ShareChat
click to see wallet page
search
*లింకులు క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..! సైబర్ మోసాలపై గిద్దలూరు CI హెచ్చరిక* వాట్సాప్ గ్రూపుల్లో ఇటీవల *నాకు రూ.5 వేలు వచ్చాయి.. నమ్మలేకపోయాను.. మీరు కూడా ట్రై చేయండి..* అంటూ వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని గిద్దలూరు.*పట్టణ సిఐ సురేష్* ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి మెసేజ్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయకుండా ఉండాలని సూచించారు. అలాగే, తెలియని నెంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయడం, ఫార్వర్డ్ చేయడం వంటి చర్యల వల్ల మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉండటంతో పాటు, ఖాతాల నుంచి డబ్బులు పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద లింకులు వస్తే వెంటనే వాటిని డిలీట్ చేసి, అవసరమైతే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
🎯AP రాజకీయాలు - యపిం 6 MARKAP POLJ ಮಿನಿವ್ ಾ೦೦ యపిం 6 MARKAP POLJ ಮಿನಿವ್ ಾ೦೦ - ShareChat