https://youtube.com/watch?v=RRXKyKaQob8&si=crHfCfYJbb8U3gxh #ఏపీ అప్ డేట్స్..📖
_*🚩 #"కార్తీక పురాణం" - 29 వ అధ్యాయము🚩*_
🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️
*అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
అత్రి మహాముని అగస్త్యులవారితో ఈవిధముగా - సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి వుభయులను రక్షించి , భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.
ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి , పాదములను కడిగి , ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని , *"ఓ మునిశ్రేష్టా ! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును , ద్వాదశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన , నా అతిధ్యమును స్వీకరించి నన్నును , నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు , మీరు దయార్ద్ర హృదయులు , ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను.
*మహానుభావా ! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన , ఓ పుణ్యపురుషా ! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును , సదా , మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"* డని ప్రార్ధించి , సహాపంక్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.
ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి *"రాజా ! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో , ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.
*నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని , నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక , మరొకటి యగునా?"* అని దుర్వాస మహాముని పలికి , అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి , అతని భక్తిని కడుంగడు ప్రశంసించి , అంబరీషుని దీవించి , సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.
*ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ ! ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా ! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే , ఆరోజుకంతటి శ్రేష్టతయు , మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ , లేక , వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునకు ప్రీతీకొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నారాయుణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.*
ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో , అట్టి వారు ఏకాదశి వ్రతము , ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను , అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.
ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.
*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.*
*_🙏🙏🙏🙏🙏🙏_*
https://youtube.com/watch?v=2WX3ZtUPPxQ&si=bl2BDSuI1MUj0-q8 #ఎల్లో మీడియా.. 🤠
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 #ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 🤠
*జగన్పై జనాదరణ……… ప్రత్యర్థుల్లో గుండెదడ❗*
NOVEMBER 21, 2025🎯
ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్కు ఉన్నంత ప్రజాదరణ మరే నాయకుడికి కనిపించదు. ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న వైసీపీ అధినేతకు, ఇంత తక్కువ సమయంలో విపరీత ప్రజాదరణ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్కు జనాదరణ, రాజకీయ ప్రత్యరులో గుండె దడ పుటిస్తోందనే అభిప్రాయం
ప్రత్యర్థుల్లో గుండె దడ పుట్టిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైఎస్ జగన్ మాస్ లీడర్. జగన్ బలమే జనం. అధికారంలో వుండగా జగనే జనాన్ని పట్టించుకోలేదు. వాళ్లతో కలవలేదు. జనానికి సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పనులు చేసి పెడుతున్నానని ఆలోచించారే తప్ప, వారితో మానసికంగా దూరమవడాన్ని పసిగట్టలేకపోయారు. అందుకే ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. రాజకీయాలే కాదు, జీవితంలోనూ నిత్యం అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు పోవాల్సిందే.
ఇందుకు జగన్ అతీతం కాదు. నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు వెళ్లిన వైఎస్ జగన్కు భారీ జనాదరణ లభించింది. ఈ మధ్య కాలంలో జగన్కు జనంలో మళ్లీ పూర్వపు ఆదరణ దక్కుతోందని వ్యతిరేక మీడియా పసిగట్టింది. అందుకే హైదరాబాద్లో జగన్ పర్యటనపై మూడు రోజుల ముందు నుంచే వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టింది. కానీ తాము చేస్తున్న ప్రతి వ్యతిరేక పని. జగన్కు రాజకీయంగా లాభిస్తుందనే
సంగతి మరిచిపోయారు.
జనాదరణ లేని ఏ నాయకుడి రాజకీయ జీవితమైనా అస్తమిస్తోందని అర్థం. కానీ జగన్కు జనాదరణ చూస్తే, ఉదయిస్తున్న సూర్యోదయాన్ని మురిపిస్తోంది. సూర్యోదయ వెలుగు అంతకంతకూ పెరుగుతుంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై కనీసం ఏడాదిన్నర కూడా కాలేదు. అప్పుడే కూటమి ప్రత్యర్థి, ప్రత్యామ్నాయ నాయకుడైన వైఎస్ జగన్కు, అది కూడా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జనం పెద్ద ఎత్తున రావడం చిన్న విషయం కాదు.
హైదరాబాద్లో జగన్కు పోటెత్తిన జనం వైసీపీలో జోష్ నింపగా, ముఖ్యంగా టీడీపీలో భయం నింపింది. జనంలో మళ్లీ జగన్పై మోజు కనిపిస్తోందన్న చర్చకు తెరలేచింది. అంతేకాదు, జనాదరణ చాలా అర్థాలు చెబుతోంది. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని, వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. కూటమి పాలన ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తోందనేందుకు జగన్కు లభించిన జనాదరణే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరీ ముఖ్యంగా పిచ్చిపట్టినట్టుగా జగన్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ అనుకూల మీడియా వైఖరిని జనం అసహ్యించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో జగన్ పాదయాత్ర చేపట్టి, రోడ్డుపైకి వస్తే జనమే జనం అని చెప్పక తప్పదు. ఈ జనాదరణే జగన్కు వెయ్యి ఏనుగుల బలం. కూటమిపై పోరాటానికి జనం ఇస్తున్న మద్దతే కొండంత బలం అని చెప్పక తప్పదు.
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*చంద్రబాబు గారండోయ్… క్షమించండి మా అజ్ఞానానికి… శపించకండి ప్లీజ్…‼️*
November 21, 2025🎯
నిజానికి ఒక వీడియో చూసేదాకా నాకూ నమ్మబుద్ది కాలేదు… సరే, చంద్రబాబు కంప్యూటర్లు కనిపెట్టాడు, మొబైల్స్ ఆయన సృష్టే… హైదరాబాద్ కట్టింది తనే… సర్వం తానే… అంతెందుకు..? ఆయన మామ తెలంగాణ వాళ్లకు వరి అన్నం అంటే ఏమిటో చూపించి, తినిపించాడు, పొద్దున్నే లేవడం నేర్పాడు…
వర్క్ కల్చర్ నేర్పాడు… కానీ చంద్రబాబు తెలంగాణ గుళ్లను కూడా తనే కట్టాను అన్నాడంటే నమ్మలేకపోయాను…
మన పిచ్చి గానీ భద్రాచలం గుడిని శ్రీరామదాసు కట్టాడని అనుకుంటాం కదా, కాదు, చంద్రబాబు… అలాగే కీసర, బాసర, సమ్మక్క- సారలమ్మ… ఒకటేమిటి, చివరకు ఆలంపూర్, యాదగిరిగుట్ట కూడా తనే కట్టాడు…
ఈ వీడియో బిట్ ఎప్పటిదో గానీ… ఇన్నాళ్లూ మీ ఘొప్పథనాన్ని గుర్తించలేకపోయాం… ఈ చరాచర సృష్టికి కారకులు మీరు, నిర్మాతలు మీరని గుర్తించలేకపోయాం… క్షమించండి మా అజ్ఞానాన్ని… కనీసం ఏబీఎన్ రాధాకృష్ణయినా అప్పుడప్పుడైనా మాకు గుర్తు చేస్తూ ఉంటే బాగుండేది… ప్చ్… పాపం శమించుగాక…
ఇప్పుడు Murali Buddha పోస్టు చదవండి ఇక…
అబద్ధాల్లో ధైర్యం అంటే బాబుదే…
సీఎంలు యాదగిరిగుట్టకు ఎందుకు వెళ్ళరు అంటే …
ఆసక్తి ఉన్నవాళ్లు బాబు వీడియో మరోసారి చూడండి …
యాదగిరిగుట్ట నేనే కట్టాను . భద్రాచలం నేనే అంటూ బాబు చెబుతున్నప్పుడు అతనిలోని ఆ ధైర్యాన్ని చూడాలి … చెప్పేది అబద్దం అయినా ఆ ధైర్యం అద్భుతం …
93 నుంచి నాకు తెలుసు … ఎంత ప్రయత్నించినా బాబు యాదగిరిగుట్టను సందర్శించినట్టు గుర్తుకు రావడం లేదు … అన్నీ గుర్తుండాలి అనేమీ లేదు … ఏమో, యాదగిరిగుట్టకు వచ్చే ఉంటాడు అని నిర్ధారించుకోవడానికి గ్రోక్ ను అడిగితే ఒక్కసారి కూడా రాలేదు అని చెబుతోంది …
పోనీ గ్రోక్ కు అన్నీ తెలవాలి అని ఏముంది ? అని చాట్ జిపిటీని అడిగితే గుట్టకు రాలేదు కానీ 2020 లో హైదరాబాద్ కు వస్తుండగా ఆ ప్రాంతంలో బాబు కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది అని చెబుతోంది …
గ్రోక్ కు, చాట్ జిపిటీ కి అన్నీ తెలియాలి అని ఏముంది ? అని యాదగిరి గుట్టలో రిపోర్టర్ రాగి సహదేవ్ కు ఫోన్ చేశా … అతను నాకు 35 ఏళ్ళ నుంచి తెలుసు … యాదగిరి గుట్టకు బాబు ఒక్కసారన్నా వచ్చాడా అని అడిగితే నేను 1980 నుంచి యాదగిరిగుట్ట ఆంధ్రభూమి రిపోర్టర్ గా చేస్తున్నాను … 45 ఏళ్ల నుంచి రిపోర్టర్ ను .
ఇప్పుడు ఆ ఆంధ్రభూమి లేదు, ఇప్పుడు మరో పత్రికలో ఉన్నాను . పుట్టింది ఇక్కడే .. పుట్టినప్పటి నుంచి ఇక్కడే… ఒక్కసారి కూడా బాబు యాదగిరిగుట్టకు రాలేదు … 1982 లో టీడీపీ పుడితే 80 నుంచి నేను యాదగిరిగుట్ట రిపోర్టర్ ను అని చెప్పుకొచ్చాడు ….
ఇది రాయడానికి మీడియాకు ధైర్యం ఉండదు కానీ తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా యాదగిరి గుట్టకు వెళ్లని బాబు అంత ధైర్యంగా యాదగిరిగుట్టను నేనే కట్టాను అని చెప్పడం – రాధాకృష్ణ తన్మయత్వం చూసి తరించాలి …
ఉమ్మడి రాష్ట్రం సీఎంగా బాబు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు కదా ? యాదగిరిగుట్టకు ఎందుకు వెళ్ళలేదు అని ఆశ్చర్యం వేసింది … యాదగిరి గుట్టలోని స్థానికులు , అధికారుల నుంచి సమాచారం సేకరిస్తే ….
చివరకు యాదగిరి గుట్ట జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో టీడీపీ మీటింగ్ జరిగితే బాబు ఆ మీటింగ్ కు వెళ్లారు కానీ గుట్ట పైకి వెళ్ళలేదు … స్వామి వారు తెలంగాణ దేవుడు కదా… పైగా …
అవినీతి అక్రమాలకు పాల్పడినవారు గుట్టపైకి స్వామి దర్శనానికి వస్తే స్వామి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అని ఇక్కడ ఓ నమ్మకం ఉంది .. ఈ నమ్మకం వల్ల సీఎంలు స్వామికి దూరంగానే ఉన్నారు ..
1983 లో ఎన్టీఆర్ సీఎం అయ్యాక బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు …
తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎంగా కెసిఆర్ యాదగిరి గుట్టకు వచ్చి గుట్ట రూపురేఖలు మార్చారు … ధైర్యంగా యాదగిరి గుట్ట పునర్నిర్మాణం చేపట్టారు .
తెలంగాణ ఏర్పడినప్పుడు 2014 లో యాదగిరి గుట్టకు వెళితే అక్కడి అపరిశుభ్రత – గుడి వెనుకే పందుల విహారం చూసి బాధ వేసింది … దీనిని పరిశుభ్రంగా చేస్తే బాగుండు అనిపించింది … ఆ తరువాత ఊహించని విధంగా యాదగిరిగుట్టను కెసిఆర్ అభివృద్ధి చేశారు .
జీవితంలో ఒక్కసారి కూడా యాదగిరి గుట్టకు వెళ్లని – గుట్ట అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వని బాబు యాదగిరిగుట్టను నేనే అని నిస్సిగ్గుగా చెప్పడం చూస్తే … ఆ ధైర్యానికి ముచ్చటేస్తుంది….
– బుద్దా మురళి
సింపుల్… బాబు పాలన రాకముందు … తెలంగాణ ఒక సెంటినలీస్ దేవి… తనే ఈ నాగరిక ప్రపంచంలోకి ఈడ్చుకొచ్చాడు… అంతకుముందు తెలంగాణ జనం చెట్లు, గుట్టల వెంబడి ఆకులు అలములు తింటూ దిసమొలలతో తిరిగేవాళ్లు ఫాఫం..!!
#ఏపీ అప్ డేట్స్..📖
మీరు చేయనిది ఏమైనా ఉంటే చెప్పండి.. నోట్ చేసుకుంటాం..🤔
https://youtube.com/watch?v=XVUKh9765iQ&si=fTllf1UW1sTNKSTx #జగన్ #ఎల్లో మీడియా.. 💥





!["కార్తీక పురాణం" - Karthika Puranam] సంపూర్ణ కార్తీక మహాపురాణము 538 LCu CV z covlu Karthika Puranam] సంపూర్ణ కార్తీక మహాపురాణము 538 LCu CV z covlu - ShareChat "కార్తీక పురాణం" - Karthika Puranam] సంపూర్ణ కార్తీక మహాపురాణము 538 LCu CV z covlu Karthika Puranam] సంపూర్ణ కార్తీక మహాపురాణము 538 LCu CV z covlu - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_797421_271ef645_1763729796086_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=086_sc.jpg)







