ShareChat
click to see wallet page
search
సంక్రాంతి మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు భోగి పండుగ. రెండవ రోజు సంక్రాంతి. మూడవ రోజు కనుమ పండుగ (పశువుల పండుగ). భోగి పండుగనాడు కష్టకాలంలో వాడుకున్న చింపిరి చాపలు, విరిగిన కొయ్యలు భోగి మంటల్లో వేసి చలిని ఊరి నుంచి తరిమి వేసి వెచ్చని ఊహలతో భోగభాగ్యాలను చవి చూడటం మొదలు పెడతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుంది కాబట్టి ఆనాటి సాయంకాలం పిల్లలపై భోగి పండ్లు పోయడం ఆచారం. భోగిపండ్లుగా రేగుపండ్లను వాడుతారు. వీటినే బదరీ ఫలాలంటారు. ఇవి విష్ణుమూర్తి స్వరూపాలే. పాపలపై ఆ ఫలాలను పోస్తే నిండార విష్ణుమూర్తి కరుణాకటాక్షాలు లభిస్తాయని విశ్విసిస్తారు. రెండవ రోజు సంక్రాంతి. ఆ రోజు ఆడపడుచులను, అల్లుళ్లను ఆహ్వానించి ఆనందంతో పండుగ జరుపుకుంటారు. మూడవ రోజు కనుమ. ఆ రోజు ఎవరూ ఎక్కడికీ ప్రయాణం చేయరు. ఆ రోజును ఆవులను, గేదెలను, కోడ దూడలను, పెయ్యలను, ఎడ్లను పసుపు కుంకుమలతో అలంకరించి తప్పెట్లు తాళాలతో ఊరేగిస్తారు. ఈ విధంగా సంక్రాంతిని మూడు రోజుల పాటు చూచువారలకు చూడ ముచ్చటగా జరుపుకుంటారు. #పవిత్ర ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం #ఉత్తరాయణం #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 #✨సంక్రాంతి స్టేటస్🌾
పవిత్ర ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం - ShareChat