ఇది వరకు రోజుల్లో, పిల్లలందరి చేత అప్పుడప్పుడు ఆముదం బలవంతంగా తాగించే వారు.
ఈ ఫోటో అలాంటి సన్నివేశాన్ని చక్కగా చూపిస్తుంది.
ఆ రోజు కుటుంబం మొత్తం కలిసికట్టుగా ఈ ప్రక్రియలో పాల్గొనేవారు. ఆ ఫోటో చూడండి. అందరి భావాలు ఎంత బాగా గీశాడో చిత్రకారుడు!!
తల్లి పిల్లలని బలవంతంగా ఆరోగ్యం కోసం తాగిస్తోంది!!
అమ్మమ్మ తాగిన వెంటనే వెగటు రాకుండా పిల్లల కోసం పంచదార డబ్బాతో సిద్ధంగా ఉంది ప్రేమగా!!
తండ్రి పిల్లల్ని తాగమని బెదిరిస్తున్నాడు!! ఇదంతా చూస్తున్న తాతయ్య తనలో తాను నవ్వుకుంటున్నాడు!!.
తాగేసిన పిల్లలు మొహాలు చూడండి. అలానే,ఇంకా తాగాల్సిన పిల్లల మొహంలో ఆ భయం ఎంత భయమో.!!!
చాలా అద్భుతమైన పెయింటింగ్ కదూ!!!!
#yes it's true 💯% #nijame #avunu nijame

