Food Safety: గొంతులో చేప ముల్లు ఇరుక్కుందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నిమిషాల్లో రిలీఫ్!
చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కానీ వాటిని తినేటప్పుడు ఒక్కోసారి చిన్న ముల్లు గొంతులో ఇరుక్కుని ఇబ్బంది పెడుతుంటుంది. ఆ సమయంలో గొంతులో ఏదో గుచ్చుకుంటున్నట్లు ఉండి, మింగడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే, ఇలా జరిగినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో ఉండే కొన్ని సాధారణ పదార్థాలను ఉపయోగించి ఆ ముల్లును సులభంగా లోపలికి జారిపోయేలా చేయవచ్చు.