Gold Price Today: రూ.2 లక్షలకు చేరువలో బంగారం ధర.. వెండి ఎంతో తెలుసా..?
Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు రోజూ సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుని కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు..