#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
**ఓం శ్రీ గురుభ్యోనమః*🙏
*భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం*!
*ఆచరణాత్మక ఆధ్యాత్మిక ప్రభోధక్షేత్రం*!
జయతి పరాశరసూనుః సత్యవతీ హృదయానందనో వ్యాసః
యస్యాస్య కమల గలితం భారతమమృతం జగత్ పిబతి ॥
ఎవని ముఖపద్మం నుండి జాలువారిన సారస్వతామృతాన్ని జగత్తు ఆస్వాదిస్తున్నదో, అట్టి సత్యవతీ హృదయానందకరుడైన పరాశర తనయునికి జయమగు గాక!
ధర్మం శాశ్వతమైనది,
సమస్త విశ్వాన్నీ ధరించేది,ఆధారమైనది. *‘ధర్మో రక్షతి రక్షితః’* అన్నారు. ప్రపంచాన్ని నడిపేది, రక్షించేది ధర్మమే *‘ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’* - భగవంతుడు నిర్దేశించినదే నిజమైన ధర్మం. సాక్షాత్తు పరమాత్మ నుండి వెలువడిన వేదాలే ధర్మానికి మూలం. వేదార్థమైన జ్ఞానాన్ని, ధర్మాన్ని లోకాలలో ప్రతిష్ఠింప చేయటానికి పరమాత్మ వ్యాసావతారులై వేద విజ్ఞానాన్ని మానవాళికి అందచేశారు. ఈ ధర్మాన్నీ యుగాలకు, కాలానికి కాదు, ఆయా కాలాలలో ఉన్న మానవుని స్థితిని అనుసరించి వారికి తగ్గ ధర్మం నిర్దేశించబడింది.
కలి అంటే చీకటి. ఈ కలి యుగంలో అజ్ఞానంతో మనిషి లోభంలో కూరుకు పోయి పతనమవుతాడని, లోభం నుండి బయట పడటానికి ధర్మాచరణే ఉత్తమ మార్గమని తెలియ చేశారు.
మనకు పంచమవేదమైన మహాభారతం లో వ్యాస భగవానుల వారుల అన్ని ధర్మములను అందించారు.
మనిషిని తరింపచేసే చతుర్విధ పురుషార్థాలను తెలియచేసి, అర్థ, కామములు రెండూ ధర్మాన్ని అనుసరించి ఉన్నట్లయితే మోక్షాన్ని తేలికగా చేరతారని తెలియచేసారు.
*‘సత్య ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం’*
సత్య ధర్మాలను ఆచరించు వారిని మృత్యువు కూడా భయ పెట్టజాలదు.
మనపై ఇంతటి అవ్యాజమైన ప్రేమ,
కరుణ తో అనేక ధర్మాలను, జ్ఞానాన్ని అందించిన
*"భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి సనాతన ధర్మక్షేత్రము" యొక్క ముఖ్యమైన ఉద్దేశం.*
మనిషికి తనలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవానికి వచ్చేలా చేసి ప్రతిక్షణము ప్రతి పనిలోనూ దివ్య ప్రేమ అభివ్యక్తం అయ్యేలా మనిషిని మార్చటమే!
మన రాబోయే తరాలకు ఈ అమూల్యమైన సంపదను అందించటమే వ్యాస ధర్మక్షేత్ర లక్ష్యం.
మనకు అందిన ఈ లక్ష్యం, భగవంతుని సేవ
అనే అపూర్వ అవకాశంలో భాగస్వాములమౌదాము.
*ఋషి ఋణం నుండి మనం విముక్తలం అవుతూ అందరికి కూడా తెలియ చేద్దాము*
తండ్రి🙏వ్యాస దేవా🙏 కృతజ్ఞతలు
జై గురుదేవ్🙏
