మాఘ అష్టమి - భీష్మాష్టమి
భీష్ముడు యుద్ధరంగంలో పడిపోయి కూడా ఈ మాఘమాసం వచ్చేదాకా ప్రాణాన్ని శరీరంలో నిలబెట్టుకున్నాడు. శేషతల్పంపై ఉండి, #భీష్మాష్టమి🚩 #భీష్మాష్టమి💐🎂 ఉత్తరాయణం వచ్చేదాకా శ్రీహరిని ధ్యానించి, ధర్మజునికి సకల ధర్మాలూ బోధించిన మహాత్ముడు, విష్ణుసహస్రనామ స్తోత్రం లోకానికి అందించిన పుణ్యాత్ముడు, భీష్ముడు శరీరం విడిచి, వసులోకాన్ని పొందిన దివ్యమాసం మాఘం. మాఘమాసంలో శ్రీకృష్ణుడిని స్మరిస్తూ శరీరం విడిచిపెట్టాడు.
భీష్ముడు మాఘమాసంలో అష్టమినాడు హరిని అనేక నామాలతో స్తోత్రం చేశాడు. పుండరీకాక్ష , వాసుదేవ, వరద, అప్రమేయ అని స్తోత్రం చేసాడు. అందుకే ఈ అష్టమికి భీష్మాష్టమి అని పేరు వచ్చింది. ఈ అష్టమినాడు భక్తిశ్రద్ధలతో హరి నామం చేసేవాడు శరీరం విడిచిపెట్టాక నరకం చూడడు, ముక్తి పొందుతాడు.
#తెలుసుకుందాం


