ShareChat
click to see wallet page
#🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ *పత్రిక ప్రకటన* అమలాపురం పట్టణం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా. *తేదీ.19.11.2025.* *జిల్లాలో సంచలనం రేపిన అమలాపురం పట్టణం, ఐ-మైండ్స్ స్కూల్ విద్యార్థిని కిడ్నాప్ ఉదంతంలో ముద్దాయికి 14 రోజుల రిమాండ్ విధింపు.* వివరాల్లోకి వెళితే, ది.10.11.20250 వ తేదీన, స్కూల్ నుంచి వస్తున్న 10సం.ల వయస్సు గల బాలికను, వరసకు మావయ్య అయిన మట్టపర్తి దుర్గా నాగ సత్యమూర్తి @ చంటి అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చి, బాలికను కిడ్నాప్ చేసి, అటునుంచి ఆమెను కాకినాడ తీసుకెళ్లి, బాలిక క్షేమంగా తిరిగి రావాలి అంటే తను పంపిన UPI QR code scanner కి డబ్బులు పంపించాలని, తల్లిదండ్రులను బెదిరించి, డబ్బులు గుంజుకున్న ముద్దాయి. అనంతరం, బాలిక తండ్రి కముజు వెంకటరమణ పిర్యాదు మేరకు, అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేసిన అనంతరం, అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ గారి యొక్క స్వీయ పర్యవేక్షణలో, పట్టణ సి.ఐ వీరబాబు గారు, ఎస్సైలు టి.శ్రీనివాస్, జోషి లు మూడు టీంలుగా ఏర్పడి, కాకినాడ పరిసర ప్రాంతాలు, పి.గన్నవరం మండలం ముంగండ, పోతవరం, కారుపల్లి గ్రామాలలో రాత్రి సమయంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి, కేసు నమోదు చేసిన 11 గం.లలోనే, కిడ్నాప్ కాబడిన బాలిక ఆచూకీ గుర్తించి, బాలికను ఆమె తల్లిదండ్రులకు క్షేమంగా తిరిగి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. సదరు కేసులో బాలికను వదిలి పరారైన *పి.గన్నవరం మండలం, ముంగండ గ్రామానికి చెందిన ముద్దాయి మట్టపర్తి దుర్గా నాగ సత్యమూర్తి @ చంటి (25 సం.లు)* ను, ఈరోజు ఉదయం అమలాపురం పట్టణ సి.ఐ వీరబాబు గారి పర్యవేక్షణలో ఎస్సై టి.శ్రీనివాస్ మరియు సిబ్బంది పోతవరం గ్రామంలో అరెస్ట్ చేసి, ముద్దాయి నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు, బాలిక యొక్క స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్, జత స్కూల్ షూలు స్వాధీనపరచుకొని, రిమాండ్ నిమిత్తం, అమలాపురం గౌరవ ఆడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వారి ముందు ముద్దాయి హాజరుపర్చగా, కోర్టు వారు ముద్దాయి 14 రోజుల రిమాండ్ విధించటం జరిగింది. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరుగుతుంది. ఈ కేసులో త్వరితగతిన స్పందించి, కిడ్నాప్ కాబడిన బాలిక ఆచూకీ గుర్తించి, ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చి, వెను వెంటనే పరారీలో ఉన్న ముద్దాయి అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపర్చిన అమలాపురం పట్టణ సీఐ వీరబాబు, ఎస్సైలు శ్రీనివాస్, జోషి మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐ.పి.ఎస్. పి. వీరబాబు, సి.ఐ., అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat

More like this