#🗞️అక్టోబర్ 10th అప్‌డేట్స్💬 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
*విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOA) లకు ప్రభుత్వం తీపి కబురు*
VOAల స్థిరమైన 3 సంవత్సరాల పదవీ కాలం నిబంధనను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మెమో జారీ చేసింది.
▪️ఇకపై, గ్రామ సంస్థలకే VOAను ఎంపిక చేయడం లేదా తొలగించడం చేసే అధికారం ఉంటుంది.
▪️పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.
▪️ఎంపిక/తొలగింపు జరిగితే, మండల సమాఖ్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆ తీర్మానాన్ని DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు అప్‌లోడ్ చేయాలి.
▪️ఆర్థిక అక్రమాలు జరిగితే, PD, DRDA అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అధికారాన్ని కలిగి ఉంటారు.
ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయి.
