
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
@gudapati2430
ఐ లవ్ షేర్ చాట్
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*26. ఓం మోక్ష ప్రదాయై నమః*
సమస్త దుఃఖాలనుండి విముక్తి పొందటమే మోక్షం. జన్మ పరంపర నుండి విముక్తి కావటమే మోక్షం. ఆ ముక్తిబోధ శ్రీమద్భగవద్గీత.
ఓం త్య్రంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనమ్ ।
ఉర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్ ॥
-మృత్యుంజయ మంత్రము, యజుర్వేదము
సుగంధయుక్తుడైన, సమృద్ధికరుడైన ఈశ్వరుని మేము సేవిస్తాము. అతడు పండిన దోసపండు తీగనుండి దోసపండు వేరుపడినట్లు మృత్యుబంధం నుండి మమ్ములను వేరు చేస్తాడు. అమృతత్త్వం నుండి మాత్రము వేరు చేయకుండును గాక!
దోసకాయ అప్పటి వరకు తీగతో ఉండి, పండినప్పుడు దానంతట అదే తీగనుండి విడిపోతుంది. పాదు దగ్గరే ఉంటుంది కాని పాదుకి, దానికి సంబంధం ఉండదు. మనసుని సమంగా ఉంచుకొన్నప్పుడు, నాతో సహా అంతా బహ్మమే అని సమంగా చూసినప్పుడు మనమూ అలాగే ఉంటాము.
సమదర్శినః, సమత్వం యోగముచ్యతే, సమే కృత్వా - ఇలా సమత్వం అనే మాట భగవద్గీతలో చాల సార్లు చెప్పారు. సమం = మారకపోవటం, భేదాలు లేకపోవటం, హెచ్చుతగ్గులు లేకపోవటం. సమత్వం అంటే ఏ భేదాలు లేకుండా, దోషాలు లేకుండా, మార్పు లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా ఉండటం. మనస్సు సమంగా లేకపోతే అది బంధం, సమంగా ఉంటే అది మోక్షం. మనస్సు అలజడిగా ఉంటే అది బంధం నిశ్చలమయితే అది మోక్షం. మనస్సు అనేకదృష్టితో ఉంటే అది బంధం ఏకంగా, ఏకదృష్టితో ఉంటే అది మోక్షం. ఏకదృష్టితో ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అనేకదృష్టితో ఉంటే అలజడిగా ఉంటుంది.
ఇహైవ తైర్జితః సర్గో యేషాం
సామ్యే స్థితం మనః ।
నిర్దోషం హి సమం బ్రహ్మ
తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ॥ ౫.౧౯
పరమాత్మ (బ్రహ్మ) దోషం లేనిది, సమమైనది. ఎవరి మనస్సు సమభావంలో స్థిరంగా ఉంటుందో, అట్టివారు బ్రహ్మములో ఉన్నవారై ఈ జన్మలోనే సంసారాన్ని జయిస్తారు. నీటితో నీరే కలుస్తుంది. నూనె కలవదు. అట్లాగే దోషం లేనివారే, సమదృష్టి గలవారే నిర్దోషమైన, సమత్వం గల పరమాత్మను పొందగలరు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలోనే ఉంటారు. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’. ఆత్మ కన్న భిన్నమైనది ఏదీ లేనే లేదు. ఇలా స్థిరపరుచుకొన్నవారు మరణించాక కాదు, ఈ జన్మలోనే సర్గమును అంటే సంసారాన్ని, జనన మరణాలను జయిస్తారు. అదే మోక్షం.
అర్జున విషాద యోగంతో మొదలవుతుంది భగవద్గీత. ఆ విషాదమంతా తీరిపోగా, చివరికి మోక్షసన్న్యాస యోగంతో ముగుస్తుంది. మోక్షమే చివరి మెట్టు. విషాదం జీవ లక్షణం. ఆనందం మోక్షరూపమైన పరమాత్మ లక్షణం.
ఈ తీరున మానసిక సమస్థితి కలిగిస్తూ, జన్మ పరంపర నుండి నాకు విముక్తి ప్రసాదించే గీతామాతకు భక్తి ప్రపత్తులతో అంజలి ఘటిస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*25. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః*
గతిర్భర్తా ప్రభుః సాక్షీ
నివాసః శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం
నిధానం బీజమవ్యయమ్ ॥ 9.18
సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యం నేనే. స్వామి, సాక్షి, నివాసం, ఆశ్రయం మరియు స్నేహితుడను నేనే. సృష్టి స్థితి లయకర్తను నేనే. శాశ్వతస్థానం మరియు సనాతన బీజం నేనే అయి ఉన్నాను అని భగవాన్ ఉవాచ.
అట్టి పరమాత్మ యొక్క త్రివిధ వ్యక్త రూపాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ముల్లోకాలకు పాలకులు. సృష్టి స్థితి లయ కారకులు. ఆవిర్భావము, వికాసము, వినాశము అనే మూడు ధర్మాల ప్రకారమే జగత్తు సాగుతున్నది. ఈ ధర్మాలకు అధిపతులు త్రిమూర్తులు.
మరి గీతామాత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఎలా అవుతుంది? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి అంతర్లీనంగా జ్ఞానం ఉంటుంది. అయితే అది అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది. నాలో ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపి నేనెవరో నాకు తెలియజేస్తుంది గీతామాత. అదే అసలైన సృష్టి. శాశ్వతమైన, సత్యమైన బ్రహ్మజ్ఞానాన్ని నాకు అందించేటప్పుడు గీతామాత బ్రహ్మ స్వరూపమే.
నాలో మేల్కొన్న జ్ఞానం దినదినాభివృద్ధి చెంది, ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కటానికి అవసరమైన జ్ఞానసంపదను నాకు ఇస్తున్నప్పుడు ఆ తల్లి విష్ణు స్వరూపమే.
భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ఏర్పరచుకొని, ఆ జ్ఞానం వలన పునర్జన్మ లేని శాశ్వతమైన పరమాత్మ సాయుజ్యాన్ని పొందే చివరిమెట్టు ఎక్కించి తనలో లయం చేసుకొనే సమయంలో ఆ తల్లి మహేశ్వర స్వరూపమే.
గీతాజ్ఞాన ముపాశ్రిత్య
త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్ ।
గీతాజ్ఞానం ప్రకారమే ముల్లోకాలను పాలిస్తున్నాను అంటున్నారు పరమాత్మ ఈ విధంగా త్రిమూర్తి స్వరూపమైన గీతామాతకు పూజ్యభావంతో ప్రణమిల్లుతున్నాను.
జై గురుదేవ్ 🙏
#శ్రీ శ్రీ దుర్గా అమ్మవారు కి జై #దేవి నరాత్రులు#దేవి అలంకరణలో శ్రీ దుర్గా అమ్మవారు #దసరా నవరాత్రులు
#🔱 శ్రీ దుర్గా దేవి 🕉 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #🙏హ్యాపీ నవరాత్రి🌸
🕉️శ్రీ గురుభ్యోనమః🙏
మంగళవారం, సెప్టంబర్ 30, 2025*
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
దక్షిణాయనం - శరదృతువు*
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*
తిథి : *అష్టమి* మ1.25 వరకు
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *పూర్వాషాఢ* తె4.53 వరకు
యోగం : *శోభన* రా11.09 వరకు
కరణం : *బవ* మ1.25 వరకు
తదుపరి *బాలువ* రా1.55 వరకు
వర్జ్యం : *మ1.29 - 3.11*
దుర్ముహూర్తము : *ఉ8.16 - 9.03
మరల *రా10.38 - 11.26*
అమృతకాలం : *రా11.45 - 1.27*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: *కన్య* ||
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.53*
సూర్యాస్తమయం: 5.49*
దుర్గాష్టమి*
దుర్గాష్టమి శుభాకాంక్షలతో*
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏
#శ్రీ శ్రీ దుర్గా అమ్మవారు కి జై #దేవి నరాత్రులు#దేవి అలంకరణలో శ్రీ దుర్గా అమ్మవారు #దసరా నవరాత్రులు
#🔱 శ్రీ దుర్గా దేవి 🕉 #శరన్నవరాత్రులు 🔱 దేవి శ్రీ దుర్గాదేవి 🔱శ్రీ దుర్గా అష్టోత్తర శత నామావళి 🙏 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #శ్రీ నవ దుర్గా దేవి
9వ రోజు దుర్గామాత
------------------------------------ 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️
------------------------------------- మంగళవారం, సెప్టంబర్ 30, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి: అష్టమి:మ1.25వరకు
వారం: మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం: పూర్వాషాఢ: తె4.53 వరకు
యోగం:శోభన:రా11.09వరకు
కరణం: బవ;మ1.25 వరకు తదుపరిబాలువరా1.55వరకు
వర్జ్యం: మ1.29 - 3.11
దుర్ముహూర్తము:ఉ8.16-9.03
మరల: రా10.38 - 11.26
అమృతకాలం:రా11.45-1.27
రాహుకాలం: మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: కన్య చంద్రరాశి: ధనుస్సు సూర్యోదయం: 5.53 సూర్యాస్తమయం: 5.49 ------------------------------------- *👉 దుర్గాష్టమి* *--------------------------- దుర్గ
#🔱దుర్గ దేవి🙏 #🔱దుర్గ దేవి🙏 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏
#🎉నవరాత్రి స్టేటస్🎊 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸
------------------------------------ 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️
------------------------------------- మంగళవారం, సెప్టంబర్ 30, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి: అష్టమి:మ1.25వరకు
వారం: మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం: పూర్వాషాఢ: తె4.53 వరకు
యోగం:శోభన:రా11.09వరకు
కరణం: బవ;మ1.25 వరకు తదుపరిబాలువరా1.55వరకు
వర్జ్యం: మ1.29 - 3.11
దుర్ముహూర్తము:ఉ8.16-9.03
మరల: రా10.38 - 11.26
అమృతకాలం:రా11.45-1.27
రాహుకాలం: మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: కన్య చంద్రరాశి: ధనుస్సు సూర్యోదయం: 5.53 సూర్యాస్తమయం: 5.49 ------------------------------------- *👉 దుర్గాష్టమి* *--------------------------- దుర్గ
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
**ఓం శ్రీ గురుభ్యోనమః*🙏
*భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం*!
*ఆచరణాత్మక ఆధ్యాత్మిక ప్రభోధక్షేత్రం*!
జయతి పరాశరసూనుః సత్యవతీ హృదయానందనో వ్యాసః
యస్యాస్య కమల గలితం భారతమమృతం జగత్ పిబతి ॥
ఎవని ముఖపద్మం నుండి జాలువారిన సారస్వతామృతాన్ని జగత్తు ఆస్వాదిస్తున్నదో, అట్టి సత్యవతీ హృదయానందకరుడైన పరాశర తనయునికి జయమగు గాక!
ధర్మం శాశ్వతమైనది,
సమస్త విశ్వాన్నీ ధరించేది,ఆధారమైనది. *‘ధర్మో రక్షతి రక్షితః’* అన్నారు. ప్రపంచాన్ని నడిపేది, రక్షించేది ధర్మమే *‘ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’* - భగవంతుడు నిర్దేశించినదే నిజమైన ధర్మం. సాక్షాత్తు పరమాత్మ నుండి వెలువడిన వేదాలే ధర్మానికి మూలం. వేదార్థమైన జ్ఞానాన్ని, ధర్మాన్ని లోకాలలో ప్రతిష్ఠింప చేయటానికి పరమాత్మ వ్యాసావతారులై వేద విజ్ఞానాన్ని మానవాళికి అందచేశారు. ఈ ధర్మాన్నీ యుగాలకు, కాలానికి కాదు, ఆయా కాలాలలో ఉన్న మానవుని స్థితిని అనుసరించి వారికి తగ్గ ధర్మం నిర్దేశించబడింది.
కలి అంటే చీకటి. ఈ కలి యుగంలో అజ్ఞానంతో మనిషి లోభంలో కూరుకు పోయి పతనమవుతాడని, లోభం నుండి బయట పడటానికి ధర్మాచరణే ఉత్తమ మార్గమని తెలియ చేశారు.
మనకు పంచమవేదమైన మహాభారతం లో వ్యాస భగవానుల వారుల అన్ని ధర్మములను అందించారు.
మనిషిని తరింపచేసే చతుర్విధ పురుషార్థాలను తెలియచేసి, అర్థ, కామములు రెండూ ధర్మాన్ని అనుసరించి ఉన్నట్లయితే మోక్షాన్ని తేలికగా చేరతారని తెలియచేసారు.
*‘సత్య ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం’*
సత్య ధర్మాలను ఆచరించు వారిని మృత్యువు కూడా భయ పెట్టజాలదు.
మనపై ఇంతటి అవ్యాజమైన ప్రేమ,
కరుణ తో అనేక ధర్మాలను, జ్ఞానాన్ని అందించిన
*"భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి సనాతన ధర్మక్షేత్రము" యొక్క ముఖ్యమైన ఉద్దేశం.*
మనిషికి తనలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవానికి వచ్చేలా చేసి ప్రతిక్షణము ప్రతి పనిలోనూ దివ్య ప్రేమ అభివ్యక్తం అయ్యేలా మనిషిని మార్చటమే!
మన రాబోయే తరాలకు ఈ అమూల్యమైన సంపదను అందించటమే వ్యాస ధర్మక్షేత్ర లక్ష్యం.
మనకు అందిన ఈ లక్ష్యం, భగవంతుని సేవ
అనే అపూర్వ అవకాశంలో భాగస్వాములమౌదాము.
*ఋషి ఋణం నుండి మనం విముక్తలం అవుతూ అందరికి కూడా తెలియ చేద్దాము*
తండ్రి🙏వ్యాస దేవా🙏 కృతజ్ఞతలు
జై గురుదేవ్🙏
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*23. ఓం వ్యాస సంగ్రథితాయై నమః*
కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో యుద్ధ సన్నద్ధుడైన అర్జునుడు కౌరవసేనలో బంధు, గురు, మిత్రులను చూసి, వారినందరినీ వధించి పాపం మూటగట్టుకోలేనని అస్త్ర సన్న్యాసం చేశాడు. అప్పుడు పార్థ సారధియైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి విషాదం పోగొట్టి, కర్తవ్యం వైపు మళ్లించాడు.
అర్జునుడి సందేహం - ప్రశ్న - శ్రీకృష్ణుని ప్రత్యుత్తరం. ఈ విధంగా గీతోపదేశం సాగింది. ప్రశ్నోత్తర రూపమైన సంవాదాన్ని ‘గీత’ అంటారు. ‘భగవంతం ప్రతి భగవతా గీతా’ అని నిర్వచనం. అనగా భగవత్ తత్త్వం గూర్చి భగవంతుడే గానం చేసినది గీత.
ఆ మహా సందర్భంలో గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా విన్నవారు నలుగురు. 1. ఆర్జునుడు, 2. అర్జునుడి రథం టెక్కెంపై ఉన్న హనుమంతుడు, 3. వ్యాసమహర్షి, 4. వ్యాసమహర్షి అనుగ్రహంతో సంజయుడు.
గీతోపదేశాన్ని గ్రహించి కర్తవ్యపరాయణుడైన వాడు అర్జునుడే అయినా ఆ ఉపదేశం సమస్త మానవాళికీ అవసరమైనదే. అక్కడ అర్జునుడికి చేసిన గీతోపదేశాన్ని గ్రహించి, గ్రంథబద్ధం చేసి లోకానికి అందించిన వారు శ్రీ వ్యాసమహర్షి. వారి అమేయప్రజ్ఞ వల్లనే ఆ 701 శ్లోకాలు శ్రీమద్భగవద్గీతగా కూర్చబడిరది. సమస్త మానవాళికి మేలు కలిగింది.
వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్
ఏతత్ గుహ్యతమం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్
సాక్షాత్ కథయతః స్వయమ్ ॥ 18.75
శ్రీ వ్యాసమహర్షి అనుగ్రహం చేత, నేను ఈ రహస్యమైన, శ్రేష్ఠమైన, యోగమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి తెలుసుకొన్నాను అని సంజయుడు చెపుతున్నాడు.
ఈ విధంగా వేదవ్యాస మహర్షిచే కూర్చబడిన శ్రీమద్భగవద్గీతకు కృతజ్ఞతతో కైమోడ్పు చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి*🌹
*22. ఓం మహా మహిమాన్వితాయై నమః*
గీతామాత అందించే పరమ పవిత్రమైన జ్ఞానం మామూలు మనిషిని మహనీయునిగా మార్చగల గొప్ప శక్తి. మహాపాపిని మహాత్మునిగా మార్చగలది. అల్పుడిని అనంతునిగా మార్చే శక్తి. ఆనందం ప్రసాదించే శక్తి.
గీతను ఒక్కసారి చదివినా ఆ వ్యక్తి శుద్ధమైన స్ఫటికం వలె నిర్మలంగా ప్రకాశిస్తాడని, గీతాశాస్త్రాన్ని నిరంతరం పఠించేవారు సాక్షాత్తు దేవస్వరూపులే అవుతారని, ఎవడు అంత్యకాలంలో గీతాశ్లోకాలను శ్రవణం చేస్తాడో అతడు మహాపాపి అయినా మోక్షభాగ్యం పొందగలడని ‘వైష్ణవీయ తంత్రసారము’ చెపుతుంది.
శ్రీమద్భగవద్గీత దుఃఖించేవారిని దుఃఖరహితులుగా చేస్తుంది. దేహభావననుండి ఆత్మభావనలోకి నడిపిస్తుంది. అసత్తు నుండి సత్యానికి దారి చూపుతుంది. మానవత్వం నుండి దివ్యత్వానికి నడిపిస్తుంది. మరణం నుండి అమృతత్వానికి చేర్చుతుంది. అశాశ్వతం నుండి శాశ్వతత్వానికి చేర్చుతుంది.
ఇదే గీతామహిమ. ఇది వాచా వేదాంతం కాదు. ఆచరణ వేదం. పరమ నాస్తికులైనా దానిని ఆచరించి, ఉత్తమ మానవులుగా జీవించగలరు.
అట్టి మహామహిమ గల గీతామాతకు మనసారా వందనం చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
#జై బాలయ్య బాబు, తగ్గేదే లే #balayya fire
#cbn
ఒంటరి వాళ్ళం కాదు.. ప్రజా బలం ఉన్నవాళ్ళం - నారా బ్రాహ్మణి | Nara Brahmani | I Am With Babu |
#IAmWithBabu
#WeWillGiveitBack
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#SelfGoalByJagan
#NaraBhuvaneshwari
#NaraBrahmani
#BrahmaniNandamuri