ShareChat
click to see wallet page
#🏏క్రికెట్ 🏏 *148 ఏళ్లలో ఇదే తొలిసారి..❗* Uppala Shivaprasad November 22, 2025🏏 టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా ఈ ఫీట్ సాధించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 28.2 ఓవర్లలోనే ఛేదించింది. ట్రావిస్ హెడ్(83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123) టీ20 తరహా బ్యాటింగ్‌తో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ విజయంతో ఆసీస్.. ఇంగ్లండ్ రికార్డ్‌ను అధిగమించింది. ఇంగ్లండ్ 204 పరుగుల లక్ష్యాన్ని 35.3 ఓవర్లలో అధిగమించగా.. న్యూజిలాండ్ 217 పరుగుల టార్గెట్‌ను 39.4 ఓవర్లలో ఛేదించింది. ఇప్పటి వరకు ఇవే ఫాస్టెస్ట్ టార్గెట్ ఛేజింగ్ రికార్డ్స్‌గా ఉండగా.. ఆసీస్ తాజా విజయంతో వాటిని కనుమరుగు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా కూడా ఇది చరిత్రకెక్కింది ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్(61 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓలీ పోప్(58 బంతుల్లో 4 ఫోర్లతో 46), జెమీ స్మిత్(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(7/58) ఏడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. బ్రెండన్ డొగ్గెట్(2/27) రెండు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ క్యారీ(26), కామెరూన్ గ్రీన్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ట్రావిస్ హెడ్(21) విఫలమయ్యాడు. బెన్ స్టోక్స్(5/23) ఐదు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ (3/45) మూడు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్(2/11)‌కు రెండు వికెట్లు దక్కాయి. 40 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. గస్ అట్కిన్సన్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), ఓలీ పోప్(57 బంతుల్లో 2 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/55)తో పాటు స్కాట్ బోలాండ్(4/33) నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్రెండన్ డొగ్గెట్(3/51) మూడు వికెట్లు తీసాడు. దాంతో ఆసీస్ ముందు 205 పరుగుల లక్ష్యం నమోదైంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్‌పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం ఆసీస్‌కు కష్టమవుతుందని అంతా అనుకున్నారు. కానీ ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగి టీ20 బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు.
🏏క్రికెట్ 🏏 - 5 ಏಂತ್ರಸೃಟ್ಟಿಂವನ ತಸಿಸ 5 ಏಂತ್ರಸೃಟ್ಟಿಂವನ ತಸಿಸ - ShareChat

More like this