P.Venkateswara Rao
ShareChat
click to see wallet page
@prasad831
prasad831
P.Venkateswara Rao
@prasad831
ప్రేమించు కానీ నటించకు
_*🚩 #"కార్తీక పురాణం" - 23 వ అధ్యాయము🚩*_ 🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️ *శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట* ☘☘☘☘☘☘☘☘☘ అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి *"ఓ మునిపుంగవా ! విజయమొందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"* మని అడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి - కుంభసంభవా ! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము , శత్రుశేషము వుండకూడదని తెలిసి , తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు , పవిత్రుడు , సత్యదీక్షాతత్పరుడు , నిత్యాన్నదాత , భక్తప్రియవాది , తేజోవంతుడు , వేదవేదాంగవేత్తయై యుండును. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై , విష్ణు సేవాధురంధరుడై , కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను. ఇన్ని యేల ? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు , సదాచారసత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున , యే కాలమున , యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా ? యని విచారించుచుండగా  ఒకానొకనాడు అశరీరవాణి *"పురంజయా ! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు"* అని పలికెను. అంతట పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని , రాజ్యభారమును మంత్రులకు అప్పగించి , సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు , ఆయా దేవతలను సేవించుచు , పుణ్యనదులలో స్నానము చేయుచు , శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యముపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది , చేతులు జోడించి , *"దామోదరా ! గోవిందా ! గోపాలా ! హరే ! కృష్ణా ! వాసుదేవా ! అనంతా ! అచ్యుతా ! ముకుందా ! పురాణపురుషా ! హృషికేశా ! ద్రౌపదీమాన సంరక్షకా ! దీనజన భక్తపోషా ! ప్రహ్లాదవరదా ! గరుడధ్వజా ! కరివరదా ! పాహిమాం ! పాహమాం ! రక్షమాం రక్షమాం ! దాసోహం పరమాత్మ దాసోహం"* యని విష్ణు సోత్త్రమును పఠించి , కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల , మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో , పాడిపంటలతో , ధనధాన్యాలతో , ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహా గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై , రాజనీతి గలవారై , వైరిగర్భ నిర్బేదకులై , నిరంతరము విజయశశీలురై , అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ , పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము , విశాల కటిత్వము , సూక్ష్మ మద్యత్వము , సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు , శీలవతులనియు , గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి. ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై , ప్రౌఢలై , వయోగుణ రూప లావణ్య సంపన్నలై , సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి. పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు , కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని , తన కుమారునికి రాజ్యభారము అప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున , ఓ అగస్త్యా ! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి , చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును. *ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహత్మ్య మందలి త్రయోవింశోధ్యాయము - ఇరవైమూడో రోజు పారాయణము సమాప్తము.* *_🙏🙏🙏🙏🙏🙏_*
"కార్తీక పురాణం" - Karthika Puranam] సంపూర్ణ కార్తీక మహాపురాణము 538 LCu CV  z covlu Karthika Puranam] సంపూర్ణ కార్తీక మహాపురాణము 538 LCu CV  z covlu - ShareChat
https://youtube.com/watch?v=LwP6xKfVBlo&si=_MqCp-7lKjP8cQ9P #విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪
youtube-preview
#పెళ్ళామా మజాకా 🤣
పెళ్ళామా మజాకా 🤣 - ఇంటికొచ్చిన . మామగారు అల్లుడికి కొత్త హెల్యెట్ కొనిచ్చారు: లది చూసి ಅಲುಡು: 25 మామగారు : ~5   క్ 86, ఇప్పుడు ఇది ఎందుకు? మామగారు: యికి మీ అత్త స్టీలు చపాతీ ७d%( కర్ర ఇచ్చింది, అందుకే ముందు ఇస్తున్నా ಜಾಂತ್ತಿಗಾ ನಿಕಿಐ ఇంటికొచ్చిన . మామగారు అల్లుడికి కొత్త హెల్యెట్ కొనిచ్చారు: లది చూసి ಅಲುಡು: 25 మామగారు : ~5   క్ 86, ఇప్పుడు ఇది ఎందుకు? మామగారు: యికి మీ అత్త స్టీలు చపాతీ ७d%( కర్ర ఇచ్చింది, అందుకే ముందు ఇస్తున్నా ಜಾಂತ್ತಿಗಾ ನಿಕಿಐ - ShareChat
#చంద్రబాబు నాయుడు పచ్చళ్ళు అమ్మే వాడు ఫిల్మ్ సిటీ కడతాడు.. కిరసనాయిలు డీలర్(ABN) సొంత గా ఛానల్ కొనేస్తాడు.. రెండు ఎకరాల వాడు ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ లో 931 కోట్లు అని రాశాడు... ఉదయం లేచిన కాడి నుంచి వీళ్ళు చెప్పే సోల్లు వినే ముందు,వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చయి ఆలోచించండి రా...బాబు....
చంద్రబాబు నాయుడు - ShareChat
#ఏపీ అప్ డేట్స్..📖 #విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪 *బాబుతో తప్పు చేయిస్తున్న అధికారం❗* NOVEMBER 17 2025🎯 విశాఖలో సీఐఐ సదస్సు పేరుతో రెండు రోజుల పాటు చంద్రబాబు సర్కార్ హడావుడి చేసింది. లక్షల కోట్లు పెట్టుబడులు, వందలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయంటూ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఆకాశమే హద్దుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ మీడియా కూడా అదే ప్రచారంలో మునిగి ఉండగా, చంద్రబాబు నోరు జారారు. విశాఖ ఉక్కు కార్మికులు, సంబంధిత సంఘాల నాయకులపై ఆయన నోరు పారేసుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టపోవడానికి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులే సోమరితనమే కారణమని అర్థం వచ్చే రీతిలో బహిరంగంగానే ఆయన అన్నారు. చంద్రబాబు ఎంత ఫ్రెండ్లీగా వుంటారో కానీ, ప్రశ్నిస్తే చాలు ఆయన తట్టుకోలేరు. చేతిలో అపరిమితమైన అధికారం వుందనే కారణం కావచ్చు, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఆయన అనుకుంటున్నట్టున్నారు. సీఐఐ సమ్మిట్ వల్ల వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులపై ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా టీడీపీకి తీవ్ర నష్టం తెచ్చేలా ఉన్నాయి. బాబు చేసిన నష్టాన్ని, పూడ్చేందుకు అన్నట్టుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వీడియో విడుదల చేశారు. బాబు మాటల్ని వక్రీకరించారని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో పౌర సమాజం వుందని పల్లా శ్రీనివాసరావు భావిస్తున్నారా? అనే ప్రశ్న ఎదురవుతోంది. గతంలో తమ సమస్యలు చెప్పుకోడానికి వెళ్లిన నాయీ బ్రాహ్మణులపై నడిరోడ్డుపై చంద్రబాబు చిందులు తొక్కారు. తోకలు కట్ చేస్తానని, వారి వృత్తిని అవమానించే రీతిలో బాబు మండిపడడాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును నిలుపుకోలేక పోతుండడంతో పాటు ఇంకా పెట్టని ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తుందని ఆయన చెప్పడం విశేషం. ప్రైవేటీకరణపై చంద్రబాబు మోజు మరోసారి బయటపడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు పాలనంటే చాలు ప్రైవేట్కు స్వర్గధామం. విద్య, వైద్యం, పరిశ్రమలు ఇలా ఒక్కటేమిటి అన్నీ ప్రైవేట్పరమే. కేవలం తమ పదవుల్ని మినహాయించుకుని, అన్నింటినీ ప్రైవేట్పరం చేయడానికి చంద్రబాబు వెనుకాడడం లేదని వామపక్షాల నాయకుల విమర్శలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు కామెంట్స్ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీకి నష్టం తెచ్చేలా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. బాబు చెప్పింది వినాలే తప్ప, ఎదురు ప్రశ్నిస్తే ఆయన స్పందన అట్లే వుంటుందనే మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నాయకుడిగా మరోలా వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లు అని సీపీఐ నాయకుడు కె.రామకృష్ణ ఆరోపణ చర్చనీయాంశమైంది.
ఏపీ అప్ డేట్స్..📖 - ShareChat
#భార్యా బాధితులు😭 *కానీ ఏమిచేద్దాం తప్పదు కదా..❓ మార్చుకునే అవకాశం కూడాలేదు..*😜😜
భార్యా బాధితులు😭 - పర్చినట్టునొయచీరఎ' నీ విప్పడంటిునవ; 0 ಸಲಕ್ನ మీకు 0~٣ కానీ )০&], మౌ 8608 ಸಳ್ಳಜ್ರz ಅಸ್ಥರ್ಓ್ 2 పర్చినట్టునొయచీరఎ' నీ విప్పడంటిునవ; 0 ಸಲಕ್ನ మీకు 0~٣ కానీ )০&], మౌ 8608 ಸಳ್ಳಜ್ರz ಅಸ್ಥರ್ಓ್ 2 - ShareChat