నవరత్నాలు ధరించే విధములు............!!
నవగ్రహాలకు సంబంధించి అంతర్ధశలు ఉన్నట్టే గ్రహ మహర్ధశ ఉంటుంది. అంతర్ధశకు సంబంధించి ఆ కాలంలో వివిధ రత్నాలను ధరించిన ట్లే మహర్ధశలోనూ రత్నాలను ధరిస్తే శుభం చేకూరుతుంది.
రవి మహర్ధశ ఆరేళ్ల కాలంపాటు ఉంటుంది.
ఈ మహర్థశ కాలంలో రవి జపం చేయించిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి.
చంద్ర మహర్థశ పదేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో చంద్ర జపం చేయించి ముత్యాన్ని వెండిలో ధరించాలి.దీనిని ఉంగరపు వేలికి ధరించాలి.
కుజ మహర్థశ ఏడేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో కుజ జపం చేయించిన తర్వాత పగడాన్ని వెండిలో ఉంగరపు వేలికి ధరించాలి.
బుధ మహర్ధశ పదిహేడేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో బుధ జపం చేయించిన తర్వాత జాతిపచ్చను బంగారముతో చేయించి చిటికెన వేలు పెట్టుకోవాలి.
గురు మహర్ధశ పదహారేళ్ల పాటు ఉంటుంది.
ఈ మహర్ధశ కాలంలో గురు జపం చేయించిన తర్వాత కనక పుష్యరాగం అనే రత్నాన్ని బంగారంతో చేయించి చూపుడు వేలికి పెట్టుకోవాలి.
శుక్ర మహర్ధశ ఇరవై ఏళ్ల పాటు ఉంటుంది. శుక్ర జపం చేయించిన వజ్రాన్ని బంగారంలో చేసి ఉంగరపు వేలికి పెట్టుకోవాలి.
శని మహర్ధశ పందొమ్మిదేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో శని జపం చేయించిన నీలాన్ని వెండిలో మధ్య వేలికి ధరించాలి.
రాహు మహర్ధశ పద్దెనిమిదేళ్ల పాటు ఉంటుంది.
ఈ మహర్ధశ కాలంలో రాహు జపం చేయించిన గోమేధికాన్ని వెండిలో ధరించాలి. ఈ ఆభరణాన్ని మధ్య వేలికి ధరించాలి.
కేతువు మహర్ధశ ఏడేళ్ల కాలం ఉంటుంది. కేతు జపం చేయించిన వైఢూర్యాన్ని వెండిలో మధ్య వేలికి పెట్టుకోవాలి.
నవరత్నములు ధారణా లాభములు.......
నవగ్రహ వైభవం లో చెప్పిన విధంగా మధుమేహము[చెక్కెర వ్యాధి] కలవారు, స్త్రీ లోలురు, రాజకీయవేత్తలు, ఆకర్షణ లోపము వున్నవారు వజ్రము ధరిచుతుపయుక్తము.
నీలం రాయి కలిగిన ఉంగరాన్ని దరిద్రముతో బాధపడుచున్న వారు, కీళ్ళ నొప్పులు కలవారు, గ్యాస్ ట్రబుల్, కుసుమ వ్యాధులు కలిగిన వారు దీన్ని ధరించాలి.
వైఢూర్యానికి విష జంతు బాధా నివారణము అనే పేరుకూడా ఉంది. ప్రతివాద భయము తొలగుటకు, సంతాన లోప నివారణకు ఉపయోగించపచ్చు.
గోమేధకమును నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ధరించవచ్చు. వ్యాపారములందు రాణించి, లాభాలను పొందలేని వారు గోమేధికమును ధరించాలి.
పుష్యరాగ ఉంగరాన్ని దేవభక్తి, సూక్ష్మజ్ఞానము కలగాలంటే ధరించవచ్చు.
పగడమును రాజకీయ వేత్తలు, శత్రుభయంతో బాధపడుతున్నావారు, దీర్ఘవ్యాధి గలవారు ఈ ఉంగరాన్ని ధరించడం మంచిది.
అలాగే ముత్యమును అన్ని సమయాలందు, ప్రతి ఒక్కరు ధరించవచ్చును. కుటుంబ సౌఖ్యములేని వారు సోమవారము రోజున ముత్యముతో కూడిన ఉంగరాన్ని ధరిస్తే మంచిది. ముఖ్యంగా ఈ రాళ్లను ధరించే వారు వారి వారి జాతకములు జ్యోతిష నిపుణుల ను సంప్రదించి ధరించాలి. లేకపోతే సమస్యలను మంచికన్న చెడును ఎదుర్కొనవలసి ఉంటుంది.
#తెలుసుకుందాం