వుంటూ అటు తన సినిమా జీవితంలో,ఇటు రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరికితో కూడా మంచి ఆరోగ్యకరమైన సంబందాలు నెలకొల్పుకొని,మెరుగుపరచుకొని ఓ అజాత శత్రువుగా అందరిచేత శెభాష్ అనిపించుకోవడమే కాదు,సమాజసేవలో సైతం తన వంతు పాత్ర పోషిస్తూ అటు తనకున్న అశేష మెగా ప్యాన్స్ కు స్ఫూర్తిదాయకంగా,ఆదర్శంగా నిలువడమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో తనకంటూ ఓక ప్రత్యేక స్థానం సంపాదించుకొని నిజంగా తన పేరుకు తగ్గట్లు చిరంజీవిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలతో వర్దిల్లుతూ,అందరివాడిగా ప్రతి ఒక్కరి మనస్సుల్లో చెరగనిముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనమంతా ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం!జయ జయహో బర్త్డేహీరో మెగాస్టార్ చిరంజీవి గారు!హ్యాట్సాఫ్ టూ మెగాస్టార్!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా!