#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి*🌹
*22. ఓం మహా మహిమాన్వితాయై నమః*
గీతామాత అందించే పరమ పవిత్రమైన జ్ఞానం మామూలు మనిషిని మహనీయునిగా మార్చగల గొప్ప శక్తి. మహాపాపిని మహాత్మునిగా మార్చగలది. అల్పుడిని అనంతునిగా మార్చే శక్తి. ఆనందం ప్రసాదించే శక్తి.
గీతను ఒక్కసారి చదివినా ఆ వ్యక్తి శుద్ధమైన స్ఫటికం వలె నిర్మలంగా ప్రకాశిస్తాడని, గీతాశాస్త్రాన్ని నిరంతరం పఠించేవారు సాక్షాత్తు దేవస్వరూపులే అవుతారని, ఎవడు అంత్యకాలంలో గీతాశ్లోకాలను శ్రవణం చేస్తాడో అతడు మహాపాపి అయినా మోక్షభాగ్యం పొందగలడని ‘వైష్ణవీయ తంత్రసారము’ చెపుతుంది.
శ్రీమద్భగవద్గీత దుఃఖించేవారిని దుఃఖరహితులుగా చేస్తుంది. దేహభావననుండి ఆత్మభావనలోకి నడిపిస్తుంది. అసత్తు నుండి సత్యానికి దారి చూపుతుంది. మానవత్వం నుండి దివ్యత్వానికి నడిపిస్తుంది. మరణం నుండి అమృతత్వానికి చేర్చుతుంది. అశాశ్వతం నుండి శాశ్వతత్వానికి చేర్చుతుంది.
ఇదే గీతామహిమ. ఇది వాచా వేదాంతం కాదు. ఆచరణ వేదం. పరమ నాస్తికులైనా దానిని ఆచరించి, ఉత్తమ మానవులుగా జీవించగలరు.
అట్టి మహామహిమ గల గీతామాతకు మనసారా వందనం చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
