#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #గోదాదేవి అమ్మవారు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుపతి నగరంలోనే ఉన్న శ్రీ గోవిందరాజుల స్వామి వారి దేవాలయంలో నిన్న (28.07.2025) తిరువడిపురం (గోదాదేవి జన్మోత్సవం) సందర్భంగా సాయంత్రం అలిపిరి వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలో ఆదిపురం ఆస్థానం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా ఆలయం నుండి బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ గోదాదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు విశేష అర్చన, విశేష సమర్పణ, దివ్య ప్రబంధం గోష్టి, నక్షత్ర హారతి వైభవంగా జరిగినది.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
