🌺 అవధూత 🌺
అవధూత ఒకరి అదుపులో ఉండడు. స్వేచ్చగా సంచరిస్తుంటాడు. అవధూత వస్త్రము ధరించినను ధరించకపోయినను ఒక్కటే. అవధూతకు ధర్మాధర్మములు, పవితతాపవిత్రలు లేవు. కర్మవాసనలు వానికి అంటవు. ఎల్లప్పుడు అతడు నిర్లిప్తుడై ఉంటాడు.
ఎడతెగక పారు నదులచేత ఎల్లప్పుడు నిండుచున్న సముద్రం ఎట్లా గంభీరంగా ఉంటుందో అట్లే సమస్త విషయములు అనుభవిస్తున్నప్పటికీ యోగి విషయాసక్తుడుగాక సదా శాంతినే పొందుతుంటాడు.
అవధూత దేనిచేతను నిరోధింపబడడు. వానికి. పుట్టుక లేదు, బంధనము లేదు... అతడు సాధకుడు గాడు. ముముక్షువు గాదు. ముక్తుడు గాడు - ఎందువల్లనంటే వాస్తవానికి అతడెప్పుడూ ముక్తుడే గనుక.
ఈ విధంగా ఆవధూతను గురించి కొంత వివరించి చెప్పి అ తర్వాత ఆ లక్షణములకు తననే లక్ష్యముగా దత్త ప్రభువు నిరూపించి చెప్పాడు.
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


