ShareChat
click to see wallet page
#తెలుసుకుందాం #😃మంచి మాటలు #psychology #psychological facts #psychological facts బెంగళూరు ఐపీఎల్ తొక్కిసలాటలో 11 మంది మరణించిన సందర్భంలో మరోసారి షేరింగ్... గుంపు మనస్తత్వంతో జాగ్రత్త వీర్రాజు తెలివైన, చురుకైన విద్యార్థి. ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం జరుగుతున్నాడు. కాలేజ్ ఫెస్ట్ సందర్భంగా విద్యార్థుల మధ్య స్వల్ప విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అవి చిలికి చిలికి గాలివానగా మారాయి. 💪 ఒకరోజు కాలేజీ క్యాంటీన్ లో జరిగిన చిన్న గొడవ పెద్దదైంది. విద్యార్థులందరూ రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్నారు. ఆ గొడవల్లో ఒకరు చనిపోగా, చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. వీర్రాజుతో సహా పలువురు విద్యార్థులపై పోలీసు కేసులు నమోదయ్యాయి. 🚨👮 ఈ విషయం తెలుసుకున్న వీర్రాజు తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అమాయకంగా, నిదానంగా ఉండే తమ కొడుకు గొడవల్లో భాగం కావడం, పోలీసు కేసుల్లో ఇరుక్కోవడం ఏమిటో వాళ్లకు అర్థంకాలేదు. 🥺 అతన్ని అడిగితే... ఆ సమయంలో ఏం జరిగిందో, తానెందుకు అలా ప్రవర్తించానో తనకే అర్థం కావడంలేదని ఏడ్చాడు. 😭 వీర్రాజులాంటి మంచివాళ్లు కూడా గుంపులో భాగమైనప్పుడు విపరీతంగా ప్రవర్తించడం, హింసాత్మక చర్యలకు పాల్పడటం ‘‘గుంపు మనస్తత్వం’’లో భాగం. 💪🦾 కాలేజీల్లోనే కాదు రాజకీయ ర్యాలీలు, కులఘర్షణలు, మతపరమైన సమావేశాలు, క్రీడా కార్యక్రమాలు వంటి వివిధ సందర్భాల్లో మాబ్ సైకాలజీ బయటపడుతుంది. గతంలో అమెరికా కాపిటల్ పై దాడి సమయంలోనూ, ఇటీవల మణిపూర్ హింస నేపథ్యంలోనే కాలు అమెరికాలో బియ్యంకోసం క్యూలు కట్టడంలోనూ మాబ్ సైకాలజీ ఉంది. సమాచారాన్ని త్వరగా వ్యాపింపచేసే సోషల్ మీడియావల్ల ఇలాంటి పరిస్థితులు త్వరగా ఏర్పడుతున్నాయి. అందుకే దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 📳📶 #mobmentality కి కారణాలు ఒక వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తిస్తాడనేది అతని వ్యక్తిగత విలువలు, పూర్వ అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. అయితే వీర్రాజు లాంటి విద్యార్థులు కూడా గుంపులో భాగం కాగానే దూకుడుగా ప్రవర్తిస్తుంటారు. అందుకు మాబ్ మెంటాలిటీనే కారణం. గుంపు నాయకుడి ప్రవర్తన కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అలాగని గుంపులో ఉన్న ప్రతి ఒక్కరూ హింసలో పాల్గొనరని గుర్తించడం చాలా అవసరం. అందుకే మాబ్ మెంటాలిటీకి కారణాలు తెలుసుకోవాలి. ♦️వ్యక్తుల గుర్తింపు, ఆత్మగౌరవం వారి సమూహంతో ముడిపడి ఉండవచ్చు. ఇది వారిలో బలమైన సమన్వయానికి, కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తులతో సంఘర్షణకు దారితీస్తుంది. ♦️ వ్యక్తులు పెద్ద సమూహంలో భాగమైనప్పుడు స్వీయ అస్తిత్వాన్ని, వ్యక్తిగత గుర్తింపును కోల్పోతారు. వ్యక్తిగత జవాబుదారీతనం తగ్గుతుంది. దీనివల్ల ఒంటరిగా ఉన్నప్పుడు చేయలేని పనులను కూడా గుంపులో చేస్తారు. ♦️తమ సమూహానికి ద్రోహం జరిగిందని, ముప్పు ఉందని, తిరగబడితే కోల్పోయేది ఏమీ లేదని భావించినప్పుడు పోరాడతారు. ♦️ ఆ సమయంలో భావోద్వేగాలు, ప్రవర్తనలు గుంపులో వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇది అధిక భావోద్వేగ తీవ్రత, ప్రతికూల ప్రవర్తనల విస్తరణకు దారితీస్తుంది. ♦️ భావోద్వేగాలు కలిగిన పెద్ద సమూహంలో భాగం కావడం వల్ల వచ్చే ఆడ్రినలిన్, ఉత్సాహం కొందరు దూకుడుగా, హింసాత్మక ప్రవర్తనలో పాల్గొనడానికి దారి తీస్తుంది. ♦️గుంపు నాయకుడి ప్రోత్సాహం అప్పటికే పెరిగిన భావోద్వేగాలను తీవ్రతరం చేస్తుంది. హింస వ్యక్తిగత బాధ్యత కాదు సమూహ బాధ్యత అనే భావనను సృష్టిస్తుంది. ♦️సాధారణంగా ఆమోదయోగ్యం కాని ప్రవర్తనలు గుంపులోని ఇతరుల్లో కనిపించినప్పుడు అవి ఆమోదయోగ్యమైనవిగా మారతాయి. వాటి పట్ల సుముఖత ఏర్పడుతుంది. #ప్రవర్తన #అదుపు_ఎలా? గుంపును నియంత్రించడం లేదా గుంపు ప్రవర్తనను ప్రతిఘటించడం ఒక సవాలు. అందువల్ల ఎప్పుడూ మీ భద్రతకు, ఇతరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. గుంపులో ఉన్నప్పుడు ప్రవర్తనను నియంత్రించుకునేందుకు స్వీయ అవగాహన ముఖ్యం. అలాగే పెద్ద గుంపులో భాగమైనప్పుడు హింసాత్మక ప్రవర్తనలలో పాల్గొనకుండా ఉండటానికి మీకు సహాయపడే కొన్ని టిప్స్... ✅ మాబ్ సైకాలజీ గురించి అవగాహన పెంచుకోండి. అది మంచి నిర్ణయాలు తీసుకునేందుకు మీకు సహాయం చేయగలదు. ✅ గుంపు మధ్యలో కాకుండా అంచున ఉండండి. ఇది మీ ప్రవర్తనపై గుంపు ప్రభావం తీవ్రతను తగ్గిస్తుంది. ✅ గుంపులోని మనుషులు ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ మీ వ్యక్తిగత విలువలను గుర్తు చేసుకోండి. మీదైన నైతికతకే కట్టుబడి ఉండండి. ✅ దూకుడు లేదా హింసను ప్రేరేపించే పరిస్థితులు లేదా వ్యక్తులను గుర్తించి వారికి దూరంగా ఉండండి. ✅ పరిస్థితి హింసాత్మకంగా మారుతున్నట్లు మీకు అనిపిస్తే, గుంపు నుండి దూరంగా వెళ్లండి. ✅ హింసాత్మక చర్యలకు పాల్పడితే మీపై, మీ భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాన్ని అర్థం చేసుకోండి. ✅ గుంపులో మీలా హింసను వ్యతిరేకించే వ్యక్తులు కూడా ఉంటారు. వారిని కలుపుకుని గుంపును నియంత్రించే ప్రయత్నం చేయండి. ✅ మద్యం లేదా మాదక ద్రవ్యాల వాడకం హింసాత్మక ధోరణిని ప్రేరేపిస్తుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ✅ హింస లేదా ప్రమాదకరమైన ప్రవర్తనను చూస్తే, వెంటనే సంబంధిత అధికారులకు నివేదించండి.
తెలుసుకుందాం - ShareChat

More like this