* చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి నిమ్మలకు విన్నవించిన ఎమ్మెల్యే ముత్తుముల.
* ఏపీ సచివాలయంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామ నాయుడు గారిని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, పూడికలతో నిండిన చెరువులను అభివృద్ధి చేయటం ద్వారా పంట పొలాలకు భూగర్భ జలాలు సంవృద్దిగా అందుతాయని రైతులకు మేలు చేసే చెరువుల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.. అదే విధంగా గిద్దలూరు పట్టణంలోని సగిలేరు వాగు మరమ్మత్తులకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందచేసినట్లు, సగిలేరు వాగు మరమ్మత్తులకు కూడా త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి గారు చెరువులు, సగిలేరు వాగు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.. #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు


