#🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#🛕🎎శ్రీ లలితా త్రిపుర సుందరి సుందరీ దేవి 🔱🌺
#శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం 😍🙏🙏
#🙏హ్యాపీ నవరాత్రి🌸
#🏵️శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి🕉️
_*🚩 నేడు ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం.🚩*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత మరియు రాజరాజేశ్వరి )రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు.
త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.
అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో
ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.
*స్థూల (భౌతికం):* ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది.
*సూక్ష్మ (సున్నితం):* మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.
*పర (మహోన్నతం):* అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించ బడుతుంది.
కదంబవృక్షములు (కమిడి చెట్లు) వనముందు నివసించునదీ , ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది , పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ,దేవతా

