🌷🌷🌷దైవ మర్మములు - Bro. Bakht Singh🌷🌷🌷
🛐 Daily Devotional 🛐
Theme of the Month: దైవ మర్మములు
Friday, January 9
*''దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై యున్నది'' (రోమా 14:17).*
ఇహలోక ఆనందము ఒకరు కలిగియున్న ఆస్తి వలన కలుగుచున్నది. తాము కోరినదెల్ల తమకు లభించినచో సంతోషించగలమని మనుష్యులు తలంచుదురు. అయితే త్వరలోనే, ఆలస్యముగనో నీ జీవితమందు ఆశలు నిరాశలగును, నిరీక్షించినవి దొరకక పోవచ్చును. ఏవేవి నీకు సంతోషము నివ్వగలవని నీవు తలంచితివో వాటన్నిటి యొక్క ఖాళీతనము అంతమున ఋజువు చేయబడును. పాపుల కొరకై మరణించిన జీవము గల, ప్రేమ గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీకు సంతోషము నివ్వగలవాడు. అయితే ఆయనిచ్చు సంతోషము ఇహలోక సంబంధమైనది కాదు గాని తన స్వంత పరలోక సంతోషమే.
మనలో నివసించుటకై వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వరమగు నీతిని మనలో ధారాళముగా పనిచేయనిచ్చును. ఆ నీతియే మన సంతోషము, సమాధానములకు మూలమగుచున్నది. దేవుని యెదుటను, మానవుల యెదుటను నీతిమంతులముగా కావలెనని ఎన్నో ప్రయాసలు పడెదరు. అయితే మానవులు దేనిని 'నీతి' అని అనుకొనుచున్నారో దానిని దేవుడు 'మురికిగుడ్డలు' అని అనుచున్నాడు (యెషయా 64:6). అది యూదుల నీతియైనా, హిందువులు నీతియైనా, బౌద్ధుల నీతియైనా, లేక నామకార్థ క్రైస్తవుల నీతియైనా దేవుడు దానిని మురికి గుడ్డలని అనుచున్నాడు. తన నీతిని ఉచితమైన ప్రేమా ఈవిగా నీకొసగుటకు ప్రభువు సిద్ధముగా నున్నాడు. ఆ ప్రేమకు సమాధానమును కలిపి దానిని నిత్యత్వముతో హెచ్చించుచున్నాడు. అదే కృప, ఆ ప్రేమా సమాధానములకు పరిశుద్ధాత్మ ద్వారా సంతోషమును కలుపుచున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను నీలోనికి రానిచ్చి పనిచేయనిచ్చినచో దేవుని స్వంత నీతితో నీవు నీతిమంతుడవగుదువు. తత్ఫలితముగా దేవుని సంతోషముతో నీవు గంతులు వేయగలవు. దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడవను నిశ్చయత నీ హృదయములో నన్ను ఆత్మ కలిగించుట ద్వారా నీవు దినదినమునకు ఆయనయందు అధిక ఐశ్వర్యవంతుని గాను, పవిత్రునిగాను, బలవంతుని గాను కాగలుగుట నీవు చూచెదవు.
Download Daily Devotions by Brother Bakht Singh Mobile App, using link: https://rb.gy/iv32b1 #📀యేసయ్య కీర్తనలు🎙 #😇My Status
Download Songs Book Songs of Zion Mobile App, using link: https://rb.gy/ua3tlm
Listen to Songs of Zion by visiting Hebron World Youtube Channel: https://www.youtube.com/@Hebron_World
To Read Books written by Brother Bakht Singh, visit: https://hebronworld.com