#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*27. ఓం ధ్యాన ప్రదాయై నమః*
మోక్షాన్ని పొందాలి అనుకొన్నప్పుడు నిరంతరం ధ్యానస్థితిలో ఉండాలి. శ్రీమద్భగవద్గీతలోని 6 వ అధ్యాయం ఆత్మసంయమ యోగం. దీనినే ధ్యానయోగం అని కూడా అంటారు. ధ్యానం అంటే ఏమిటి?
ఉపాసనా ధ్యానం, నిదిధ్యాసన - రెండు రకాలు. ఉపాసనా ధ్యానం అంటే ఏమిటి? ఒక దైవాన్ని సాకారంగా కానీ నిరాకారంగా కానీ నిరంతరం ఆరాధిస్తూ, ఆ దైవానికి దగ్గరగా ఉంటూ, అసుర భావాలను, అరిషడ్వర్గమును (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) పోగొట్టుకొంటూ, దైవ లక్షణాలను పెంచుకొంటూ ఉంటే మనోమాలిన్యాలు తొలగుతాయి. ఏకాగ్రత ఏర్పడి జ్ఞానబోధను శ్రద్ధగా శ్రవణం చేయటానికి అర్హత వస్తుంది. ఇది ఉపాసన.
అప్పుడు తత్త్వం దర్శించిన జ్ఞాని చెంతకు చేరి, వారు చేసే బోధను శ్రవణం చేసి, శ్రవణం చేసిన దానిని మననం చేస్తూ సంశయాలను పోగొట్టుకోవాలి. తరువాత నిదిధ్యాసన చేయాలి.
ఉపాసన - శ్రవణం - మననం - నిది ధ్యాసన.
నిదిధ్యాసనలో మొదటిది - ప్రతి కర్మలోను ‘నైవ కించిత్ కరోమీతి’ అన్నట్లుగా చూస్తూ, వింటూ, స్పృశిస్తూ, ఆఘ్రాణిస్తూ, భుజిస్తూ, త్యజిస్తూ, గ్రహిస్తూ, కనులు తెరుస్తూ, మూస్తూ, ఇంద్రియాలు వాటి పని అవి చేసుకొంటున్నాయి, నేనేమీ చేయటం లేదు, నాకు ఎట్టి సంబంధం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అన్న భావన గట్టిపరుచుకోవాలి. దానికి తగినట్లు మాట, నడవడిక మార్చుకోవాలి. అదే సాధన.
రెండవది - కూర్చుని చేసే ధ్యానం. ఇదే సమాధి అభ్యాసం లేదా ఆత్మ ధ్యానం. ఒక ప్రత్యేక స్థలంలో, నిర్ణీత సమయంలో ప్రశాంతంగా కూర్చుని ఆత్మగా స్వీయ లక్షణాలు గుర్తు చేసుకుంటూ, ధ్యానించుకొంటూ ఉండటం.
అహమాత్మా - నిరాకారోహం, నిశ్చలోహం, నిర్వికారోహం, నిష్క్రియోహం, సనాతనోహం, సత్యోహం, నిత్యోహం, చిదహం, ఆనందోహం, కూటస్థోహం - అని ఆత్మగా తన లక్షణాలను స్మరించుకుంటూ ఉండటం ఆత్మధ్యానం అవుతుంది.
ఇట్టి మహత్తర ధ్యానం నాకు అందిస్తున్న గీతామాతకు కృతజ్ఞతతో కైమోడ్పు చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
