రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణుల కమిటీ నివేదికపై చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అలాగే, ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్కు ఆమోదం తెలపనుంది. పలు నీటిపారుదల ప్రాజెక్టులపై కూడా కేబినెట్ చర్చించనుంది #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
