ShareChat
click to see wallet page
search
సూర్య నమస్కార శ్లోకం...........!! సూర్యుడు, భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు, దివాకరుడు, ఆదిత్యుడు, మార్తాండుడు, మిత్రుడు ఇలా ఎన్నో నామాలు. సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవమని, కర్మ సాక్షి అని అంటారు. మనం సూర్యనారాయణమూర్తి అని కొలుస్తాము. స్వామికి అర్ఘ్యం అంటే ఇష్టం. కాని అందరికీ అర్ఘ్యం ఇవ్వటం కుదరదు కదా. అందుకే నమస్కారం చేస్తే చాలు. అయన నమస్కార ప్రియుడు కూడా. ఈ స్తోత్రం రోజు మూడుకాలాలో పఠిస్తే మంచిది. లేదా రోజూ పూజ చేసేసమయంలో ముమ్మారు పఠించినా చాలు. ఉదయే బ్రహ్మరూపశ్చ, మధ్యాహ్నేతు మహేశ్వరః అంతకాలే స్వయంవిష్ణుః త్రిమూర్తించ దివాకరం. ముఖ్యంగా ఆదివారం స్వామికి నమస్కారం చేసి ఈ శ్లోకం పఠిస్తే మంచిది. సూర్యబింబ(కిరణ) స్వరూప వర్ణన చేసే శ్లోకమిది! ఉదయభానుని లేతకిరణాలు బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్నకాల మార్తాండుని ప్రచండతాపంతో కూడిన కిరణాలు మహేశ్వరస్వరూపంగా, అలసిన శరీరాలకు హాయి నొసగి విశ్రాంతికి కారణమయ్యే సాయం సంధ్యాకిరణాలు విష్ణుస్వరూపంగా భావన చేయబడింది! #☸🙏సూర్యనారాయణ స్వామి #🙏 Sri Surya Narayana Murthy
☸🙏సూర్యనారాయణ స్వామి - ShareChat